
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా వైఎస్ జగన్ పాలన సాగుతోందన్నారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. అన్ని పదవుల్లో బీజీలకు ప్రాధానం ఇచ్చారన్నారు. పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఘనత జగన్‌దేనన్నారు. నాడు-నేడు కింద స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి, 31 లక్షల మందికి మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన ప్రబుత్వం తమదేనని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఏ రోజైనా చంద్రబాబు పేదల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవని లోకేష్ సీఎ జనగ్‌ను విమర్శిచడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
చదవండి: ‘పాదయాత్ర రద్దుపై విచారణ.. అవసరమైతే పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతాం’
Comments
Please login to add a commentAdd a comment