The Hindu Interview: CM Jagan Interesting Comments On AP 3 Capitals - Sakshi
Sakshi News home page

ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Published Mon, Oct 31 2022 8:04 AM | Last Updated on Mon, Oct 31 2022 3:00 PM

The Hindu Interview: CM YS Jagan About AP Decentralization - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గం ఉన్నచోటే సచివాలయం కూడా ఉంటుందన్నారు.
చదవండి: డిజిటల్‌ వైద్యంలో ఏపీనే ఫ్రంట్‌ రన్నర్‌

సహజ మౌలిక సదుపాయాలున్న ఏకైక పెద్ద నగరం విశాఖ. ఆర్థిక అనుకూలత, పాలన సౌలభ్యం కోసమే రాజధానిగా విశాఖ ఎంపిక చేశామని సీఎం చెప్పారు. రూ.5 నుంచి 10వేల కోట్లతో విశాఖ పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికేంద్రీకరణ స్ఫూర్తితో విశాఖను ఎంచుకున్నామన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటాయని సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి.. విజయవాడలో గానీ, గుంటూరులో గానీ లేదన్నారు. అమరావతి అనేది ఆచరణ సాధ్యం కాని రాజధాని అని,  2 పట్టణాలకు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement