ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తు, దళితుల భూముల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరోఎత్తు. ఒకవైపు పేద లకు కొత్తగా ప్రభుత్వ భూముల్ని అసైన్ చేస్తూ, మరోవైపు అందని ద్రాక్షలా ఉన్న భూములపై దళితు లకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. పేదలకు చోటే లేదన్న అమ రావతి రాజధాని భూముల్లో నిరుపేదలకు ఇళ్లను నిర్మిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం.
మహానేత డా‘‘ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న ప్పుడు భూమిలేని నిరుపేదలకు భూములను ఇచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ ఆయన తనయుడు సీఎం జగన్ పేదలకు భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,935 మంది భూమిలేని నిరుపేదలకు 54,129.45 ఎకరాలను అసైన్ చేయాలని జగన్ ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అలాగే 3 కేటగిరీల్లో 9,062 ఎకరాల లంక భూముల విషయంలోనూ రైతులకు అనుకూలంగా అసైన్‌మెంట్ పట్టాలు, 5 ఏళ్ల లీజు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయానికి కూడా కేబి నెట్‌లో ఆమోద ముద్ర వేశారు.
‘ల్యాండ్ పర్చేజ్’ స్కీమ్ కింద దళిత రైతులకు కొని ఇచ్చిన భూములపై వారికి పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు కల్పించాలన్న చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకో వడంతో దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. 14,223 మంది దళిత రైతులు గతంలో వారు పొందిన భూములకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలను కూడా మాఫీ చేశారు. అలాగే దళిత రైతులకు వారి భూములపై యాజ మాన్య హక్కులను కల్పించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మాఫీ చేస్తూ, ప్రభుత్వమే ఖర్చులు భరించి వారి భూములు రిజిష్టర్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన హక్కు పత్రాల పంపిణీకి ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అసైన్ చేసిన పేద రైతుల పరిస్థితి కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్‌లో భూములు పొందిన పేద దళిత రైతుల్లాగే ఉంది. తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు ‘డీకేటీ’ పట్టాలు పొందిన రైతులకు కూడా వాటిపై పూర్తి హక్కులు ఉండవు. ఈ భూమలన్నీ నిషేధిత జాబితాలో ఉన్న కార ణంగా ఇవి రిజిష్టర్ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములపై కూడా పేద రైతులకు పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు కల్పించి ఇతర రైతుల తరహాలోనే వారు కూడా తమ భూములను అవసరమై నప్పుడు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీలుగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసు కున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద సాహసోపేత మైన నిర్ణయం. ఆయా భూములను అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా ఆమోదముద్ర వేశారు.
ఇది మాత్రమే కాదు, గ్రామాల్లోని కుల వృత్తులు చేసు కునేవారికి ఇచ్చిన ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రజక, నాయీబ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ వంటి ఇతర కులవృత్తులకు సంబంధించిన వారి భూముల విలువలు పెరగనున్నాయి. వారి కష్టాలు శాశ్వ తంగా తీరిపోనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడలలో చాలా వాటికి ఇప్పటి వరకూ శ్మశానాలు లేని కారణంగా దళితులు మరణించినప్పుడు వారికి అంత్యక్రియలు చేయడం కూడా ఇబ్బంది కరంగా ఉండేది. వారి కష్టాన్ని గుర్తించి గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఎస్సీల శ్మశాన వాటికల కోసం ప్రత్యేకంగా ఒకేసారి భూములను కేటాయించడం ఇదే తొలిసారి. ఒక గ్రామానికి ఒక ఎకరా వరకూ శ్మశానం కోసం ఇవ్వనున్న ప్రభుత్వం ఈ భూమి కేటాయింపు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రంలోని 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
రాజధాని ప్రాంతమైన అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికే చెందిన ధనిక రాజధాని ప్రాంతంగా మిగిలిపోకూడదని సీఎం జగన్ భావించారు. ఈ కారణంగానే అత్యంత ఖరీదైన రాజధాని భూముల్లోనూ పేదలకు భాగస్వామ్యం ఉండాలని వారికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇచ్చారు. అత్యంత నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారితో పాటుగా అగ్ర కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు పట్టాలు ఇవ్వాలని సీఎం సంకల్పించినప్పుడు ప్రతిపక్షాలవారు రాజధాని రైతులతో సుప్రీం కోర్టులోనూ కేసులు వేయించారు. వీటినేమీ పట్టించుకోకుండా ఏపీ ఆర్–5 జోన్‌లో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న సీఆర్డీఏప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అవ్వబోతు న్నాయి. ఈ పనులను ప్రారంభిస్తూ సీఎం స్వయంగాశంకుస్థాపన కూడా చేయనున్నారు. సీఎం జగన్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేద వర్గాల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కారణంగానే రాష్ట్రంలోని పేద వర్గాలకు చెందిన వారందరూ కుల, మతాలకు అతీతంగా మరోసారి జగనన్నకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
-డా‘‘ మేరుగు నాగార్జున
వ్యాసకర్త ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment