రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటి మార్కెట్ మార్డ్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరి నాగసుబ్బమ్మ(50) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని కొత్తపేటలో నివాసం ఉంటున్న నాగసుబ్బమ్మ నూనె వ్యాపారం చేస్తుంది.
ఈక్రమంలో మాసాపేట రెడ్డివారిపల్లికి నడుచుకుంటూ వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్ ఆమెను ఢీకొంది. ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని 108లో రాయచోటి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.