mains exams
-
14, 15 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌కు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు. మెయిన్స్ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 6 నుంచి 12 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–1(డిస్క్రిప్టివ్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పేపర్–2(డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–3(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–4(ఆబ్జెక్టివ్) నిర్వహించనున్నారు. slprb. ap. gov. in వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను లేదంటే ఈమెయిల్ mail& slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు. -
ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలనాపరమైన కారణాల వల్ల వీటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే తేదీలను ఈనెల 22న ప్రకటిస్తామన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, నాన్ గెజిటెడ్ పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నర్సులకు శిక్షణ విదేశాల్లో నైపుణ్యం కలిగిన నర్సుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి నర్సులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నడుం బిగించింది. దీనికోసం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ (హెచ్ఈఈ), ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) సంయుక్త భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సమక్షంలో హెచ్ఈఈ ప్రతినిధులతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకోనున్నారు. -
నేటి నుంచి ఐఐటీ,జేఈఈ మెయిన్ పరీక్షలు
-
సజావుగా గ్రూప్ - 1 మెయిన్స్
- అభ్యర్థుల హాజరు 64 శాతం - 668 అభ్యర్థులకుగానూ 441 మంది హాజరు - 247 మంది గైర్హాజరు అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్ష రెండో రోజు శనివారం సజావుగా సాగింది. అభ్యర్థులు 64 శాతం హాజరయ్యారు. స్థానిక ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, ఎస్బీఎన్ జూనియర్ కళాశాలలో పేపర్ - 1 పరీక్షకు 668 అభ్యర్థులకు గానూ 441 మంది హాజరయ్యారు. 247 మంది గైర్హాజరయ్యారు. ఏపీపీఎస్సీ అధికారులు బీ.సీహెచ్.ఎన్.కుమార్రాజ్, వసంతకుమార్, సురేశ్‌బాబు పర్యవేక్షించారు. లైజన్ అధికారిగా సురేశ్‌బాబు, అసిస్టెంట్ లైజన్ అధికారులుగా జయరాముడు, నాగభూషణం వ్యవహరించారు. కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించారు. ప్రవేశద్వారం వద్ద అభ్యర్థులను తనిఖీ చేసి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేవని నిర్ధారించుకున్న తర్వాత కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించారు. సోమవారం పేపర్ - 2 ఉంటుందని అధికారులు తెలిపారు. -
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి
► 2011 నాటి నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేర్వేరుగా పరీక్ష ► తెలంగాణలో పాత సిలబస్‌తోనే పరీక్ష ►3 నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్-1 (2011 నోటిఫికేషన్) మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని తెలి పింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరిం చింది. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 606 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లిన కారణంగా కొందరు అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత కోల్పోయారనే వివాదం.. చివరకు సుప్రీంకోర్టుకు చేరడంతో మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర విభజన, ఇతర అంశాల నేపథ్యంలో ఈ తీర్పును అమలుపరచడంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు 2015లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చే శారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదన వినిపించారు. మెయిన్స్ మళ్లీ నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ట్రం వరకు తెలంగాణ నిర్వహించుకుంటే సరిపోతుందని చెప్పారు. మీ వైఖరేంటని ధర్మాసనం తెలంగాణను ప్రశ్నించగా.. టీఎస్పీఎస్సీ తరఫున హాజరైన తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు.. పరీక్ష నిర్వహణకు తాము కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీఎస్ రావు మాత్రం పరీక్ష ఉమ్మడిగా జరగాలని, తెలంగాణలో సిలబస్ మారినందున వేర్వేరుగా నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని విన్నవించారు. అన్నిపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణలో కూడా 2011 నాటి నోటిఫికేషన్లో పేర్కొన్న సిలబస్ ఆధారంగానే నిర్వహించవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తికావాలని స్పష్టం చేసింది. ఇలావుండగా ఇంటర్వ్యూకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పరీక్ష తిరిగి నిర్వహించవద్దని, ఫలితాలు ప్రకటించాలని కోరుతూ ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. 606 మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. తమను పరీక్ష నుంచి మినహాయించాలని విన్నవించారు. అయితే ధర్మాసనం.. తాము న్యాయపరమైన అంశాలను పరిశీలించి మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, వ్యక్తిగత కోణంలో చూడడం లేదని పేర్కొంది.