
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం బయటపడిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్కిల్ స్కాంపై చర్చ జరిగింది. స్కాంకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు వివరాలు వెల్లడించారు.
తాజాగా స్కిల్ స్కాంపై మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మేరుగ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి. స్కిల్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. పథకం ప్రకారమే రూ. 371 కోట్లను దోచుకున్నారు. స్కిల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయించాడు. దళిత ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. స్కిల్ స్కాం నుంచి చంద్రబాబును ఎవరూ కాపాడలేరు.
Comments
Please login to add a commentAdd a comment