
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బహుజనులకు లభిస్తున్న ఆదరణ చరిత్రాత్మకమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను గుంటూరులోని ఆమె నివాసంలో నాగార్జున శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళిత, బహుజనులందరూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన నాగార్జునను సుచరిత అభినందించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో మేరుగు నాగార్జున తన శాఖ బాధ్యతలు చేపడతారని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.