ఎన్నికల్లో గెలవడం కోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం మామూలే అనే అభిప్రాయం ప్రజానీకంలో పాతుకుపోయింది. కానీ అటువంటి అభిప్రాయాన్ని తారుమారు చేస్తూ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 98 శాతం నెరవేర్చింది ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం. ఇక ముందెవరైనా హామీ ఇవ్వాలంటే జగన్ నెలకొల్పిన ఈ ప్రమాణం అందుకోవాలి. అందుకే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇస్తూ ఉంటాయి. వాటిని తమ మేని ఫెస్టోలో చేర్చి ప్రచారం చేసుకోవడం కూడా సహజం. అయితే గెలి చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలోనే ఆయా పార్టీలు, లేదా నాయకుల మను గడ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు నేతృత్వం వహిస్తున్న టీడీపీ, వైసీపీల పనితీరును అంచనా వేయాలి.
2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేయలేని వాగ్దానాలెన్నో చేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేస్తూ వాటిని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో గెలిచారు. అయితే సీఎం అయ్యాక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కనీసం 10 శాతం కూడా నెర వేర్చలేదు. సీఎంగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో మేని ఫెస్టోను ఏ మేరకు అమలు చేశాననే విష యాన్ని కనీసం సమీక్షించుకోవడానికి కూడా ఆయనకు తీరిక దొరకలేదు. అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 1994, 1999లలో కూడా రెండు సార్లు సీఎంగా పని చేశారు. ఆ సమయాల్లో కూడా తన పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడంగానీ, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గానీ చంద్రబాబు చేయలేదు.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తాను సీఎంగా కొనసాగిన 2014 –19 మధ్య కాలంలో ఉద్యోగాల విషయంలో రాష్ట్రంలోని యువతకు, రుణమాఫీ విషయంలో మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాలయాపన చేశారు. పైగా బాబు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల్లో కూడా అర్హులైన వారందరికీ లబ్ధి కలి గించకుండా పైరవీలకు, అక్రమాలకు పెద్దపీట వేస్తూ ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో ప్రజ లను దోచుకోవడానికి టీడీపీ శ్రేణులను ప్రజల మీదికి వదిలారు. అలా ఐదేళ్లు గడిచి పోతుండగా 2019 నాటి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ‘పసుపు కుంకుమ’ లాంటి పథ కాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నైజమేమిటో అప్పటికే బాగా అర్థమైన రాష్ట్ర ప్రజలు ఆయనను ఓడించి ఇంటికి పంపారు.
జగన్‌మోహన్ రెడ్డి తన ‘నవరత్నాల’ పథ కాలతో పాటుగా ప్రజలకు చేసే ఇతర మేళ్లని గురించి రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంచారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పోల్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోను అమలు చేయడం ప్రారంభించారు. జగన్ మూడేళ్ల పరిపాలనలోనే తన మేని ఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చారు. అంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టోలో హామీ ఇవ్వని కొత్త పథకాలను కూడా అమలు చేయడం మొదలు పెట్టారు. డీబీటీ, నాన్– డీబీటీ పథకాల ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ప్రజలకు సుమారుగా రూ. 2.82 లక్షల కోట్ల రూపాయలను అందించినా అందులో ఎక్కడా ఒక్క పైసా అవినీతి కూడా జరిగిందని ఎవరూ చెప్పలేని విధంగా పూర్తి నీతివంతమైన పరిపాలనను అందించడం జగన్ సృష్టించిన మరో చరిత్ర. అంతేకాదు దేశ చరిత్రలోనే మొదటి సారిగా ఒకేసారి 1.26 లక్షల ప్రభుత్వ ఉద్యోగా లను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడం ఇవాళ దేశమే అబ్బురపడు తున్న అభివృద్ధి. పథకాలను అందించడంలో అర్హతే ప్రామాణికంగా తీసుకొని కుల, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ, రాజకీయ పార్టీ విబేధా లకు తావివ్వకుండా చూడటం జగన్ నైతికతకు నిలువుటద్దం. 2014 ఎన్నికల్లో వాడుకొని మోసం చేసిన పవన్ కల్యాణ్‌తో మళ్లీ పొత్తుకోసం వెంపర్లా డటం, గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నరేంద్ర మోదీ చెలిమి కోసం ఇప్పుడు తహతహలాడటం చంద్రబాబు అనై తిక విధానానికి నిదర్శనమైతే, అప్పుడూ ఇప్పుడూ కూడా కేవలం ప్రజలనే నమ్ముకొని ఒంటరిగా బరిలో నిలబడటానికి సిద్ధపడటం జగన్ నైతికతకు తార్కాణం.
ఈ నేపథ్యంలోనే 2024లో రాబోయే ఎన్నికల కోసం చంద్రబాబు అప్పుడే తన మేని ఫెస్టోను ప్రకటించేశారు. షరా మామూలుగా తాను గతంలో ప్రజలకు ఏం చేసింది చెప్పకుండా ఇక ఇప్పుడేదో చేసేస్తాననే రీతిలో రాజమండ్రిలో టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలోని అంశాలకే పేర్లు మార్చి తన మేని ఫెస్టోగా ప్రకటించడం గమనార్హం. ఆయన భావ దారిద్య్రం ఏ స్థాయికి చేరిందంటే జగన్ పరిపాలనలో తల్లులందరి మన్ననలు పొందిన ‘అమ్మఒడి’ పథకానికి ‘అమ్మకు వందనం’ అని పేరుమార్చి తన మేనిఫెస్టోలో పెట్టేసుకున్నారు. అసలు ఎన్నడూ తన హామీలను నెరవేర్చని చంద్ర బాబు ప్రకటించిన మేనిఫెస్టోకి విలువేముంటుంది? అయినా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైన, జగన్ పరిపాలనపై చేస్తున్న ఆరోపణల మీద బహిరంగ చర్చకు రావాలని మేము చేసిన సవాల్‌కు ఇప్పటివరకూ బాబు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదివరకు అధికారమిచ్చి అందలం ఎక్కిస్తే చంద్రబాబు, ఆయన అనుచరగణం చేసిందేమిటో బాగా తెలి సిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబు మేని ఫెస్టో పేరిట కొత్తగా ఇస్తున్న హామీలను నమ్మే అవకాశం ఏ మాత్రం లేదు.
:::డా. మేరుగు నాగార్జున, వ్యాసకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు
నిజంగా నవశకమే...
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2019 వరకూ రెండే పార్టీల పాలన సాగింది. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండగా, ఆ తర్వాత కాంగ్రెస్ అధి ష్ఠానం చేసిన అపరా ధాల వల్ల నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ అధి కారాన్ని చేజిక్కించుకుంది. ప్రజల నమ్మకాన్ని ఎన్టీఆర్ వమ్ము చేయలేదు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరమని భావించి ఆ దిశగా కొత్త సంక్షేమానికి తెర తీశారు. సమాజంలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ ఫలాలు దక్కేలా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీని లాక్కొని అధికారంలోకి వచ్చారు. అక్ర మంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను పక్కన పెట్టి నేల విడిచి సాము చేశారు. హైటెక్ అంటూ కొన్ని వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. విజన్ 2020 అంటూ త్రిశంకు స్వర్గంలో తేలియాడుతూ ప్రజలను గాలికొదిలేశారు.
సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ రాజ శేఖరరెడ్డి ‘నేనున్నా’ అంటూ తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చారు. మండు వేసవిలో కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలో తన ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చీ రాగానే ప్రజలను తమ అగచాట్ల నుంచి విముక్తి కలిగించేలా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కరవు కాటకాలతో అల్లాడు తున్న ప్రజలకు ఊపిరి పోశారు. వైఎస్‌ఆర్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల్లో ప్రజలు హాయిగా, సంతోషంగా గుండెలో మీద చేతులు వేసుకుని బతికారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను బాధించింది.
వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే నేను రాజకీయా ల్లోకి అడుగు పెట్టాను. జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యేగా ఎది గాను. వైఎస్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమతుల్యత దెబ్బతింది. ప్రాంతీయ వాదా లతో అట్టుడికి పోయింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ విభజన, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం జరిగి పోయాయి. ఎప్పుడూ ఎవరో ఒకరి సహాయంతో లేదా అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చే చంద్రబాబు చేతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దోపిడీకి గురైంది. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, గొప్ప విజనరీ అని డప్పాలు కొట్టుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓడిపోయారు.
ఇదే సమయంలో దిక్సూచిలా వైఎస్‌ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించారు. నేను విన్నా... నేను కన్నా... నేను ఉన్నా అంటూ ప్రజల ఆదరాభిమానాలతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌కు కూడా ఇవ్వని భారీ మెజారిటీని ప్రజలు జగన్‌కు ఇచ్చారు. తన పాదయాత్రలో కనిపించిన, వినిపించిన ప్రజల కష్టాలను, అవస్థలను మేనిఫెస్టోగా రూపొందించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాను, బైబిలు మాదిరిగా భావించి అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో 98.5 శాతం హామీ లను అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఓ వైపు చంద్రబాబు ఖజానా ఖాళీ చేసినా... మరో వైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా... ఏ మాత్రం బెదరకుండా మొక్కవోని ధైర్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకే వెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టు కుంటూ, పొదుపు మంత్రం పాటిస్తూ చంద్ర బాబు హయాంలో చెల్లాచెదురైన ఆర్థిక వ్యవ స్థను గాడిలో పెట్టి ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని రెండు కళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. విద్యా, వైద్య రంగా లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. చదువు ఒక్కటే భావితరాలకు తర గని ఆస్తి అని చెప్పి విద్యార్థుల పాలిట మేన మామగా మారారు. ప్రతి పేద వాడి ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం చక్కగా ఉంటుందని భావించారు. రైతు సంక్షేమమే ప్రధానంగా భావించి గత టీడీపీ హయాంలో పడకేసిన వ్యవసాయాన్ని పండుగ చేశారు.
జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు వరుసగా టకటకా చెబితే పది లక్షల బహుమతి ప్రకటించా! ఇంతవరకూ నా వద్దకు వచ్చి ఎవరూ చెప్పలేక పోయారు. అంటే అన్ని పథకాలను ఆయన ప్రజలకు అందిస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ సమ న్యాయం చేయడం సాధ్యమని ఈ నాలుగేళ్లలో జగన్ నిరూపించారు. పరిపాలనలో పారదర్శ కత, ప్రజల గుమ్మం ముందుకు ప్రభుత్వం వెళ్లడం, అవినీతికి అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు బదిలీ, వాలంటీర్ల సేవలు తదితరాలు గతంలో ఎన్నడూ లేనివి. ఇవన్నీ కొత్తగా ప్రవేశపెట్టిన జగన్ పెద్ద విజనరీ. ప్రతిపక్షాల విమర్శలు, పచ్చ మీడియా దాడులకు అదరని, బెదరని గొప్ప ధైర్యశాలి. నాలుగేళ్ల పాలనతో 42 ఏళ్ల రాజ కీయ సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. జగన్ పాలన నిజంగా నవ శకమే!
:::వ్యాసకర్త రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డా‘‘ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
(వైఎస్పార్‌సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment