AP State Skill Development Corporation
-
‘షెల్’ మింగిన ‘స్కిల్’
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబే స్వయంగా ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేయడం గమనార్హం. అనంతరం తన బినామీ ముఠాతో కథ నడిపించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోయినా 10 శాతం ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేలా చంద్రబాబే ఆదేశించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు వారించి ఏకంగా నోట్ ఫైళ్లలోనే అభ్యంతరం తెలిపినా బేఖాతర్ చేస్తూ షెల్ కంపెనీలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఆ నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకే చేరిపోయాయి. ఈ మొత్తం అవినీతి బాగోతంలో చంద్రబాబు సర్వం తానై వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నిప్పులా బతికానంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబు అవినీతి వ్యవహారాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాల ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. బాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూ పొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చు కున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులిచ్చారు. అంతా బాబు ముఠానే.. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు. తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నో రూల్స్... ‘ఏఐ’.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లు ఎందుకు చెల్లించాలని సునీత లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ముందు ఏదో ఒక జిల్లాలో పైలట్‌గా అమలుచేసి తరువాత నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని పీవీ రమేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాక సింగపూర్‌కు ఎలా వెళ్లాయి..? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయనే విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది. చంద్రబాబు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఇప్పటికే సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్(చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. కడిగిపారేసిన కాగ్ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్( కాగ్) కూడా బాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని పేర్కొంది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2018లో ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ► గత ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ► మొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. ఉప్పందించిన పుణె సామాజిక కార్యకర్త 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. మొదటి ఎఫ్ఐఆర్లో లేనప్పటికీ అందుకే తుది చార్జ్‌షీట్‌లో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సిట్ కేసును పకడ్బందీగా నమోదు చేసింది. చంద్రబాబుతోసహా ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది. -
ఏ–1 చంద్రబాబు అరెస్ట్
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. మొత్తంగా 40 ఏళ్ల రాజకీయ జీవితం... కనుసన్నలతో రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసించగలరని సన్నిహితులు కీర్తించే నాయకుడు.. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. ఏలేరు కుంభకోణం మొదలు ఎన్నో అవినీతి ఆరోపణలు.. రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లకు ఆస్తులు పెరిగాయన్న విమర్శలు.. ఎన్నో కేసులు.. స్టేలు.. ఎన్నడూ కోర్టుమెట్లెక్కిందే లేదు.... అరదండాలు ఆయన అరచేతులను తాకలేదు... కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అది తన పని తాను చేసుకుపోతుంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క చిన్న గాలివానకే కూలిపోయినట్లు.. సప్త సముద్రాలను ఈదిన గజ ఈతగాడు చిన్న గుంతలో పడి ప్రాణాలొదిలినట్లు.. ఓ చిన్న స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలతో పోలిస్తే ఇది సముద్రంలో ఇసుకరేణువంత... ఆయన ఆస్తులలో 0.0000001 శాతం కూడా లేనంత.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణమిది. అధికారులు వారిస్తున్నా కాదని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు షెల్ కంపెనీలకు తరలించారు. కమీషన్లు పోను తిరిగి రూ.241 కోట్లు చంద్రబాబుకు చేరాయి. స్పష్టమైన ఆధారాలు దొరకడంతో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మాజీ సీఎం కావడంతో పటిష్టమైన భద్రత మధ్య హెలికాఫ్టర్‌లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకురావాలని అధికారులు భావించినా రోడ్డుమార్గంలో.. అదీ తన కాన్వాయ్‌లో వస్తానని చంద్రబాబు పట్టుబట్టారు. అదేం విచిత్రమో.. వలయంలా నిలబడి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన ప్రజలు, నిరసనలతో దారిపొడవునా బోలెడంత ప్రచారానికి పనికివస్తారనుకున్న పార్టీ శ్రేణులు ముఖం చాటేయడం అరెస్టును మించిన షాక్‌కు బాబును గురిచేసింది. విజయవాడ చేరుకున్న అనంతరం సీఐడీ కార్యాలయంలో బాబును అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో నిందితులు ఏ–1 చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ, ఏపీఎస్ఎస్డీసీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్ కర్, టీడీపీ ప్రభుత్వంలో ఫైనాన్సియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్‌టెక్ ఎండీ వీరితోపాటు మొత్తం 40మందిని నిందితులుగా పేర్కొన్నారు. సాక్షి, అమరావతి /నంద్యాల/ నెట్వర్క్: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబు నాయుడును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతోసహా బట్టబయలైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని సిట్ నిర్ధారించింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ బయటపడిన కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జిషీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. కాగా, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్నది తాజాగా బయటపడటం గమనార్హం. దాంతో ఈ కేసులో లోకేశ్‌ను కూడా విచారించాలని సిట్నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబుతోసహా సిట్ ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లయింది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు విఫలయత్నం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన అవినీతి బండారం బయట పడటంతో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు యత్నించారు. ఈ కేసులో షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ యాదవ్‌లకు సిట్ నోటీసులు జారీ చేయడంతో బెంబేలెత్తిన ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారు. ఆయన బెదిరింపులతోనే పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్‌కి పరారయ్యారు. దాంతో సిట్ వెంటనే అప్రమత్తమైంది. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్షులు, ఇతరులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసి కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని గుర్తించారు. అప్పటికే ఆయన అవినీతి ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ సిట్ అధికారులు శుక్రవారం రాత్రి కార్యాచరణకు దిగారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు బయలుదేరింది. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అప్పటికే చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దాంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలు వద్ద మోహరించారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ తదితరులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్‌కు వెళ్లే రహదారిలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నుంచి అక్కడకు వెళ్లారు. సిట్ అధికారులు చంద్రబాబును కలవనివ్వకుండా టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డిలు సిట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు తట్టినా ఆయన బయటకు రాలేదు. మరోవైపు టీడీపీ నాయకులు ఎంతగా రెచ్చిపోతున్నా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ వారికి ఓపికగా సమాధానం ఇస్తూ.. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు వేచి చూశారు. 2.30 గంటలపాటు నచ్చజెప్పి.. చంద్రబాబు వద్దకు వెళ్లడానికి అడ్డుగా ఉంచిన వాహనాలను ఎంత సేపటికీ తొలగించకపోవడంతో పోలీసులు వాటికి తాడు కట్టి బుల్డొజర్ సాయంతో పక్కకు జరిపారు. ఆ విధంగా సిట్ అధికారులు శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి 5.30 గంటల వరకు టీడీపీ నేతలు, న్యాయవాదులతో మాట్లాడుతూ నచ్చజెప్పేందుకు యత్నించారు. పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య చర్చలు, వాగ్వాదం జరుగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు బస్సు నుంచి కిందకు దిగారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి తమకు సహకరించాలని పోలీసు అధికారులు ఆయన్ను కోరారు. ‘ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు.. అందులో నా పేరు ఉందా.. నా పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేయడానికి వచ్చారు?’ అని బాబు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ వేశామని, అందులో మీ పేరు ఉందని వారు తెలుపగా, కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వాలని బాబు పోలీసులను కోరారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ ఎలా అరెస్ట్ చేస్తారని న్యాయవాదులు, చంద్రబాబు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్ని వివరాలు అప్పుడే ఇస్తామని చెబుతూ పోలీసులు చంద్రబాబుతో సంతకం తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు వాహనానికి కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డం పడుకోవడానికి వెళ్లగా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకెళ్తామని సిట్ అధికారులు చంద్రబాబుతో చెప్పారు. అందుకు ఆయన తిరస్కరించారు. తాను తన వాహనంలో రోడ్డు మార్గంలోనే వస్తానన్నారు. అందుకు సిట్ అధికారులు సమ్మతించి ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. మధ్యలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడక్కడ తప్ప ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడ లేదు. బాపట్ల జిల్లా జే.పంగలూరు మండలం ముప్పవరం గ్రామం సమీపంలో టీడీపీ నేతలు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి కాన్వాయిని ముందుకు పంపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు ముందస్తు ప్రణాళికతో కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులను దుర్భాషలాడుతూ, తోసివేస్తూ దూసుకువచ్చారు. కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు టైర్లు కాల్చి, చేతిలో పెట్రోల్ బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. దాంతో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్ అరగంటకుపైగా నిలిచిపోయింది. టీడీపీ కార్యకర్తలు సాధారణ ప్రజలను కూడా దూషిస్తూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పెషల్ పార్టీ పోలీసులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వారి అంతు చూస్తామని హెచ్చరిస్తూ జెండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద అల్లరి మూకలను చెదరగొట్టి కాన్వాయ్‌ని ముందుకు పోనిచ్చారు. గుంటూరు శివారులోని లాల్పురం వై.జంక్షన్ టీడీపీ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సిట్ అధికారులు చంద్రబాబును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బాబుపై ప్రశ్నల వర్షం సిట్ విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించ లేదు. అధికారులు ఏ ప్రశ్నలు వేసినా సరే తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయాను.. అంటూ సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత చంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. రాత్రి 7 గంటల అనంతరం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొదలు పెట్టారు. చంద్రబాబు లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ఆయన న్యాయవాదులను లోపలికి అనుమతించారు. అనంతరం ఓ గదిలో చంద్రబాబును కూర్చోబెట్టి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ, ఇతర అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. సీమెన్స్ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విధానంపై సిట్ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్వం తానై చంద్రబాబు వ్యవహరించారనడానికి ఆధారాలను ఆయన ముందు ఉంచి ఒక్కొక్కటిగా ప్రశ్నించారు. అసలు సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ కుదుర్చుకోవడం ఏమిటి? డిజైన్‌టెక్ కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారు? అసలు ప్రాజెక్ట్ వ్యయం రూ.3,300 కోట్లుగా ఎలా నిర్ధారించారు? ముఖ్య కార్యదర్శిని పక్కనబెట్టి మరీ ఏపీఎస్ఎస్డీసీ ఎండీ గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు ఎందుకు కట్టబెట్టారు? ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులు సమకూర్చకుండా ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.371 కోట్లు ఎందుకు విడుదల చేశారు? అందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు నోట్‌ఫైల్‌లో లిఖిత పూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేశారు? షెల్ కంపెనీల ద్వారా ఆయనకు చేరిన నిధుల విషయం ఏమిటి.. ఇలా పలు ప్రశ్నలను ఒక్కొక్కటిగా అడిగారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీ సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తుండగానే ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. తాము చంద్రబాబును కలవాలని అధికారులతో చెప్పారు. దాంతో చంద్రబాబు విచారణకు కాసేపు విరామం ఇచ్చి కుటుంబ సభ్యులను కలిసేందుకు అధికారులు అనుమతించారు. సిట్ కార్యాలయంలో ఓ గదిలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అరగంటకుపైగా మాట్లాడారు. అనంతరం సిట్ అధికారులు మరోసారి విచారణను కొనసాగించారు. ఈ విధంగా శనివారం అర్ధరాత్రి వరకు.. అంటే 6 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయన నిద్రించేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున న్యాయస్థానంలో హాజరు పరుస్తారని భావిస్తున్నారు. నడిరోడ్డుపై ప్రజాస్వామ్యం హత్య: చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడంపై నంద్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశానో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తప్పు చేసుంటే నిరూపించి కేసు పెట్టాలన్నారు. ఏదేమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్‌కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్‌కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్‌కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్‌కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ -
స్కిల్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం బయటపడిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్కిల్ స్కాంపై చర్చ జరిగింది. స్కాంకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు వివరాలు వెల్లడించారు. తాజాగా స్కిల్ స్కాంపై మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మేరుగ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి. స్కిల్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. పథకం ప్రకారమే రూ. 371 కోట్లను దోచుకున్నారు. స్కిల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయించాడు. దళిత ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. స్కిల్ స్కాం నుంచి చంద్రబాబును ఎవరూ కాపాడలేరు. -
దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు. ‘స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుంది. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది. సీఎం జగన్ తన ప్రసంగంలో ఏమన్నారంటే... నిరుద్యోగుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే నిరుద్యోగులు,విద్యార్ధుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం గురించి ఈ సభలోనాలుగు మాటలు చెప్పాలి. స్కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారు అన్నది సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ తెలియాలి. అదే విధంగా సభ ద్వారా ప్రజలకు కూడా అవగతం కావాలి. అందుకనే ప్రత్యేకంగా ఈ అంశంపైన మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతో నాలుగు మాటలు సభ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. దోపిడీ– బాబుకి తెలిసిన స్కిల్ స్కిల్లింగ్ ద్వారా నిజంగా పిల్లల స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపర్చాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది... ఇది నిజంగా చంద్రబాబునాయుడు గారికే మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. ఇటువంటి స్కిల్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది, ఏ రకంగా ఒక వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి ? అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ స్కాం ఎలా ఉందంటే.. రూ.100 పనిచేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో.. ఈస్కాం కూడా అలాగే ఉంటుంది. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. అమెరికాలో కానీ, యూరప్ లో కానీ మీకు లాటరీ తగిలింది. 10 మిలియన్ డాలర్లు మీ పేరుమీద వచ్చాయి. అర్జెంటుగా మీరు రూ.10 లక్షలు డబ్బులు కట్టండి. అది కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన 10 మిలియన్ డాలర్లు వస్తాయని చెప్పి ఆ రూ.10 లక్షలు కట్టించుకుని వాటిని కూడా ఎత్తేసే కార్యక్రమం ఏమాదిరిగా జరుగుతుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ సీమెన్స్ పేరుతో పెద్ద స్కాం జరిగింది. స్కాం నడిపింది చంద్రబాబే... ఇలాంటి ఒక స్కాంను నడిపిన వ్యక్తి సాక్షాత్తూ నారా చంద్రబాబునాయుడు గారేనని నా ప్రసంగంలో రకరకాల ఆధారాలతో సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చూపిస్తాను. ప్రభుత్వం సొమ్ము రూ.371 కోట్లు. ఈ డబ్బు హారతి కర్పూరంలా మాయమైపోయింది. ఈ స్కాం గురించి మనం చర్చిస్తున్నాం. ఈ డబ్బు సెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ ద్వారా మరలా సెల్ కంపనీల నుంచి చంద్రబాబునాయుడు గారి దగ్గరకి వచ్చిన పరిస్థితి. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం... ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం. పార్టనర్స్ ఆఫ్ క్రైం ప్రొసీడ్స్ అనే పదానికి అర్ధం కూడా చెబుతుంది. అధికార దుర్వనియోగం పరిధిలోనికి కూడా వస్తుంది. కేబినెట్లో ఒకటి చెప్పి.. ఆ మేరకు ఒక జీవో విడుదల చేశారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం, జీవోతో సంబంధం లేకుండా వేరొక ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేసే కార్యక్రమం జరిగింది. ప్రజా ధనాన్ని దోచేయడంలో చంద్రబాబు గారి చాతుర్యం చూడాలంటే... దానికి సరైన ఉదాహరణ సరిగ్గా ఈ స్కిల్ స్కాం. ఇది రాష్ట్రంలో మొదలై విదేశాలకు కూడా సెల్ కంపెనీల ద్వారా పాకిన పరిస్థితి. ఆ తర్వాత అటునుంచి మరలా డబ్బులు మన దేశంలోకి, హైదరాబాద్‌లోకి వచ్చాయి. ఈ స్కాం మన సీఐడీతో మొదలు పెడితే జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ ఇలా ఏజెన్సీలన్నీ దర్యాప్తు చేస్తున్న స్కాం. ఇలా దోచేసిన సొమ్మును సెల్ కంపెనీల ద్వారా విదేశాలకు అక్కడ నుంచి మరలా దేశంలోకి తెప్పించి, దేశం నుంచి ఏకంగా చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం రూ.371 కోట్ల దోపిడీ... చంద్రబాబు గారు ఆయన మనుషులు ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి ఒకటి కాదు, రెండు కాదు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఏకంగా రూ.371 కోట్లు దోచేశారు. యూత్‌కు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా దోచేయడం అన్నింటికన్నా బాధాకరం. ఈ డబ్బు దోచేయడానికి చంద్రబాబుగారి విజన్ ఏంటో బాగా కనిపిస్తోంది. చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి ? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి ? చట్టానికి దొరక్కుండా ఏయే ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి ? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి ? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి ? ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకుని ఈవిజన్ రూపకల్పన చేసినట్టుగా రకరకాల అడుగుల్లో కనిపిస్తోంది. అవినీతికి విజన్... ఇవన్నీ ముందుగానే ఊహించుకుని ఇంత గొప్ప విజన్‌తో ఈ కార్యక్రమాలు చేసిన పరిస్థితులు చూస్తే.. ఒక క్రిమినల్ మాత్రమే ఈ విధంగా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ అతడు. చంద్రబాబు గారు జూన్ 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈస్కిల్ డెవలప్మెంట్ స్కాం ఊపిరి పోసుకుంది. దీనికోసం తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వంలో ఒక పూర్తి స్ధాయి చర్చలేదు. ఏదైనా ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు, మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సివచ్చినప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయి చర్చ జరగాలి. కానీ అటువంటిది ఎక్కడా చర్చ జరగలేదు.ఒక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు చేయించాలి. ఒక ఆలోచన ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందనేది పేపర్ మీద పెట్టి డీపీఆర్ చేయించాలి. అది కూడా లేదు. ఖర్చు ఎంతవుతుందనేది నిర్ధారణ చేయించాలి. అది కూడా లేదు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. సీమెన్స్ ఉద్యోగితో లోపాయికారి లాలూచీ... ఇది ఒక చంద్రబాబునాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది. సీమన్స్ ఇండియా అన్న కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడిని వాడుకుని ఈప్రాజెక్టు పేరుతో దోపిడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు అయితే.. ఇందులో ప్రభుత్వ వాటా పదిశాతం. అని చెప్పారు. 90 శాతం సీమెన్స్ పెట్టుకుంది అని చెప్పారు. ఒక ప్రైవేటు సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90శాతం పెట్టుకుందని స్కాంలో రూపకల్పన చేశారు. దాదాపుగా రూ.3000 కోట్లు ప్రైవేటు సంస్ధ అయిన సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రైవేటు కంపెనీ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇస్తుందా ? ఆలోచన చేయడానికైనా సాధ్యపడుతుందా ? చంద్రబాబు నాయుడు గారి అందమైన మొహాన్ని చూసి ఏమైనా ఇస్తున్నారా ? ఏరకంగా ఒక ప్రయివేటు సంస్ధ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది ? సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టును తీసుకోవాలనంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు ? దీనిలో ప్రభుత్వం వాటా ఎంత ? మిగిలి వారి వాటా ఎంత? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది. మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు ? ప్రతిస్ధాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది ? ఏ రకంగా నిధులు వస్తాయి? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది ? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది ? ఇలా అన్నిరకాల కోణాల్లోనూ ఆధ్యయనం చేసి... అవైలబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లోనికి తీసుకుని రావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను కూడా సర్టిఫైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు. ఇదివరకే చెప్పుకున్నట్టు.. ముందస్తుగానే ఆ కంపెనీలో ఉన్న లాలాచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు.. తమకు తాముగా తయారుచేసుకున్న ఒక అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక నోట్ పెట్టించారు. అంటే వాళ్లంతట వాళ్లే ఒక మనిషిని గుర్తించి, ఆ మనిషి దగ్గర నుంచి ఆ కంపెనీ పేరుతో ఒక ప్రతిపాదన పెట్టించి, దాన్ని ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా విచారణచేయకుండా ఆ అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. అన్ని రూల్స్‌ను బేఖాతరు చేస్తూ... ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి కానీ, ఆ పై స్ధాయి కానీ అన్నింటినీ టోటల్‌గా ఓవర్ లుక్ చేశారు. ఏకంగా స్పెషల్ ఐటెంగా కేబినెట్లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్లోకి రావడం వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అ«ధ్యయనం చేయని ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది.. నియామకాలకు, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ బాబుగారి పాలనలో ఆన్నీ పూర్తిగా బేఖారు చేసిన పరిస్థితులు. ఆయన పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, పద్దతులు, ట్రెడిషన్స్ అన్నీ కూడా బేఖాతర్. ఆయన చెప్పిందే వేదం అన్నట్టు నడిపించారు. చంద్రబాబు టైంలోనే బయటపడిన స్కాం... ఈ స్కాం అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తవ్వింది కాదు. చంద్రబాబు గారు హయాంలోనే దీన్ని సెంట్ కనిపిస్తూ వచ్చింది. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు వీరి దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఎవరైనా ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తూ ఉంటే ఎందుకు వీళ్లంతా మౌనంగా ఉన్నారు. ఇంతకముందు నేను చెప్పాను. దోచుకో, పంచుకో, తినుకో ( డీపీటీ ) ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు. ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. ఒప్పందంలో పచ్చి అవినీతి.. ఈ ఒప్పందం గురించి వస్తే.. ఇంతకంటే పచ్చి అవినీతి ఎక్కడా చూసి ఉండం. కారణం కేబినెట్లో ఒక విధంగా, ఆ కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చిన జీవోలో ఒక విధంగా ఉండి.. ఒప్పందం ఇంకో విధంగా ఉంది. కనీసం అదైనా కేబినెట్‌కు వచ్చిందో ?లేదో ? వచ్చిందని జీవో విడుదల చేశావు. కనీసం దాన్నైనా ఒప్పందంలోకి తీసుకువచ్చావా అంటే అదీ లేదు. కేబినెట్లోకి తీసుకొచ్చి, జీవో రూపంలో ఇచ్చింది ఒకటైతే, దానికి విరుద్ధంగా ఒప్పందం మరోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేబినెట్ ఆధారంగా జీవో విడుదల చేశారు. ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90శాతం ఖర్చును సీమెన్స్ మరియు డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని మిగిలిన పది శాతం ఖర్చును అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన ప్రాజెక్టు వ్యయంలో పదిశాతం అంటే పనులతో కలుపుకుని రూ.370 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో రాశారు. మిగిలిన రూ.3వేల కోట్లు సీమెన్స్ సంస్ధ ఈ ఒప్పందం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా... ప్రైవేటు సంస్ధ ఉదారంగా మనకు ఇస్తుందని కేబినెట్లోకి తీసుకొచ్చారు. జీవో విడుదల చేశారు. ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చిందని అంటే.. ఈ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదారంగా మనకు ఉచితంగా ఇచ్చినట్టు అర్ధం. అయితే కేబినెట్ నిర్ణయానికి ఈ జీవోకు విరుద్ధంగా ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ఒప్పందానికి వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం ఇవ్వవలసిన 10 శాతం కంట్రిబూషన్ కాస్తా ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌గా మారిపోయింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం కంట్రిబ్యూషన్‌ను ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌గా మార్చేశారు. మొత్తం ఒప్పందం చూస్తే.. కేబినెట్ నిర్ణయం, తద్వారా వచ్చిన జీవోకు పూర్తిగా విరుద్ధంగా ఒప్పందం స్వరూపమే మార్చివేసారు. స్లైడ్స్ ద్వారా కేబినెట్ నిర్ణయం, జీవో ఆ తర్వాత ఎంఓయూను అసెంబ్లీలో వివరించిన సీఎం. కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపి జీవో ఇచ్చారు. జీవో తర్వాత ఒక తప్పుడు వ్యవస్ధను క్రియేట్ చేశారు. ఆ తర్వాత వీళ్ల చేసుకున్న ఒప్పందం చూస్తే.. పదిశాతం కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద రూ.330 కోట్లు ఇచ్చేటట్టుగా నామకరణం చేసారు. ఇక్కడ స్కాంకు బీజం పడింది. కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో ఏ లెటర్ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్న వివరాలేవీ పేర్కొనలేదు. అన్నీ ఖాలీలు ఉంచారు. ఒప్పందం వివరాలూ మాయం.... ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాలీగా విడిచిపెట్టారు. కనీసం ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు ? జీవో వేరు, ఒప్పందం వేరు. చంద్రబాబునారి స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టు పై ఈరకంగా ఒప్పందాలు జరుగుతాయా ? ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా ? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అన్నదానికి ఏ రకంగా అడుగులు పడ్డాయన్నది ఊహకందని విధంగా జరుగుతుంది. ప్రభుత్వం నుంచి పదిశాతం డబ్బులు విడుదల చేసినప్పుడు, సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ఉదారంగా సీమెన్స్ నుంచి మనకు ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే... ఐదు దఫాల్లో కేవలం మూడు నెలలు కాలంలోనే ప్రభుత్వం రూ.370 కోట్లు విడుదల చేసింది. అంటే ప్రభుత్వం నుంచి ఇన్స్టాల్మెంట్ పోతుంది ఆ మొత్తం సెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్లీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. డబ్బులు ఇవ్వడం వీళ్లు రూట్ చేసుకోవడం.. వీళ్లకు రావాల్సింది తీసుకోవడం, మరలా సెకెండ్ ఇన్స్టాల్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను బటన్ నొక్కితో డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు బటన్ నొక్కితే అంతా ప్రభుత్వ ఖాతా నుంచి అటు తిరిగి, ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డీపీటీ కార్యక్రమం. ఇంత దారుణంగా జరిగాయి. ఈ డబ్బు విడుదలపై ఆర్ధికశాఖ అధికారులు ప్రశ్నిస్తే...ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారంటే. సాక్షాత్తూ చంద్రబాబే. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో .. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు తాను నోట్ ఫైల్లో చెప్పారు. ఇంకోక నోట్ ఫైల్లో .. చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్‌పై రాశారు. ప్రధాన ముద్దాయి చంద్రబాబే... ఈ స్కాంలో ఇన్ని సాక్ష్యాధారాలు నేను చూపిస్తున్నాను. చంద్రబాబు గారు ప్రధాన ముద్దాయి అవునా ?కాదా ? అని చెప్పడానికి ఇంకా నిదర్శనాలు కావాలా అని అడుగుతున్నాను ? ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఇక్కడ మన అధికారులే కాదు. సీమెన్స్ సంస్ధ అధికారులు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. సీఆర్పీసీ 164 కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు, తమకు ఎలాంటి సంబధం లేదని కోర్టులో చెప్పారు. ఇది సీమెన్స్ వాళ్లు అంతర్గతంగా విచారణ చేసుకుని ఇచ్చిన రిపోర్టు. వాళ్లు 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఒక అంశం అయితే... ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు తమకూ ఎలాంటి సంబందం లేదని... వాళ్లు కోర్టుకు తెలిపడం మరొక అంశం అయితే తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజిమెంట్‌కు కానీ, లీగల్ టీంకు కానీ సంప్రదించలేదని సీమెన్స్ కోర్టుకు తెలియజేశారు. అంతే కాకుండా సీమెన్స్ ఎలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ ఆర్ధిక సహాయంతో కూడిన కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించలేదని, ఇలాంటి స్కీంలు ఏవీ కూడా తమ సంస్ధలో లేవని చెప్పారు. వాళ్ల అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అధికారికంగా అందజేశారు. అంటే రూ.370 కోట్లు డబ్బులిచ్చారు. ఆ డబ్బులు మాకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. అంటే ఈ డబ్బులు ఎవరికి పోయాయి ? అటు తిరిగి ఇటు తిరిగి సెల్‌కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకునే కార్యక్రమం జరుగుతుంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నామని ఆలోచన చేయమని అడుగుతున్నాను. రూ.370 కోట్లు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఆయన మనుషులు పూర్తిగా తినేశారు. ఈ డబ్బు ఒకటి రెండు కాదు ఇప్పటివరకు ఆనేక సెల్‌కంపెనీల ద్వారా చేతులు మారి మనీల్యాండరింగ్ చేసి వీళ్ల చేతుల్లోకి వచ్చింది. వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2018 జూన్‌లో అంటే వాళ్ల ప్రభుత్వంలోనే ఒక విజిల్ బ్లోయర్ ఈ స్కాం గురించి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఏసీబీ విచారణ మొదలు పెట్టి.. ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాలతో విచారణ ముందుకు కొనసాగించకుండా ఏసీబీ ఆ ఫైలును పక్కనపెట్టేశారు. విచారణనూ అడ్డుకున్నారు... ఏసీబీని విచారణ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు. ఏసీబీ రిపోర్ట్స్ టు సీఎం. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి. ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా సెన్ వ్యాట్ కోసం క్లెయిమ్ చేశాయి. ఎంత గొప్పగా వీళ్లు రచన చేసినా ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే... దేవుడి మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు ఎక్కడో కచ్చితంగా పడతాయి. ఇన్ని కోట్లరూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. ఈ డబ్బులు బోగస్ ఇన్వాయిసెస్తో సైఫనాప్ చేసినట్టుగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. 2017లోనే ఇది బయటపడింది. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఇది బోగస్ ఇన్వాయిసెస్తో సైఫనాప్ చేసినట్లు చెప్పారు. వాళ్లు బయటపెట్టినా బాబుగారి ప్రభుత్వంలో స్పందన లేదు. ఎందుకు స్పందించలేదు అంటే... ఈ స్కాంలో సాక్షాత్తూ చంద్రబాబునాయుడు గారే అడుగులు వేయించారు. చివరకు సీమెన్స్ సంస్ధ అంతర్గత విచారణ చేసి వాళ్లు తేల్చిన విషయాలు కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లో మీడియా గగ్గోలు ఈ విషయాలన్నింటినీ మన సీఐడీ దర్యాప్తు చేస్తూ.. స్కాంకు సహకరించిన వారిని అరెస్టు చేస్తుంటే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుంది. ఆసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్ల బాధ వర్ణనాతీతం. ఇంత దారుణమైన స్కాం జరుగుతుంటే... ఇన్ని ఆధారాలతో రుజువయ్యే పరిస్థితులు కనిపిస్తుంటే.. దీని మీద అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా చెబుతున్నాయి. నిజమేమిటంటే ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురిని అరెస్టు చేసి ఈడీ ట్వీట్ కూడా చేసింది. అందులో ఏముందంటే సీమెన్స్ ఇండస్ట్రీ ఎక్స్ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైయివేటు లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి వాళ్లను పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి, 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. పట్టుబడిన గజదొంగల ముఠా... ఇంత దారుణంగా స్కామ్ చేసి పట్టుబడిన తర్వాత వీళ్లు దొరికిపోతున్నారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగలముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తట్టుకోలేక ఆక్రోషంతో బాధపడుతున్నారు. బమ్మిని తిమ్మిని చేయడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇవి వాస్తవాలైతే... ఇవేవీ వాస్తవాలు కాదని అటు తిప్పి, ఇటు తిప్పి కథలు, కథలు అల్లి చంద్రబాబును కాపాడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ గజదొంగల ముఠా ఎంత దారుణంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. డీపీటీ అని నేను చెప్పినదానికి సాక్ష్యాధారాలు. ఇది చంద్రబాబుగారు చేసిన నిలువుదోపిడీ బాగోతం. ఈ గజదొంగల ముఠా ఇన్ని దారుణాలు చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ఎత్తులు..అన్నీ ఇన్నీ కాదు. నేరగాళ్లకు ఎప్పుడైనా సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తారు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. ఇటువంటి గజదొంగల ముఠాను ఇక మళ్లీ ఏరోజు కూడా రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం మీద చర్చ జరుగుతుంది. వక్రీకరించే కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వాళ్ల దగ్గర మీడియా సంస్ధలు ఎక్కువగాఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్దం చేయగలుగుతారు. ఒక అబద్దాన్ని నిజం చేయగలుగుతారు. అంతా స్కిల్డ్ మ్యాన్‌పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ల దగ్గర ఉంది. వాస్తవాలు ప్రజలకూ తెలియాలి... కాబట్టి కనీసం ఈ సభ ద్వారానైనా వాస్తవాలేంటి అన్నది మన ఎమ్మెల్యేలకే కాకుండా, ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలు, ఆధారాలతో చూపించాం అని సీఎం తన ప్రసంగం ముగించారు. -
Skill Development Scam: ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లో విచారణ విభాగానికి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది. జీవీఎస్ భాస్కర్ అరెస్ట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. భాస్కర్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సస్పెండ్ చేయగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసింది హైకోర్టు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్ రిమాండ్‌ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్‌ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. -
స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, కృష్ణా: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీవీఎస్ భాస్కర్ వ్యవహారంలో విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలను.. సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు అనుమతించింది. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్ రిమాండ్‌ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్‌ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. మరోవైపు ఈ కుంభకోణంలో.. గతంలో కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఆర్జా శ్రీకాంత్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. గురువారం దాదాపు 11 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ సైతం ప్రశ్నిస్తున్నారు. -
ఈడీ విచారణ: ఆ ‘స్కిల్’ ఎవరిది?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)’ కుంభకోణంలో సూత్రధారులెవరన్న విషయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లోతుగా విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో నిందితులైన అప్పటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నకిలీ ఇన్వాయిస్లతో ఏపీఎస్ఎస్డీసీ నిధులు రూ. 241 కోట్లు కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోమవారం విచారించారు. సీమెన్స్ కంపెనీ డిజైన్‌టెక్, స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ప్రతినిధులను అధికారులు వివిధ కోణాల్లో విచారించినట్టు తెలిసింది. అసలు ప్రాజెక్టు మొదలు పెట్టకుండానే సీమెన్స్ కంపెనీ పేరిట నిధులు విడుదల చేయడం, వాటిని కొన్ని షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సింగపూర్‌లోని మరో కంపెనీకి తరలించడంపై లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం. సింగపూర్ కంపెనీ నుంచి భారత్‌లో ఎవరి ఖాతాకు నిధులు బదిలీ చేశారనే గుట్టును ఛేదించేందుకు ఈడీ అధికారులు ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. నిధులు ఏఏ ఖాతాల్లోంచి సింగపూర్‌కు వెళ్లాయి, తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయంపై విచారణలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో పాత్రధారులైన అప్పటి ఎండీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకటకృష్ణప్రసాద్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె.ప్రతాప్‌కుమార్ తదితరులు ఈడీ విచారణకు హాజరుకాలేదు. -
‘నైపుణ్యం’లో ఏపీ ముందంజ
ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్లే స్కిల్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) అడ్వయిజర్ చల్లా మధుసూదనరెడ్డి అన్నారు. నేషనల్ æస్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను స్కిల్ డెవెలప్మెంట్ అధికారులతో కలసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రంలో సౌత్ జోన్ స్కిల్ పోటీలు నిర్వహించడానికి అవకాశం కలిగిందన్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఆతిథ్యమిచ్చి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు, అక్కడ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 2022లో చైనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు. ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి 450 మంది విద్యార్థులు విశాఖ చేరుకున్నారన్నారు. వారికి 52 విభాగాలలో పోటీలు నిర్వహించడానికి నగరంలో 11 చోట్ల వేదికలు సిద్ధం చేశామన్నారు. వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. -
యువత భవితకు భరోసా
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులు చదివినా తగిన నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు సాధించడం కష్టం. యువత విద్యార్హతలకు తగిన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) అడుగులు ముందుకేస్తోంది. ఇప్పటికే వేల మందికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపింది. ఇప్పటివరకు ట్రైనింగ్ పార్టనర్స్ ద్వారా శిక్షణ ఇప్పించగా ఇక నుంచి నేరుగా శిక్షణ అందించనుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నైపుణ్యం ద్వారానే ఉన్నతోద్యోగాలు నైపుణ్య శిక్షణ ద్వారా ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే పలు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వాలతో ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగావకాశాలు కల్పించే విషయమై ఎంవోయూలు చేసుకున్నాం. విదేశీ హైకమిషనర్లు, డిప్యూటీ హైకమిషనర్లు ముందుకు వస్తున్నారు. వారితో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రభుత్వ ఆమోదానికి కేంద్రాల వివరాలు పంపించాం. – చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇలా.. ► ఏపీఎస్ఎస్డీసీ ప్రతి జిల్లాకు మూడు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ►13 జిల్లాల్లో 39 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సుముఖంగా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ కళాశాల్లలో ఈ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ► నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అకౌంట్స్, ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్‌స్రూ?న్స్, క్యాపిటల్ గూడ్స్, కెమికల్ అండ్ పెట్రో కెమికల్, కన్స్ట్రక్షన్, డొమెస్టిక్ వర్క్స్, ఎలక్ట్రికల్స్ ఇలా మొత్తం 51 రకాల స్కిల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ► ఇంజనీరింగ్ విభాగాల్లో మరింత తెలుసుకునే విధంగా శిక్షణ, వివిధ రకాల వర్క్‌షాపులు ఉంటాయి. ►శిక్షణ అనంతరం ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ►ఇప్పటికే పలు కాలేజీల్లో ఏర్పాటు కానున్న కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని పరికరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ►కేంద్రాల్లో ఒక కోర్సు పూర్తి కాగానే మరో కోర్సులో విద్యార్థులను చేర్చుకుంటారు. ►మంచి ఫ్యాకల్టీ ద్వారా నిరంతరం శిక్షణ అందిస్తారు. -
ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలనాపరమైన కారణాల వల్ల వీటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే తేదీలను ఈనెల 22న ప్రకటిస్తామన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, నాన్ గెజిటెడ్ పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నర్సులకు శిక్షణ విదేశాల్లో నైపుణ్యం కలిగిన నర్సుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి నర్సులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నడుం బిగించింది. దీనికోసం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ (హెచ్ఈఈ), ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) సంయుక్త భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సమక్షంలో హెచ్ఈఈ ప్రతినిధులతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకోనున్నారు.