సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలనాపరమైన కారణాల వల్ల వీటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే తేదీలను ఈనెల 22న ప్రకటిస్తామన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, నాన్ గెజిటెడ్ పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
నర్సులకు శిక్షణ
విదేశాల్లో నైపుణ్యం కలిగిన నర్సుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి నర్సులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నడుం బిగించింది. దీనికోసం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ (హెచ్‌ఈఈ), ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) సంయుక్త భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సమక్షంలో హెచ్‌ఈఈ ప్రతినిధులతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులు బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment