సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్‌సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి మేరుగ నాగర్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్‌సీపీ సునామీ రాబోతుంది. పేదలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్‌లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.
అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం. ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారు. డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment