
పాట్నా: గోడ కూలడం, తొక్కిసలాట, మునిగిపోవడం వంటి వాటి కారణంగా బిహార్‌లో 30 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు బిహార్ ప్రజలు జరుపుకునే ఛాత్ పండగ సందర్భంగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గోడ కూలిన ఘటనలో, ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో, మరో 26 మంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్సవాల సందర్భంగా మునిగిపోయి మరణించారు. ఛాత్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. లక్షలాది మంది ఈ పండుగను దేవాలయాల వద్ద, ఘాట్‌ల వద్ద స్నానాలాచరించి జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment