త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం: వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leader Margani Bharat Comments On YS Jagan Dharna | Sakshi
Sakshi News home page

త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం: వైఎస్సార్‌సీపీ నేతలు

Published Thu, Jul 25 2024 10:17 AM | Last Updated on Thu, Jul 25 2024 12:40 PM

YSRCP Leader Margani Bharat Comments On YS Jagan Dharna

సాక్షి, కృష్ణా: దేశ రాజధానిలో ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ చేసిన ధర్నా విజయవంతమైంది. పలు జాతీయ పార్టీలు వైఎస్సార్సీపీకి సంఘీభావం తెలిపాయి.  ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా? అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. 

ఇవాళ (గురువారం) ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు.

‘‘ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్‌ జగన్‌ సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలు ప్రదర్శించి నిరసన తెలియజేసాం. 

..ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తాం’ అని అన్నారు.

‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైఎస్‌ జగన్‌ సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయింది’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement