
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణను కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ రాజధాని మందడంలో చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలకు బీసీ ఐక్యవేదిక, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, నేషన్ దళిత సంఘం, మాదిగ ఐక్య వేదికలు మద్దతు తెలిపాయి. వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీసంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు అనేక కుట్రలు చేస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. మూడు రాజధానులకే తమ మద్దతంటూ అమరావతిలో దళిత, బీసీ, మహిళా, ప్రజా సంఘాల నేతలు గళమెత్తున్నారు. (వికేంద్రీకరణతోనే ప్రగతి)