
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో విచారణ విభాగానికి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది. జీవీఎస్ భాస్కర్ అరెస్ట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది.
భాస్కర్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సస్పెండ్ చేయగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసింది హైకోర్టు.
ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్ రిమాండ్‌ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్‌ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ.
Comments
Please login to add a commentAdd a comment