పోలీసులను దుర్భాషలాడుతున్న టీడీపీ నేతలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ‘నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు.. నోటీసులు మేము చెప్పిన విధంగా రాసి ఇస్తే తీసుకుంటాం.. ంతపల్లి పీఎస్‌కు వచ్చే ప్రసక్తే లేదు.. ఏం తమాషాగా ఉందా.. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు గుర్తు పెట్టుకుంటాం.. అసలు పోలీసుల సహకారంతోనే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి.. అరండల్‌పేట పోలీసులు ఏమైనా గంజాయి పెడతారా ఏంటి.. వచ్చిన ప్రతి ఒక్కర క్షమాపణ చెప్పి వెళ్లండి’ అని గుంటూరులో మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు, ఆయన అనుచరులు గొడవకు దిగారు.
సోమవారం రాత్రి నుం మంగళవారం మధ్యాహ్నం వరకు హడావుడి సృష్టించి, ఏదో జరిగిపోతోందంటూ.. అభత కల్పనలు వ్యాప్తి చెందేలా సర్వ ప్రయత్నాలు చేశారు. గంజాయి విక్రయాల్లో నాయకులు, పోలీసుల పాత్ర ఉందంటూ.. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన వద్ద ఉన్న సమాచారం తెలుసుకునేందుకు నర్సీపట్నం సిఐ కె.శ్రీనివాసరావు, చింతపల్లి పోలీసులు సోమవారం రాత్రి గుంటూరు వసంతరాపురంలోని ఆయన నివాసానికి వచ్చారు. ఫోన్‌లో సమాచారం తెలియజేశారు.
రమ్మని పిలిచి..
తాము మంగళవారం ఉదయం దీనిపై మాట్లాడేందుకు వస్తామని చెప్పిన పోలీసులతో ఇప్పుడే మాట్లాడదాం అని చెప్పిన నక్కా ఆనంద్‌బాబు.. అర్ధరాత్రి పూట విచారణ ఏంటంటూ ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. అప్పటికే సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు మద్యం సేవించి వచ్చి పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఈ పరిస్థితిలో అక్కడి నుంచి వెళ్లిపోయిన పోలీసులు తిరిగి మంగళవారం ఉదయం ఆనంద్‌బాబు కార్యాలయానికి చేరుకున్నారు. స్టేట్‌మెంట్ ఇవ్వటంతో పాటు, నోటీసులు తీసుకునేందుకు సహకరించాలని కోరారు.
అయితే నోటీసులో తాము చెప్పి విధంగా రాస్తేనే.. తీసుకుంటామని ఆనంద్‌బాబు చెప్పారు. తన వద్ద ఎటువంటి సవచారం లేదంటూ పోలీసులకు ఏ మాత్రం సహకరించలేదు. దీనికి తోడు అక్కడే ఉన్న కార్యకర్తలు ఇబ్బందులుకు గురి చేశారు. సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడకుండా అడ్డుపడ్డారు. ‘ఆనంద్‌బాబు వద్ద గంజాయికి సంబంధించి నిర్దిష్ట సవచారం లేదు. ఆయన నోటీసులు తీసుకోలేదు’ అని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment