
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయనవి అన్నీ దిగజారుడు రాజకీయాలే. అంటూ ఫైరయ్యారు.
కాగా, మంత్రి మేరుగ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఒక్క మంచి పని కూడా చేయలేదు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. కరోనాకు భయపడి పక్క రాష్ట్రం పారిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్ని వర్గాల అభివృద్ది జరిగింది. డీబీటీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేశాం. టీడీపీ హయాంలో ఒక్క మంచి పథకమైనా ఉందా?. చంద్రబాబుకు అధికార యావ తప్ప మరొకటి లేదు. చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే. చంద్రబాబువి అన్నీ దిగజారుడు రాజకీయాలే. పేదల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. పేదలను పీల్చి పిప్పి చేసిన వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment