
సాక్షి, పట్నంబజారు: ‘మీ బతుకులేంటి మీరేంటి.. నాకే నోటీసులు ఇచ్చేందుకు వస్తారా’.. అంటూ టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోలీసులపై చిందులు తొక్కారు. ఇటీవల విశాఖ జిల్లా చింతపల్లిలో జరిగిన కాల్పులకు సంబంధించి.. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారం లేకుండా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయా? అంటూ సోమవారం ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చేశారు.
గంజాయి అమ్మకాల వెనుక ఎవరి హస్తం ఉందో స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ నర్సీపట్నం సీఐ కే. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గుంటూరులోని ఆనందబాబు నివాసానికి సోమవారం రాత్రి వచ్చారు. ఆ సమయంలో ఆనందబాబు పోలీసులపై పరుషంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పలువురు టీడీపీ నేతలతో కలిసి పోలీసులను భయపెట్టేలా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment