పోలింగ్ ముగిసినా కానీ ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. కొన్ని చోట్ల టీడీపీ దాడులు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతోంది. రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.