bahujanulu
-
బహుజన కులాల మద్దతుతోనే...
తొంభై ఎనిమిది ఏండ్ల కింద 1924 సంవత్సరంలో ఒకే వృత్తి, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం కలిగిన ఒకే కులం వారు ‘‘అఖిల భారత యాదవ మహాసభ’’గా ఏర్పడ్డారు. దేశంలోని ఇతర అణగారిన కులాలతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో ముందు భాగాన నిలిచారు. అనేక మంది వీరులను ఆ సమరానికి వారు అందిం చారు. యాదవ మహాసభ కృషి ఫలితం గానే బ్రిటిష్ పాలకులు 1931వ సంవత్సరంలో కుల గణన చేప ట్టాల్సి వచ్చిందన్నది నేడు గుర్తించాల్సిన విషయం. దాని ఫలితం గానే అట్టడుగు శ్రామిక కులాలవారు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా ఎదిగి వచ్చారు. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి మొదలైన ఈ కల్చర్ అణగారిన కులాలను రాజకీయ బాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఫ్రెంచి విద్యావేత్త క్రిస్టాఫ్ జెప్ఫెర్లో మాటల్లో చెప్పాలంటే... ఇది అణగారిన కులాల్లో ఇంకా సమగ్ర స్వరూపాన్ని సంతరించుకోవాల్సిన ఒక నిశ్శబ్ద విప్లవం. నిజానికి అట్టడుగు కులాలు అధికారం పొందే స్థాయికి ఎదగడం అనేది సూటిగా సాగేది కాదు. అంతర్లీన క్రియాశీల ప్రక్రియ. ఆ రకంగా వచ్చిన అట్టడుగు కులాల చైతన్యం దుర్భేద్యమైన కాంగ్రెస్, ఇతర వారసత్వ రాజకీయాల కంచుకోటలను బద్దలు కొట్టింది. ఫలితంగానే వివిధ రాష్ట్రాల్లో అట్టడుగు కులాలు, అణగారిన జాతులు రాజ్యాధికారంలోకి రాగలిగాయి. ఇది స్వతంత్ర భారతంలో మరింత అభివృద్ధి అయిందని చెప్పవచ్చు. అయితే ఇదే సందర్భంలో ‘‘కుల సంఘాలు కుల నిర్మూలన కోసం పని చేయకుండా తమ స్వేచ్ఛను కోల్పోయి రాజకీయ పార్టీల వాడకానికి గురవుతున్నాయి.’’ ఏ అగ్రకులాధిపత్య, వారసత్వ రాజకీయాలను కూకటివేళ్ళతో పెకలించారో అలాంటి జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కోసమే, కులాలను సంఘటితం చేసే పనిముట్లుగా కుల సంఘాలు మారాయని చరిత్రకారుల విమర్శ కూడా ఉంది. సరిగ్గా ఇక్కడే కుల సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అణగారిన కులాలు అధికారం అందిపుచ్చుకోవడానికి ఆధిపత్య కులాలూ, పాలక వర్గాలూ అంత ఈజీగా అనుమతించవు. కాబట్టి ఆ పనిని చాప కింద నీరులా చేయాలి. రాజకీయ రంగం లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అణగారిన కులాల క్రియాశీలత మరింత పెంచుకోవాలి. అంటే శ్రామిక కులాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఒక ఉన్నత ఆశయంగా అర్థం చేసుకోవాలి. అది ఈ దేశంలో ఫూలే వెలుగులో ఛత్రపతి సాహూ మహరాజ్ లోతుగా అర్థం చేసుకున్నాడు. కనుకనే సమాజ మార్పుకు చదువే కీలకం అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన కుల వివక్ష మీద పోరాడటంతో పాటు కొల్హాపూర్ పట్టణంలో 1901లో జైన హాస్టల్, విక్టోరియా మరాఠ హాస్టల్, 1906లో ముస్లిం హాస్టల్, 1907లో వీరశైవ లింగాయత్ హాస్టల్, 1908లో అంటరాని వారికి, మరాఠాలకి హాస్టల్; దర్జీ, నేతన్నలకు 1921లో నాందేవ్ హాస్టల్, మరాఠాలకి హాస్టల్, విశ్వకర్మలకు సోనార్ హాస్టల్ నెలకొల్పి ఆయా కులాల నుంచి ఆ కాలంలోనే అట్టడుగు కులాలను ఎలైట్ సెక్షన్స్‌గా ఎదిగే విధంగా తోడ్పడ్డాడు. ఆ కోణంలోనే ఉత్తర భారతదేశంలో ‘యాదవ మహాసభ’ కృషి చేసింది. సాహూ మహరాజ్ నేతృత్వంలో జరిగిన కృషి ఫలితాలను తొందరగానే గ్రహించిన ఆధిపత్య కులాల వారైన రెడ్డి, కమ్మ, వెలమలూ... మరికొన్ని వెనకబడిన కులాల వారూ తెలుగు నేలపై సంఘాలుగా సంఘటితమై తమ తమ కులాల అభివృద్ధికి నడుం బిగించారు. హైదరాబాద్‌లో 1909 సంవత్సరంలో ‘యాదవ మహాజన సంఘం’, 1919లో ‘రెడ్డి సంఘం’, 1920లో ‘గౌడ సంఘం’, 1930లో ‘కమ్మ సంఘం’, నిజాం చివరి కాలంలో ‘వెలమ సంఘం’ ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా రెడ్డి సంఘం వారు ప్రత్యేకమైన ప్రణాళికతో పని చేశారు. ఆ జాతి విద్యా, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధికి రెడ్డి కుల స్థితిమంతులు విశేష కృషి చేశారు. ‘రెడ్డి హాస్టల్’ లాంటి వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యావంతుల్ని తయారుచేసి అధికారం అందుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇది అందరికీ ఆదర్శం. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!) ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు స్థితి మంతులుగా పెద్ద సంఖ్యలో ఉనప్పటికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వలన తమ హక్కులు పొందడంలో, రాజ్యాధికారం సాధించడంలో వెనుక బడిపోయారన్నది కాదనలేని సత్యం. కనుక వివిధ కుల సంఘాల వారు పై అనుభవాల్లోంచి లోతైన గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ కులానికి ఆ కులం ఎదిగే క్రమంలో మిగతా బహుజన కులాల మద్దతు కూడా తీసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) - చలకాని వెంకట్ యాదవ్ వ్యాసకర్త హైకోర్ట్ న్యాయవాది -
సీఎంకు దళిత, బహుజనులు వెన్నుదన్నుగా ఉండాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బహుజనులకు లభిస్తున్న ఆదరణ చరిత్రాత్మకమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను గుంటూరులోని ఆమె నివాసంలో నాగార్జున శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళిత, బహుజనులందరూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన నాగార్జునను సుచరిత అభినందించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో మేరుగు నాగార్జున తన శాఖ బాధ్యతలు చేపడతారని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘సామాజిక న్యాయం’లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ‘బహుజన హితాయా.. బహుజన సుఖాయా’ అని చాటిన బుద్ధుడి వ్యాఖ్యలను ఆచరణలో నిజం చేసి చూపిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారని బహుజన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్ కితాబిచ్చారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కేటాయించడంపై స్పందించిన ఆయన.. శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. బుద్ధిజం, అంబేడ్కరిజం, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను సీఎం జగన్ సాకారం చేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో బహుజనుల కోసం ఏర్పడిన బీఎస్పీ సైతం రాజకీయ మనుగడ కోసం అగ్రవర్ణాలకు సీట్లిచ్చిందని, అగ్రవర్ణానికి చెందిన సీఎం జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రాతిపదికన నామినేటెడ్, మంత్రి పదవులు కేటాయించి యుగపురుషుడిగా నిలిచారని ప్రశంసించారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు, రాజకీయ పదవుల పేరుతో గౌడ–శెట్టిబలిజలకు, రిజర్వేషన్ పేరుతో కాపులకు ఇతర కులాలతో తగవులు పెట్టిందని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసేలా ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా చర్యలు చేపట్టారని గురుప్రసాద్ గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా బీసీ కులాల మేలు కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు. కనీసం ఓటుకు, వార్డు మెంబర్‌కు కూడా అర్హతలేని సంచార జాతులకు ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని, బహుజనులు ఎల్లప్పుడూ ఆయన వెంటనే ఉంటారని గురుప్రసాద్ స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంనే మేం కోరుకున్నాం.. ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య రాష్ట్రంలో దళిత బహుజనులకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘకాలం కొనసాగాలని, ఇలాంటి ముఖ్యమంత్రే తమకు కావాలని కోరుకున్నామని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య చెప్పారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అనేక రాష్ట్రాల్లో బీసీ, దళితులు ముఖ్యమంత్రులైనా.. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా అణగారిన వర్గాలకు అగ్రపీఠం వేసిన వారు లేరన్నారు. దళితుల పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్‌లో సైతం అట్టడుగు వర్గాలకు అంతంత మాత్రంగానే ఉన్నత పదవులు దక్కాయని గుర్తుచేశారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చిన సందర్భాలు తక్కువేనని అన్నారు. దళిత బహుజనులకు చంద్రబాబు ఏనాడూ ప్రాధాన్యత శాఖలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రం తన వారితో త్యాగాలు చేయించి మరీ ఆయా పదవుల్లో ఎస్సీ, బీసీలను కూర్చోబెడుతుండటం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని చెంగయ్య కితాబిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎం వైఎస్ జగన్ రెండు పర్యాయాలు ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాష్ట్ర హోం మంత్రి పదవులివ్వడం ఆయనకే చెల్లిందన్నారు. సామాజిక విప్లవాన్ని సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు దళితబహుజనులు అండగా ఉంటారని తెలిపారు. -
వికేంద్రీకరణకే మద్దతు..
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణను కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ రాజధాని మందడంలో చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలకు బీసీ ఐక్యవేదిక, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, నేషన్ దళిత సంఘం, మాదిగ ఐక్య వేదికలు మద్దతు తెలిపాయి. వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీసంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు అనేక కుట్రలు చేస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. మూడు రాజధానులకే తమ మద్దతంటూ అమరావతిలో దళిత, బీసీ, మహిళా, ప్రజా సంఘాల నేతలు గళమెత్తున్నారు. (వికేంద్రీకరణతోనే ప్రగతి) -
బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి
అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ నిర్మల్‌రూరల్ : దేశంలో, రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు తీరలేదని, ఇక బహుజనులే రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరముందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ అన్నారు. స్థానిక టీఎన్జీవోస్ సంఘభవనంలో బుధవారం పార్టీ నిర్మల్ అసెంబ్లీ అధ్యక్షుడు బొర ముత్యం అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పదాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పదాధికారులతో ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగిందేమి లేదని, ఇక సమస్యలను పరిష్కరించుకోవాలంటే బహుజనులే రాజ్యాధికారం చేపట్టాలని అన్నారు. సమావేశంలో బామ్సెఫ్ జిల్లా కన్వీనర్ మార రాజన్న, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పట్ల బాపురావు, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు, శేర్లింగంపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు హన్మంత్‌రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర రాజన్న, పాముల బాపురావు, సుంకరి సాయన్న, మర్సకోల భీంరావు, మల్లెల భూమన్న, దేవోళ్ల రాజలింగం, లింగన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు.