ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్‌పై ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘ మోదీ ప్రభుత్వానికి సిగ్గుందా?. 11ఏళ్లుగా నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. గవర్నర్‌గా ఆయనను ఇన్నేళ్లు ఎలా కొనసాగిస్తారు?. గవర్నర్ వ్యవస్థకు ప్రస్తుత గవర్నర్ కళకం తెస్తున్నారు. ఈ గవర్నర్ వ్యవస్థ వేస్ట్. రాష్ట్ర విభజనకు కారకుడు గవర్నరే.