సాక్షి, అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్‌పై ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘ మోదీ ప్రభుత్వానికి సిగ్గుందా?. 11ఏళ్లుగా నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. గవర్నర్‌గా ఆయనను ఇన్నేళ్లు ఎలా కొనసాగిస్తారు?. గవర్నర్ వ్యవస్థకు ప్రస్తుత గవర్నర్ కళకం తెస్తున్నారు. ఈ గవర్నర్ వ్యవస్థ వేస్ట్. రాష్ట్ర విభజనకు కారకుడు గవర్నరే.
కేంద్రానికి తాబేదారుగా పొలిటికల్ వ్యవహారాలు నడుపుతూ కేంద్రానికి సంధానకర్తగా ఉంటున్నారు. గవర్నర్‌కు ఇచ్చిన బడ్జెట్ ఆయన గుళ్లు, గోపురాలు తిరగడానికే సరిపోతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో రాయబారాన్ని గవర్నరే చేశారు. పవన్‌ను గవర్నర్ పిలిపించుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి?. ఆయనతో భేటీ అయ్యాకే పవన్ మాపై విమర్శలు చేస్తున్నారు. మోదీ, అమిత్ షా, మాఫియా కింగ్స్‌గా వ్యవహరిస్తున్నారు.’ అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment