nakka anand babu
-
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి. ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది. అంతలోనే ఇంత పెద్ద స్పందనా? కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది. టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు. ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. లక్ష్మి గతమంతా అక్రమాలే స్వర్ణ భారతి నగర్‌కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు. వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. ♦ 2013లో స్వర్ణభారతి నగర్‌కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు. 2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది 2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్‌లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్ అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్‌ట్రిక్స్‌నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
‘అమరావతి అనువైన ప్రాంతం కాదని చంద్రబాబుకు ముందే తెలుసు’
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు అమరావతిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ తప్ప ఏమైనా జరిగిందా? అని ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నక్కా ఆనంద్ బాబుపై సురేష్ ఫైరయ్యారు. కాగా, ఎంపీ నందిగం సురేష్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో పచ్చటి పొలాలను నాశనం చేయవద్దని ఆనాడే రైతులు వేడుకున్నారు. బలవంతంగా భూములు లాక్కుని రాజధాని ఏర్పాటు చేశారు. దుర్మార్గమైన ఆలోచనతోనే చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగేది పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం. ప్రజలంతా వ్యతిరేకించారు కాబట్టే తాత్కాలిక సచివాలయం కట్టాడు. నక్కా ఆనంద్ బాబు చంద్రబాబు కోసం కాదు.. దళితుల కోసం మాట్లాడాలి. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు పథకం. చంద్రబాబుకు పాలేరులా పవన్ పనిచేస్తున్నారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కోసమే నక్కా ఆనంద్ బాబు మాట్లాడాడు. మేం కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా మాట్లాడగలం. మీ మాదిరిగా కాదు మాకు కొంచెం విజ్ఞత ఉంది. చంద్రబాబు ఓ గుంట నక్క. మీరు మొదట చెప్పిన అమరావతికి.. రాజధాని పెట్టిన అమరావతికి అసలు సంబంధమే లేదు. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆఫీసులు తప్ప మరొకటి కనిపిస్తున్నాయా?. రాజధాని పేరుతో పచ్చని పొలాలను చంద్రబాబు నాశనం చేశాడు. భూదాహం ఉన్న వారంతా కలిసి ఏర్పాటు చేసుకున్నదే రాజధాని. రియల్ ఎస్టేట్ కోసం మొదలు పెట్టిందే అమరావతి ఉద్యమం. అమరావతి ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారు. రైతులను నాశనం చేసింది చంద్రబాబే. అమరావతి మొత్తం తనదేనంటూ లోకేష్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. లోకేశ్‌కు చేతనైతే ముందు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి. పనికిమాలినోళ్లకు పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్. లోకేశ్ యాత్ర ఫెయిలవ్వడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి అందరూ భయపడుతున్నారు. నక్కా ఆనంద్ బాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ -
హైడ్రామా.. నానా యాగీ.. టీడీపీ నేతల శవ రాజకీయం
ఒంగోలు అర్బన్: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకుని.. నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో సవలం సుధాకర్ భార్య హనుమాయమ్మ(48) అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన సవలం కొండలరావు(బుజ్జి) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వీరి మధ్య భూ తగాదా ఉంది. అతను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హనుమాయమ్మ సోమవారం తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొండలరావు తన ట్రాక్టర్ నాగేలు అడ్డతో ఆమెను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె కింద పడటంతో వెనుక టైరుతో తొక్కించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి.. హనుమాయమ్మ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఒంగోలు జీజీహెచ్ వద్ద మంగళవారం హైడ్రామా నడిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ హడావుడి చేశారు. పాత కక్షలు, కుటుంబ తగాదాలతోనే సదరు మహిళను హత్య చేశారని ఆ గ్రామ ప్రజలంతా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చిన ఆర్డీవో, టంగుటూరు తహశీల్దార్లు.. మానవతా దృక్పథంతో వీలైనంత మేర ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకుండా నానా యాగీ చేశారు. టీడీపీ నేతల వైఖరిని కళ్లారా చూసిన వారంతా.. ఇదేం రాజకీయం అంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, మహిళ మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి భర్త తన అన్న భార్యపై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తూ.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్లో..
కంతేరు(తాడికొండ): తాడికొండ మండలం కంతేరు గ్రామంలో టీడీపీ కార్యకర్త కర్లపూడి వెంకాయమ్మ కొడుకు వంశీ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య రెండురోజులుగా వివాదం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం వెంకాయమ్మ, ఆమె కొడుకు వంశీ ఆ యువతి కుటుంబ సభ్యులపై తిట్లదండకం అందుకున్నారు. దాడికి యత్నించారు. వారి నుంచి రక్షణగా యువతి కుటుంబ సభ్యులు ఎదురుదాడికి యత్నించారు. దీంతో రాజకీయ రంగు పులిమేందుకు టీడీపీ నేతలు యత్నించారు. వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలూ ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడినట్టు చెబుతున్న వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు ఒక్కొక్కరిగా టీడీపీ నేతలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ వెంకటాద్రితో వాగ్వివాదానికి దిగారు. యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నా పట్టించుకోకుండా వెంకాయమ్మ కొడుకుపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ వాదనకు దిగారు. చదవండి: (ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! ) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ కలిపి వెంకాయమ్మతో మాట్లాడించి ఎల్లో మీడియా ఎదుట లేనిది ఉన్నట్లు సృష్టించే యత్నం చేశారు. బాధితురాలి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి వత్తాసు పలుకుతారా.. అంటూ టీడీపీ నేతలను నిలదీశారు. దీంతో ఓ దశలో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలకూ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. -
ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు: మంత్రి మేరుగ నాగార్జున
సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు. నియోజకవర్గంలో జగన్ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయి. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారు. ఆనందబాబుకు ప్రజలే బుద్ధి చెప్పారు. నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్లిన ఇలాంటి పరిస్థితి ఉంటుందని' మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. చదవండి: (నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!) -
ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం.. టీడీపీ మాజీ మంత్రి హస్తం?
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గుంట గ్రౌండ్లో నడుస్తున్న ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగ్జిబిషన్లో మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. అయితే తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎగ్జిబిషన్ తగులబెట్టించారని ఆరోపిస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ఆర్నెళ్ల నుంచి నక్కా ఆనంద్ బాబు అతని అనుచరులు తమను వేధిస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. నక్కా ఆనంద్ బాబు అనుచరులు మధ్యాహ్నం వచ్చి నిప్పంటించి తగులబెట్టారని నిర్వాహకులు అంటున్నారు. ఈ మేరకు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మేము చెప్పినట్టు నోటీసు ఇవ్వండి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ‘నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు.. నోటీసులు మేము చెప్పిన విధంగా రాసి ఇస్తే తీసుకుంటాం.. ంతపల్లి పీఎస్‌కు వచ్చే ప్రసక్తే లేదు.. ఏం తమాషాగా ఉందా.. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు గుర్తు పెట్టుకుంటాం.. అసలు పోలీసుల సహకారంతోనే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి.. అరండల్‌పేట పోలీసులు ఏమైనా గంజాయి పెడతారా ఏంటి.. వచ్చిన ప్రతి ఒక్కర క్షమాపణ చెప్పి వెళ్లండి’ అని గుంటూరులో మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు, ఆయన అనుచరులు గొడవకు దిగారు. సోమవారం రాత్రి నుం మంగళవారం మధ్యాహ్నం వరకు హడావుడి సృష్టించి, ఏదో జరిగిపోతోందంటూ.. అభత కల్పనలు వ్యాప్తి చెందేలా సర్వ ప్రయత్నాలు చేశారు. గంజాయి విక్రయాల్లో నాయకులు, పోలీసుల పాత్ర ఉందంటూ.. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన వద్ద ఉన్న సమాచారం తెలుసుకునేందుకు నర్సీపట్నం సిఐ కె.శ్రీనివాసరావు, చింతపల్లి పోలీసులు సోమవారం రాత్రి గుంటూరు వసంతరాపురంలోని ఆయన నివాసానికి వచ్చారు. ఫోన్లో సమాచారం తెలియజేశారు. రమ్మని పిలిచి.. తాము మంగళవారం ఉదయం దీనిపై మాట్లాడేందుకు వస్తామని చెప్పిన పోలీసులతో ఇప్పుడే మాట్లాడదాం అని చెప్పిన నక్కా ఆనంద్‌బాబు.. అర్ధరాత్రి పూట విచారణ ఏంటంటూ ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. అప్పటికే సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు మద్యం సేవించి వచ్చి పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఈ పరిస్థితిలో అక్కడి నుంచి వెళ్లిపోయిన పోలీసులు తిరిగి మంగళవారం ఉదయం ఆనంద్‌బాబు కార్యాలయానికి చేరుకున్నారు. స్టేట్మెంట్ ఇవ్వటంతో పాటు, నోటీసులు తీసుకునేందుకు సహకరించాలని కోరారు. అయితే నోటీసులో తాము చెప్పి విధంగా రాస్తేనే.. తీసుకుంటామని ఆనంద్‌బాబు చెప్పారు. తన వద్ద ఎటువంటి సవచారం లేదంటూ పోలీసులకు ఏ మాత్రం సహకరించలేదు. దీనికి తోడు అక్కడే ఉన్న కార్యకర్తలు ఇబ్బందులుకు గురి చేశారు. సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడకుండా అడ్డుపడ్డారు. ‘ఆనంద్‌బాబు వద్ద గంజాయికి సంబంధించి నిర్దిష్ట సవచారం లేదు. ఆయన నోటీసులు తీసుకోలేదు’ అని సీఐ తెలిపారు. -
ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు ఆధారాల్లేవు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో కొందరు రాజకీయ, ఇతర నాయకుల ప్రమేయంతోనే స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు స్పష్టం చేశారు. విశాఖ నుంచి వెళ్లిన ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ను విచారించిందన్నారు. అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర –ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో గంజాయి సాగు శాశ్వత నిర్మూలన ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో సంకల్పించాలని సూచించారు. నల్గొండ పోలీసులు రెండు వారాల ముందు నుంచే విశాఖ ప్రాంతంలో పలు కేసుల విషయమై స్థానిక పోలీసులను సంప్రదించారని, కానీ చింతపల్లి వద్ద కాల్పుల ఘటన విషయమై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సమస్య దశాబ్దాల కాలంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొంత కాలంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో 2016లో 724 ఎన్డీపీఎస్ కేసులలో 2,290 మందిని అరెస్ట్ చేశామన్నారు. 2017లో 712 కేసుల్లో 2,100 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 812 కేసుల్లో 2,565 మందిని, ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రెండేళ్లలో విశాఖ పోలీసులు ఏవోబీలో దాదాపు 50 గ్రామాల్లో 800 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల సమాచారం ఉందని ఎవరు చెప్పినా విచారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. -
పోలీసులపై నక్కా ఆనందబాబు జులం
సాక్షి, పట్నంబజారు: ‘మీ బతుకులేంటి మీరేంటి.. నాకే నోటీసులు ఇచ్చేందుకు వస్తారా’.. అంటూ టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోలీసులపై చిందులు తొక్కారు. ఇటీవల విశాఖ జిల్లా చింతపల్లిలో జరిగిన కాల్పులకు సంబంధించి.. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారం లేకుండా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయా? అంటూ సోమవారం ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. గంజాయి అమ్మకాల వెనుక ఎవరి హస్తం ఉందో స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతూ నర్సీపట్నం సీఐ కే. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గుంటూరులోని ఆనందబాబు నివాసానికి సోమవారం రాత్రి వచ్చారు. ఆ సమయంలో ఆనందబాబు పోలీసులపై పరుషంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పలువురు టీడీపీ నేతలతో కలిసి పోలీసులను భయపెట్టేలా వ్యవహరించారు. -
నిమ్మల, అనురాధలకు లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ డిమాండ్ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు లీగల్ నోటీసులు పంపింది. (చదవండి: మిమ్మల్ని ఫినిష్ చేసే రోజు వస్తుంది) -
మాజీ మంత్రి ఆనందబాబుపై కేసు నమోదు
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అక్రమంగా ఓ స్థలంలోని సామాన్లు ఖాళీ చేయించిన విషయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు పలువురిపై కేసు నమోదైంది. గుంటూరు అరండల్‌పేట ఎస్హెచ్ఓ బత్తుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం విద్యానగర్‌లో నివాసం ఉండే అద్దంకి శ్రీకృష్ణ అమరావతి రోడ్డు, డొంకరోడ్డు ప్రాంతాల్లో బాలాజీ టెంట్ హౌస్ డెకరేకర్స్ అండ్ లైటింగ్ వ్యాపారం గత కొంతకాలంగా చేస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం ఏఈఎల్సీ చర్చి కాంపౌండ్‌లోని మహిమ గార్డెన్స్‌లో ఉన్న కర్లపూడి బాబూప్రకాష్ స్వాధీనంలోని నాలుగున్నర ఎకరాల స్థలాన్ని 2008లో అగ్రిమెంట్ రాసుకున్నారు. రూ.6.50 లక్షలు ఇచ్చి ఆ స్థలంలో కల్యాణమండపం సామాన్లు పెట్టుకునేందుకు మూడు షెడ్డులు నిర్మించారు. ఆ స్థలంపై ఆయనకు 2021 వరకు హక్కు ఉంది. 2015లో కర్లపూడి బాబూప్రకాష్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గోడౌన్‌ను ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురిచేశారు. ఈక్రమంలో శ్రీకృష్ణ కోర్టును ఆశ్రయించగా వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన శ్రీకృష్ణ కుమారుడు శివసాయి,మరో పది మంది వర్కర్లు ఉండగా, పొక్లెయిన్‌తో పది మందితో కలిసి వచ్చి షెడ్డులను పగులగొట్టి సుమారు రూ.40 లక్షల విలువ చేసే సామగ్రి ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆనందబాబు, కర్లపూడి బాబూప్రకాష్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వేమూరులో ‘నక్కా’ వారి అవినీతి జిత్తులు
సాక్షి, గుంటూరు : అయనో అవినీతి మాంత్రికుడు.. మంత్రి పదవి రాకముందే అక్రమాలకు తెరతీసిన తాంత్రికుడు.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హాంఫట్ అంటూ కాజేశాడు. రాక రాక వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దండుకున్నాడు. వేమూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లపై మారీచుడిలా వాలాడు. ప్రజలకు ఉచితం పేరుతో ఇసుకను ఆయాచితంగా దోచుకున్నాడు. లారీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ అక్రమాల దందా కొనసాగించాడు. మంత్రి పదవి వచ్చాక మరింత రెచ్చిపోయాడు. తన అనుచరగణంతో జిల్లా వ్యాప్తంగా దందాకు తెరతీశాడు. గుంటూరులో బెక్కర్ కాంపౌండ్ స్థలాన్ని ఆక్రమించేశాడు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు దక్కించుకున్నాడు. మంత్రి ఆధ్వర్యంలో తవ్విన గుంతల్లో పడి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. ఆ కుటుంబాల ఉసురుపోసుకున్నాడు మంత్రి నక్కా ఆనందబాబు. ఇసుక అమ్మకాల్లో రూ. 200 కోట్లకుపైనే... ఇసుక తవ్వకాలపై మంత్రి ఆనందబాబును తిప్పలకట్టలో మహిళల నిలదీత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వేమూరు నియోజకర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ఇసుక అమ్మకాల ద్వారా మంత్రి నక్కా ఆనందబాబు రూ. 200 కోట్లకుపైనే గడించారని నియోజకవర్గంలో విమర్శలున్నాయి. నదీ గర్భశోకం మిగిల్చి ఇసుకను పిండి రూ. కోట్లకు కోట్లు దండుకోవడంలో సిద్ధహస్తుడిగా మంత్రి పేరు గడించారు. ఇసుక మాఫియాకు మంత్రే మూలంగా మారి తన బినామీలతో తవ్వకాలు జరిపించి అక్రమార్జనకు నాంది పలికారు. 2011 నుంచి 2013 మధ్య కాలంలో కొల్లూరు మండలం జువ్వలపాలెంలో ప్రభుత్వం పాట నిర్వహించిన క్వారీని తన బినామీలకు దక్కేలా చక్రం తిప్పి ఇసుక దందాకు తెర తీశారు. జువ్వలపాలెంలో అనుమతులు ఉంటే గాజుల్లంకలో సైతం రెండేళ్లపాటు రేయింబవళ్లు అనధికారిక క్వారీని నడిపించారు. భట్టిప్రోలు మండలం కాకుల డొంక, ఓలేరు ప్రాంతాల్లో మంత్రి కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అప్పట్లో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇసుక పాటలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో 2013–2014 మధ్య కాలంలో తన బినామీలను రంగంలోకి దింపి కొత్త తరహా ఇసుక వ్యాపారానికి బీజం వేశారు. ఏడాది క్రితం గుంటూరులో కీలక నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న టీడీపీ నాయకుడు కుమారుడు సైతం ఈపూరులో క్వారీ నిర్వహించి రూ. కోట్లు గడించాడు. బెక్కర్ కాంపౌండ్‌లో స్థలం బొక్కేశారు గుంటూరు నగరంలోని మహిమ గార్డెన్స్ బెక్కర్ కాంపౌండ్‌లో స్థలాన్ని సైతం మంత్రి నక్కా ఆనందబాబు కారు చౌకగా బొక్కేశారు. ఈ స్థలాన్ని కాజేయడం కోసం బెక్కర్ కాంపౌండ్‌ను లీజుకు తీసుకున్న బాబూప్రకాశ్తో... టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఒప్పందం చేసుకున్నారు. ఆ స్థలం తమకు కేటాయిస్తేనే లీజుకు తీసుకున్న స్థలాన్ని చర్చికి అప్పగిస్తానంటూ షరతులతో కూడిన ప్రతిపాదనను చర్చి ముందు పెట్టారు. ఈ షరతులకు తలొగ్గిన చర్చి పెద్దలు 2015 జూలై 22న భీమవరం బేతనీపేట లూథరన్ చర్చిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో.. షరతులను అంగీకరించి, టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు స్థలం కేటాయించడానికి అంగీకారం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు తన పేరిట చర్చి ఇవ్వాలనుకున్న 4400 గజాల స్థలాన్ని తన సోదరుడు నక్కా ప్రసాద్‌బాబు పేరిట ఇవ్వాలని కోరారు. ప్రసాద్‌బాబు పేరిట 4400 గజాల స్థలాన్ని.. గజం రూ. 12 వేల చొప్పున చర్చి విక్రయించింది. మొత్తం స్థలం విలువ రూ.5.28 కోట్లకుగాను నక్కా ప్రసాద్ సంఘానికి అందించిన సేవలకుగాను రూ.3.28 లక్షలు మినహాయించారు. ఈ లెక్కన కేవలం రూ. 2 కోట్లకు 4400 గజాల స్థలాన్ని తన బినామీ అయిన సోదరుడి పేరు మీద ఆనందబాబు కొట్టేశారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ గజం రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ప్రకారం స్థలం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఈ చర్చి భూమిని కొట్టేయడం వెనక నక్కా చక్రం తిప్పారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు.. కుగ్లర్ ఆసుపత్రి కుగ్లర్ హాస్పిటల్ 6.95 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా నక్కా ఆనందబాబు లీజు కొట్టేశాడు. కుగ్లర్ ఆసుపత్రి స్థలం లీజు ధర మార్కెట్లో రూ. 50 లక్షలకుపైగా పలుకుతుంది. అలాంటి స్థలాన్ని ఆనందబాబు సతీమణి చింతబత్తుని సత్యరత్నకుమారి పేరు మీద సంవత్సరానికి రూ.10 వేలు చొప్పున 2006–2036 వరకూ లీజుకు తీసుకున్నారు. కారు చౌకగా కొట్టేసిన నక్కా ఆనందబాబు లీజు డబ్బును చర్చి అకౌంట్లో కట్టిన దాఖలాలే లేవని ఆరోపణలున్నాయి. ఇదే తరహాలో గుంట గ్రౌండ్ స్థలాన్ని సైతం ఆనందబాబు తన బినామీ అయిన సోదరుడు ప్రసాద్ పేరున లీజుకు తీసుకుంటున్నారు. ఆరేడేళ్లుగా గ్రౌండ్‌ను లీజుకు తీసుకుంటున్న ఆయన గత సంవత్సరం వరకూ మార్చి, ఏప్రిల్, మే నెలలకుగాను రూ. 5 లక్షలు లీజుగా చెల్లించేవారు. గత ఏడాది సంఘ సభ్యులు వ్యతిరేకించడంతో లీజు ధరను రూ. 20 లక్షలకు పెంచినట్టు సమాచారం. కారు చౌకగా లీజుకు కొట్టేస్తున్న గుంట గ్రౌండ్ స్థలాన్ని ఎగ్జిబిషన్లు, ప్రైవేట్ కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆనందబాబు ఏడాదికి రూ.10 కోట్ల వరకూ గడిస్తున్నారని విమర్శలున్నాయి. గుంటూరు నగరంలోని గ్రాండ్ నాగార్జున హోటల్ స్థలాన్ని 1981–2030 వరకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య లీజ్ కొనసాగుతుంది. దీనికి సంత్సరానికి లీజ్ రూ.33,333 చెల్లిస్తున్నారు. -
ఆనందబాబుకు ఆవిరైన ఆనందం
కొల్లూరు: వేమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే మహిళలు హంసపాదు పలికారు. గత ఎన్నికల ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిగా నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి శనివారం ఆయన ప్రచారానికి వెళ్లారు. అయితే ఆయన ఊహలకు భిన్నంగా ఆదిలోనే మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిలుమూరులోని ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడగట్టుకుని వచ్చిన అనుచరగణంతో అట్టహాసంగా నక్కా ప్రచారాన్ని ఆరంభించారు. అయితే చెరుకూరి సంపూర్ణ, పీకే రత్నకుమారి, పీకే లక్ష్మిలతోపాటు పలువురు మహిళలు నిలదీసేసరికి బిక్కమొహం వేశారు. తమకు కేటాయించిన నివేశనా స్థలాలను వేరే వ్యక్తులకు ఎలా ఇచ్చారని మహిళలు నిలదీశారు. దీంతో కోపగించుకున్న మంత్రి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం అనంతవరం గ్రామానికి వెళ్లిన నక్కాకు అక్కడ సైతం ఎదురుదెబ్బ తగిలింది. పారిశుద్ధ్య సమస్యపై అక్కడి మహిళలు నిలదీశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఆనందబాబు ఓ కుటుంబం ఓట్లు బహిరంగంగా కొనుగోలు చేశారు. పింఛన్ పొందుతున్న దివ్యాంగుడి కుటుంబానికి బహిరంగంగా నగదు అందజేసి విమర్శల పాలయ్యారు. అనంతరం అనంతవరంలో చర్చికి రూ.1 లక్ష చెక్కును అందజేసి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. -
ఆనందబాబుకు ఆవిరైన ఆనందం
కొల్లూరు: వేమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే మహిళలు హంసపాదు పలికారు. గత ఎన్నికల ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిగా నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి శనివారం ఆయన ప్రచారానికి వెళ్లారు. అయితే ఆయన ఊహలకు భిన్నంగా ఆదిలోనే మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిలుమూరులోని ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడగట్టుకుని వచ్చిన అనుచరగణంతో అట్టహాసంగా నక్కా ప్రచారాన్ని ఆరంభించారు. అయితే చెరుకూరి సంపూర్ణ, పీకే రత్నకుమారి, పీకే లక్ష్మిలతోపాటు పలువురు మహిళలు నిలదీసేసరికి బిక్కమొహం వేశారు. తమకు కేటాయించిన నివేశనా స్థలాలను వేరే వ్యక్తులకు ఎలా ఇచ్చారని మహిళలు నిలదీశారు. దీంతో కోపగించుకున్న మంత్రి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం అనంతవరం గ్రామానికి వెళ్లిన నక్కాకు అక్కడ సైతం ఎదురుదెబ్బ తగిలింది. పారిశుద్ధ్య సమస్యపై అక్కడి మహిళలు నిలదీశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఆనందబాబు ఓ కుటుంబం ఓట్లు బహిరంగంగా కొనుగోలు చేశారు. పింఛన్ పొందుతున్న దివ్యాంగుడి కుటుంబానికి బహిరంగంగా నగదు అందజేసి విమర్శల పాలయ్యారు. అనంతరం అనంతవరంలో చర్చికి రూ.1 లక్ష చెక్కును అందజేసి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. -
టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న విబేధాలపై చర్చలు జరిపిన మంత్రులకు గట్టిషాక్ తగిలింది. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విబేధాలపై దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను మంత్రులు ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనంద్‌బాబులకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చర్చలు జరిపిన మంత్రులు.. వారి హెచ్చరికతో ఖంగుతిన్నారు. సమస్యల ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు కోరగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రావణ్‌కుమార్‌కు ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వద్దన్నదే తమ ఏకైక డిమాండ్ అని వారు మంత్రులకు తెల్చిచెప్పారు. గత ఎన్నికల్లో తామే చందాలు వేసుకుని శ్రావణ్‌కుమార్‌ను గెలిపించామని గుర్తుచేశారు. ఈ సారి మళ్లీ శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే మాత్రం తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో ఈ విబేధాలను పరిష్కరించడం మంత్రులకు తలనొప్పిగా మారినట్టు సమాచారం. -
జియో అమరావతి మారథాన్‌కు విశేష స్పందన
సాక్షి, అమరావతి: జియో అమరావతి మారథాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతిలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద మొదలైన ఈ మారథాన్‌లో సుమారు 5000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో జియో అమరావతి మారథాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. 5కే, 10కే, 21కే కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. 21కే రన్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఐఏఎస్ అధికారి క్రాంతిలాల్ దండే, ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్‌లు జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు.10కే రన్‌ను మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్‌ను జియో ఏపీ సీఈవో మహేష్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జియో అమరావతి మారథాన్ రన్లో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నగరం అభివృద్ధి కోసం నిర్వహించే రన్లో నగరవాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మరింతగా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో మారథాన్‌లో భాగస్వాములమైనట్లు ఆయన తెలిపారు. -
‘నక్కా ఆనంద్, కారెం శివాజిలు.. చంద్రబాబు చప్రాసీలు’
సాక్షి, విజయవాడ : దళితుల పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కారుకూతులు కూస్తే సహించేది లేదంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. బుధవారం వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున వైఎస్ జగన్‌పై దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనైతికంగా మాట్లాడుతూ పశువుల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నక్కా ఆనంద్ బాబు, కారెం శివాజి, జవహర్‌లు దళితులైనంతా మాత్రాన వైఎస్ జగన్ గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరన్న చంద్రబాబు వద్ద పని చేస్తూ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.. మీకు అంత సత్తా ఉంటే అరెస్ట్ చేయించండంటూ సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌ను చంపడానికి విజయమ్మ, షర్మిల ప్లాన్ చేశారని ఏకలవ్యుడు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు.. మీ నోట్లో ఏమన్నా అశుద్దం పోసుకున్నారా అంటూ మేరుగు తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్కా ఆనంద్, కారెం శివాజి, జవహర్‌లు దళితులని వారి చేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారు. దళితుల పేరుతో మా నాయకుడి గురించి కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు దగ్గర చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగబలిసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి పట్ల టీడీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే సత్తా టీడీపీ నేతలకు లేదని వెల్లడించారు. వైఎస్ జగన్ చమట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ రాజీనామాలను చంద్రబాబు ముఖాన విసిరేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అంతేకానీ దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టొద్దని కోరారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన ఒక్క దళితుడు కూడా వైఎస్ జగన్ నుంచి పక్కకు వెళ్లరని మేరుగు ధీమా వ్యక్తం చేశారు. -
బుల్డోజర్లా దూసుకెళతా!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, దీన్ని సహించబోమని, బుల్డోజర్లా దూసుకెళతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ రైతు సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు. రూ.49.68 కోట్లతో నిర్మించిన పోతార్లంక ఎత్తిపోతల పథకం ద్వారా 4,995 ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా పోతార్లంక సాగునీటి పథకం సమయంలో రైతుల వాటా కింద అప్పట్లో 50 శాతం నగదును సొసైటీల ద్వారా రుణాలు ఇప్పించి ప్రభుత్వం తీసుకుందని, కానీ రుణమాఫీ అవక వడ్డీలు పెరిగిపోతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రూ.10.50 లక్షల రుణం కాస్తా వడ్డీలతో కలుపుకొని రూ.50 లక్షలకు చేరుకుందని చెప్పడంతో.. ప్రభుత్వం ద్వారా రూ.25 లక్షలు చెల్లింపునకు మంజూరు చేస్తామని, మిగిలిన నగదు మాఫీ సొసైటీ ద్వారా జరిగేలా జీవో మంజూరు చేస్తానని సీఎం రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం దోనేపూడిలో గ్రామ దర్శిని, కొల్లూరు జిల్లాపరిషత్ హైస్కూల్లో గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించి సభలు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలను గల్లంతు చేయాలని అన్నారు. దోనేపూడిలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిమ్మగడ్డ రమేష్ రూ.50 వేల చెక్కు, శ్రీలత 2 బంగారు గాజులను ఇచ్చారు. నన్ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదు.. భారతీయ జనతాపార్టీ నమ్మక ద్రోహం చేసిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాలు అనుభవిస్తూ, ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారి స్థాయి ఏంటని నిలదీశారు. కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీకి సొంత మైక్, భారతీయ జనతాపార్టీకి అద్దె మైక్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను దివాళా తీయించిందన్నారు. పనులు పూర్తి కాకుండానే ‘ఎత్తిపోతల’ ప్రారంభం! పోతార్లంక ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు పూర్తి కాకుండానే సీఎం చంద్రబాబు ప్రారంభించడంపై రైతులు పెదవి విరిచారు. ప్రధానంగా డీసీ పాయింట్స్ నుంచి పొలాలకు వెళ్లే పైపులైనులు ఎక్కడా పూర్తి కాలేదన్నారు. ముఖ్యమంత్రి మోటార్లను ఆన్ చేసినప్పటికీ నీళ్లు లీక్ అయితే రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో అధికారులు వెంటనే ఆపేశారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పోరాటదీక్ష విరమణ
-
అర్ధాంతరంగా ముగిసిన అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష
సాక్షి, గుంటూరు: నెల రోజుల్లోగా అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు గుంటూరు విజ్ఞాన మందిరంలో కొనసాగుతున్న దీక్ష అర్ధాంతరంగా ముగిసింది. దీక్షతో పాటు బాధితులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర కూడా విరమించుకున్నట్లు నేతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుండా అర్ధాంతరంగా ఆందోళన విరమించడాన్ని బాధితులు తప్పుబట్టారు. నిర్దిష్ట హామీ లేకుండా పాదయాత్ర ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటో చెప్పాలని, రాష్ట్రం నలుమూలల నుంచి వస్తే మాకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. మంత్రి నక్కా ఆనందబాబు ఏం హామీ ఇచ్చి దీక్షను విరమింపచేశారని నేతలను బాధితులు ప్రశ్నించారు. దీక్షా శిబిరానికి ఓ మంత్రి వచ్చి హామి ఇవ్వటం గొప్పేకదా నేతలు చెప్పటం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా జరుగుతున్నదే మళ్లీ జరిగిందని, ఇందులో వింతేముందంటూ బాధితులు వాపోతున్నారు. అయితే నేతలు వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన విరమించండి: మంత్రి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో మంత్రి నక్కా ఆనందబాబు విజ్ఞాన మందిరంలో గురువారం ఉదయం సమావేశం అయ్యారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఈరోజు జరిగే మంత్రివర్డ సమావేశంలో చర్చిస్తామని, ఆందోళన విరమించండని కోరారు. దీంతో మంత్రి ప్రసంగానికి బాధితులు అడ్డుపడ్డారు. డబ్బు ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితమై కాలయాపన చేస్తున్నారని నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి కొంత సమయం ఇవ్వమని బాధితులని కోరారు. అయితే తమకు డబ్బులు ఇచ్చేందుకు కచ్చితమైన సమయం చెప్పాలంటూ నినాదాలు చేయగా మంత్రి మాట దాటేశారు. ఈ రోజు సాయంత్రం ఐదుగురికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పిస్తానని మంత్రి అన్నారు. ఆందోళన చేసిన ప్రతిసారి ప్రభుత్వం మోసపూరిత హామీలిస్తోందంటూ బాధితులు ఆగ్రహం చెందారు. -
‘పవన్ కల్యాణ్ తో గవర్నర్ రాయబారం’
-
‘పవన్ కల్యాణ్ తో గవర్నర్ రాయబారం’
సాక్షి, అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్‌పై ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘ మోదీ ప్రభుత్వానికి సిగ్గుందా?. 11ఏళ్లుగా నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. గవర్నర్‌గా ఆయనను ఇన్నేళ్లు ఎలా కొనసాగిస్తారు?. గవర్నర్ వ్యవస్థకు ప్రస్తుత గవర్నర్ కళకం తెస్తున్నారు. ఈ గవర్నర్ వ్యవస్థ వేస్ట్. రాష్ట్ర విభజనకు కారకుడు గవర్నరే. కేంద్రానికి తాబేదారుగా పొలిటికల్ వ్యవహారాలు నడుపుతూ కేంద్రానికి సంధానకర్తగా ఉంటున్నారు. గవర్నర్‌కు ఇచ్చిన బడ్జెట్ ఆయన గుళ్లు, గోపురాలు తిరగడానికే సరిపోతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో రాయబారాన్ని గవర్నరే చేశారు. పవన్‌ను గవర్నర్ పిలిపించుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి?. ఆయనతో భేటీ అయ్యాకే పవన్ మాపై విమర్శలు చేస్తున్నారు. మోదీ, అమిత్ షా, మాఫియా కింగ్స్‌గా వ్యవహరిస్తున్నారు.’ అని ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు
-
దేవినేనికి సిగ్గులేదు.. నక్కాకు సోయిలేదు
సాక్షి, విజయవాడ: కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు కనుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, టీడీపీ నేతలను ప్రజలెవరూ నమ్మడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ అన్నారు. ప్రధానమంత్రిని జగన్ విమర్శించడంలేదన్న టీడీపీ మంత్రుల వ్యాఖ్యలు అర్థంలేనివన్నారు. మోదీని విమర్శించడంకాదు ఏకంగా ఆయన ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదే అని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టింది వైఎస్సార్సీపీనే. ఆ సంగతి మర్చిపోయి మాట్లాడుతున్న మంత్రి దేవినేనికి ఏమాత్రమైనా సిగ్గుందా? హోదా విషయంలో టీడీపీవి డ్రామాలు కాబట్టే అఖిలపక్ష పార్టీలన్నీ చంద్రబాబును ఛీకొట్టాయి. ఏకపక్షంగా మిగిలిన చంద్రబాబు ఏకాకిలా కాకి అరుపులు అరుస్తుంటే, ఆయనకు తోడుగా దేవినేని చౌకబారు విమర్శలు చేస్తున్నాడు. మరో మంత్రి నక్కా ఆనందబాబు ఎప్పుడూ మైకంలో ఉండి మాట్లాడతారు. ఆయన సోయిలోకి వస్తేకదా రాష్ట్రంలో, కేంద్రంలో ఏం జరుగుతుందో తెలిసేది. ఇక లోకేశ్..! అమెరికాలో పెద్ద చదువులు చదివొచ్చిన ఆయనను తెలుగు ప్రజలపైకి వదిలిపెట్టారు.విభజన సమయంలో ప్రధాని ఎవరో కూడా తెలియనంత లోకజ్ఞానం, తెలివితేటలు ఆయనవి’’ అని జోగి రమేశ్ మండిపడ్డారు. వీరుడిలా పోరాడేది జగనే: ‘‘నాటు సోనియా గాంధీతోగానీ, నేడు ప్రధాని నరేంద్ర మోదీతోగానీ వీరుడిలా పోరాడింది ఒక్క వైఎస్ జగనే. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం మొదలు, అన్ని పార్టీలనూ ఏకం చేసిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబు పూటకోమాట, రోజుకో పాట పాట పాడతాడు కాబట్టే జనం ఆయనను నమ్మరు’’ అని రమేశ్ వ్యాఖ్యానించారు. -
బీజేపీ సిగ్గు పడాలి: మంత్రి నక్కా
సాక్షి,గుంటూరు : టీడీపీని వదులుకున్నందుకు బీజేపీ సిగ్గుపడాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ పతనం ఏపీ నుంచే మొదలవుతుందని జోస్యం చెప్పారు. అమిత్ షా లేఖ ఏపీని అవమానించేలా ఉందని ఆయన ఆరోపించారు. ఆమిత్ షా పాత చరిత్ర తిరగేస్తే ఎవరు అవినీతి చేశారో తెలుస్తుందన్నారు. బీజేపీతో పొత్తు వల్ల తాము 15 సీట్లు కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన 19 విభజన హమీల్లో ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని చెప్పిన మోదీ ఇప్పడు కుట్రలు చేసి ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.ఇప్పటికిప్పడు అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ వారు కూడా మద్దతు ఇస్తారని మోదీ భయపడుతున్నారని ఆనంద్ బాబు అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో 40శాతం ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ది చెబుతారని ఆయన విమర్శించారు.