
సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు. నియోజకవర్గంలో జగన్ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయి. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారు. ఆనందబాబుకు ప్రజలే బుద్ధి చెప్పారు. నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్లిన ఇలాంటి పరిస్థితి ఉంటుందని' మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు.
చదవండి: (నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!)
Comments
Please login to add a commentAdd a comment