
సాక్షి, గుంటూరు : పోలింగ్ రోజున టీడీపీ నేతలు చేసిన దారుణాలు, దౌర్జన్యాల గురించి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ నాయకుడు మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసినా.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు.
అయితే వారిని అరెస్ట్‌చేయకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేమూరు మండలం బూతుమల్లిలో మేరుగపై టీడీపీ గూండాల దాడి చేశారు. కారుపైకి ఎక్కి ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగిలి మేరుగ నాగార్జునకు గాయాలయ్యాయి. రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన నాగార్జునపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో పుటేజి వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment