నిమ్మల, అనురాధలకు లీగల్‌ నోటీసులు | Aurobindo Pharma Serves Notices to TDP Leaders | Sakshi
Sakshi News home page

నిమ్మల, అనురాధలకు లీగల్‌ నోటీసులు

Published Wed, Feb 26 2020 2:59 PM | Last Updated on Wed, Feb 26 2020 3:23 PM

Aurobindo Pharma Serves Notices to TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్‌ డిమాండ్‌ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు లీగల్‌ నోటీసులు పంపింది. (చదవండి: మిమ్మల్ని ఫినిష్‌ చేసే రోజు వస్తుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement