
సాక్షి, గుంటూరు : పోలింగ్ ముగిసినా కానీ ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. కొన్ని చోట్ల టీడీపీ దాడులు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతోంది. రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
రణరంగంగా మారిన గురజాల
అంతేకాకుండా గురజాల కూడా రణరంగంగా మారింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసింది. తెలుగు తమ్ముళ్లు యధేచ్చగా ఆస్థులను ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నాయకుడు యనుముల మురళీధర్ రెడ్డి ఆస్థులను ధ్వంసం చేశారు. సినిమాహాలు, ఆస్పత్రి, షాపులపై దాడులు చేస్తున్నారు. సీఐ రామారావు కళ్లెదుటే ఆస్తులను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. ఈ ఘటనలతో గురజాల వాసులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment