the hindu
-
ఆర్బీఐకి ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిష్టాత్మక ’ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను గెలుచుకుంది. ది హిందూ బిజినెస్‌లైన్ ఛాంజ్‌మేకర్ అవార్డ్ 2023కు సంబంధించి గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ ఈ గుర్తింపును పొందినట్లు ఒక ప్రకటన వెలువడింది. మొత్తం ఆరు కేటగిరీల్లో ఈ ఛేంజ్ మేకర్ అవార్టులను ప్రకటించారు. చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్, ఛేంజ్ మేకర్ – సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేకర్ – డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేకర్ – ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, యంగ్ ఛేంజ్‌మేకర్స్ అవార్డులు వీటిలో ఉన్నాయి. డెయిరీ సంస్థ అమూల్‌కు ఐకానిక్ ఛేంజ్ మేకర్ గుర్తింపు లభించింది. హెర్కీ వ్యవస్థాపకుడు నేహా బగారియా, ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్‌కు ’ఛేంజ్ మేకర్ – సోషల్ ట్రాన్స్ఫర్మేషన్’ అవార్డు లభించింది. స్టెలాప్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఛేంజ్మేకర్– డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ గుర్తింపు లభించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ‘ఛేంజ్ మేకర్ – ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్’ అవార్డు పొందింది. టెక్ ఎడ్యుకేషన్, మెటల్ హెల్త్ ఎవేర్నెస్లో విశేష కృషి సల్పిన శ్రీనిధి ఆర్ఎస్కు ‘యంగ్ ఛేంజ్మేకర్’ గుర్తింపు లభించింది. -
ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గం ఉన్నచోటే సచివాలయం కూడా ఉంటుందన్నారు. చదవండి: డిజిటల్ వైద్యంలో ఏపీనే ఫ్రంట్ రన్నర్ సహజ మౌలిక సదుపాయాలున్న ఏకైక పెద్ద నగరం విశాఖ. ఆర్థిక అనుకూలత, పాలన సౌలభ్యం కోసమే రాజధానిగా విశాఖ ఎంపిక చేశామని సీఎం చెప్పారు. రూ.5 నుంచి 10వేల కోట్లతో విశాఖ పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికేంద్రీకరణ స్ఫూర్తితో విశాఖను ఎంచుకున్నామన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటాయని సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి.. విజయవాడలో గానీ, గుంటూరులో గానీ లేదన్నారు. అమరావతి అనేది ఆచరణ సాధ్యం కాని రాజధాని అని, 2 పట్టణాలకు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
సీఎం ఎక్కడైనా కూర్చుండి పాలన చేయొచ్చు : సీఎం వైఎస్ జగన్
-
ఎన్ రామ్‌తో సీఎం జగన్ మాటామంతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. బుధవారం విజయవాడలోని గేట్ వే హోటల్లో జరిగిన ‘ది హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్.రామ్ బుధవారం విజయవాడ వచ్చారు. ముందుగా ఆయన తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. అల్పాహార విందు అనంతరం విజయవాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇరువురూ ఒకే కారులో బయలుదేరారు. సాధారణంగా కారు ముందు సీట్లో కూర్చునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనతో కలిసి మధ్య సీట్లో కూర్చున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తమ మధ్య చర్చకు వచ్చిన కొన్ని అంశాలను సదస్సులో రామ్ ప్రస్తావించారు. (చదవండి: రామ్ గారూ.. సాయం చేయనా!) -
సీఎం జగన్ తన హోదాను పక్కనపెట్టి..
-
రామ్ గారూ.. సాయం చేయనా!
సాక్షి, అమరావతి: పెద్దల పట్ల తనకున్న గౌరవభావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ షూ వేసుకునే సమయంలో ఇబ్బంది పడుతుండగా సీఎం జగన్ తన హోదాను పక్కనపెట్టి.. ఆయన చేయి పట్టుకుని తోడ్పాటు అందించారు. బుధవారం విజయవాడలోని గేట్ వే హోటల్లో జరిగిన ‘హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్‌తో కలిసి ఎన్.రామ్ వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ఎన్.రామ్ తమ తమ బూట్లను పక్కనే విడిచి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం ఎన్.రామ్ నిలబడి షూ వేసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా పక్కనే ఉన్న సీఎం జగన్ ఆయన చేయి పట్టుకుని సహకారం అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే.. గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ మెడల్స్ బహూకరణ సమయంలో ఓ పోలీసు అందుకున్న మెడల్ కింద పడిపోగా.. సీఎం వైఎస్ జగన్ కిందకు వంగి దానిని తీసి అందించిన విషయం విదితమే. (చదవండి: సీఎం జగన్‌ను అభినందించిన ఎన్ రామ్) -
గ్రాఫిక్స్ చూపించాలని అనుకోలేదు..
-
భవిష్యత్తు తరాల కోసం ఆలోచించా..
-
‘ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం..’
సాక్షి, విజయవాడ : ‘ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలపై పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకున్న ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని సదస్సుకు హాజరైన ఆహుతులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం, రివర్స్ టెండరింగ్, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై లెక్కలతో సహా సీఎం వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. 77 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదని అన్నారు. ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పడు కనీస అవసరం. ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లకు పంపగలమా?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చదవాలి?. 98.5 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెప్తున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లిష్ మీడియంలో చదవడం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. మేం కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు.. విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతాం. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తున్నాం. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకురావడంతోపాటు.. విద్యావ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫొటోలు తీసి.. వచ్చే మూడేళ్లల్లో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం. స్కూల్ బిల్డింగ్లు, బాత్రూమ్లు, ఫర్నీచర్ సహా అన్నింటినీ మార్చబోతున్నాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల నాణ్యతను పెంచబోతున్నాం. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాం. వంటలు చేసే ఆయాల జీతాల పెంచాం. అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15వేలు ఇచ్చాం. తల్లులు తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తే ఏడాది రూ. 15వేలు అందజేస్తాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకోస్తున్నాం. డిగ్రీని నాలుగేళ్లపాటు, ఇంజనీరింగ్‌ను ఐదేళ్లపాటు చదవాల్సి ఉంటుంది. చివరి ఏడాది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థులకు 100 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్నాం. ఏపీలో ప్రతి విద్యార్థికి విద్య రూపంలో ఎప్పటికీ తరగని ఆస్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేం చేపట్టిన సంస్కరణలకు మద్దతు తెలిపిన ది హిందూ పత్రికకు ధన్యవాదాలు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించా.. ప్రతీ ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. ఒక్క ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ రిపోర్టులే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను. ఒకవైపు అమరావతికి రూ. లక్షా 9వేల కోట్లు ఖర్చు చేయాలా?.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచన చేశాను. మరోవైపు విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతోంది.. విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. విశాఖలో సచివాలయం, హెచ్‌వోడీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉండనున్నాయి. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. (చదవండి: రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) గ్రాఫిక్స్ చూపించాలని అనుకోలేదు.. రాష్ట్రంలోని ప్రజలను మభ్య పెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని నేను అనుకోలేదు. నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలు మాత్రమే చెప్పా. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిచాం. గత పదేళ్లలో శ్రీశైలానికి చేరే కృష్ణా జలాలు.. 1200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పరిమితమయ్యాయి. మొత్తం కృష్ణానది ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గోదావరిలో పుష్కలమైన జలాలున్నాయి. ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్క అమరావతిలోనే డబ్బులు ఖర్చు చేయాలా?.. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలా?. (చదవండి: లెజిస్లేటివ్ రాజధాని అమరావతే) రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 2వేల కోట్లు ఆదా.. ఈ ఉగాదికి ఇల్లు లేని పేదవారికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా ప్రక్షాళన చేపట్టాం. ఒక టెండర్ ప్రాసెస్ కంటే ముందే న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది. జ్యుడిషియల్ ప్రివ్యూ యాక్ట్ ద్వారా టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్ట్ సంబంధించి టెండర్లలో ఎలాంటి మార్పునైనా న్యాయమూర్తి సూచించవచ్చు. ఏడు రోజులపాటు టెండర్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నాక.. న్యాయమూర్తి ఆ టెండర్లకు ఒకే చెప్తారు. ఆ తర్వాత అత్యంత తక్కువ కోట్ చేసిన ధరను ప్రకటిస్తారు. ఆ ధరకంటే కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంకా ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే వారికి ఇస్తాం. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చేశాం. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ. 830 కోట్లు ఆదా చేశామ’ని తెలిపారు. -
సీఎం జగన్‌ను అభినందించిన ఎన్ రామ్
సాక్షి, విజయవాడ : పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. బుధవారం విజయవాడలోని గేట్ వే హోటల్ల్లో ‘ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ రామ్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పడమే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల బాధలను తెలుసుకున్న వైఎస్ జగన్.. సీఎం అయ్యాక వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. (చదవండి: పాలనలో సరికొత్త అధ్యాయం) -
పారదర్శకతకు నీరాజనం
అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది. ఈ వ్యవహారంలో లోగడ వెలువరించిన తీర్పును పునస్సమీక్షిం చాలంటూ దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను బుధవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను దొంగిలించి ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందూ’ కథనాలు రాసిందని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది గనుక వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాద నను కూడా తిరస్కరించింది. ఈ తీర్పులో మరో కీలకమైన అంశం– ‘ది హిందూ’ రఫేల్ పత్రాలను ప్రచురించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని, దానికి ఆ హక్కు ఉన్న దని తేల్చిచెప్పడం. రఫేల్ ఒప్పందంపై సమగ్రమైన దర్యాప్తును కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబర్లో సుప్రీంకోర్టు తోసిపుచ్చాక ఆ సమస్య ముగిసినట్టేనని కేంద్రం భావించింది. కానీ ‘ది హిందూ’ ప్రచురించిన మూడు కథనాలతో విషయం మొదటికొచ్చింది. అంతక్రితం ఏం చెప్పినా ఆ కథనాలు వెలువడ్డాకైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఉంటే బాగుండేది. ఆ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని భావిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందుకు భిన్నంగా పత్రాలు దొంగిలించారని, ఇది నేరమని వాదించడం అర్ధరహితం. రఫేల్ ఒప్పందంలో జవాబు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలపై ఏక కాలంలో మన ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడంలోని సహేతుకత ఏమిటో వివరించాలి. అలాగే దీనివల్ల మనకు చాలా నష్టం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున చర్చలు జరిపిన బృందం వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజమెంతో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇదేవిధంగా ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసు కోనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన సల హాకు భిన్నంగా ఎందుకు వ్యవహరించాల్సివచ్చిందో చెప్పాలి. ఫ్రాన్స్ ప్రధాని ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ సరిపోతుందని ఎలా అనుకున్నారో వివరించాలి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండానే సమస్య ముగిసిపోయిందని, సుప్రీంకోర్టు తమకు క్లీన్చిట్ ఇచ్చిందని కేంద్రం భావించడం వల్లనే అది మరింత జటిలంగా మారింది. కొత్త అంశాలు వెల్లడైనప్పుడు ఏ కేసునైనా న్యాయస్థానాలు తిర గదోడతాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపో యిందో అనూహ్యం. ఒకవేళ దీనిపై పునర్విచారణ అనవసరమనుకుంటే దానికి మద్దతుగా బల మైన వాదనలు వినిపిస్తే వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా దొంగిలించారని ఒకసారి... కాదు, వాటి నకళ్లు తీసుకున్నారని మరోసారి వాదించడం ద్వారా ఆ పత్రాల ఆధారంగా వెలువడిన కథ నాల్లో వాస్తవమున్నదని అంగీకరించినట్టయింది. పోనీ అలా అంగీకరించి, ఆ నిర్ణయాలను సహే తుకంగా సమర్ధించుకుంటే ఎవరూ అభ్యంతరపెట్టరు. ఆ జోలికి పోకుండా దొంగిలించిన పత్రాలు గనుక అసలు వాటిని పరిగణనలోకే తీసుకోరాదన్న తర్కానికి దిగింది. దీనికి ధర్మాసనం అంగీ కరించలేదు. తాము వెల్లడించదల్చుకోని అంశాలన్నిటినీ గంపగుత్తగా అధికార రహస్యాలుగా పరిగణిం చడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గోప్యత పేరు చెప్పి ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండే అనేక అంశాలను ప్రభుత్వాలు వెల్లడి కానీయడం లేదు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు వాక్‌స్వాతంత్య్రంలో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. కనుక అధి కార రహస్యాల చట్టం కింద కేసులు పెట్టడం వాక్ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. మన రాజ్యాంగంలోని 19(2) అధికరణ వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పమంటున్నది. కానీ అధికార రహస్యాల చట్టం దీన్ని విస్మరించింది. ప్రభుత్వాలకు బయటపెట్టడం ఇష్టం లేని ఏ అంశమైనా ఈ చట్టం పరిధిలోకొస్తుంది. వెనువెంటనే దానికింద చర్యలు మొదలవుతాయి. ఒకపక్క ప్రజాస్వామిక దేశమని ఘనంగా ప్రక టించుకుంటూ ఇలా విచక్షణారహితంగా వ్యవహరించే ధోరణి సరికాదు. నిజానికి మన దేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమాన్ని అణిచేయడానికి బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టమిది. ఈ సందర్భంగా పెంటగాన్ పత్రాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తులు ఉదాహరించారు. వియత్నాం యుద్ధంపై ప్రభుత్వం పౌరులకు అసత్యాలు చెబుతున్న దని చెబుతూ అందుకు సాక్ష్యంగా ‘న్యూయార్క్‌టైమ్స్’ అధికారిక పత్రాలను ప్రచురించింది. వీటిని అడ్డుకోవడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కౌల్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్ కేఎం జోసెఫ్ విడిగా రాసిన తీర్పు పత్రికాస్వేచ్ఛకు నీరాజనాలు పట్టింది. అదే సమయంలో మీడియా నిర్వహిం చాల్సిన, నిర్వహిస్తున్న పాత్రపై నిశితంగా వ్యాఖ్యానించింది. చలనశీలమైన ప్రజాస్వామ్యం వర్థిల్ల డానికీ, అది బలపడటానికి మీడియా నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే దానిద్వారా ప్రస రించే సమాచారమంతా సత్యనిష్టకు లోబడి ఉండాలి తప్ప ఇతరత్రా అంశాలతో కలుషితం కాకూ డదని తీర్పు హితవు చెప్పింది. అలా కలుషితం కావొద్దని డిమాండ్ చేసే హక్కు వినియోగదారు లకు ఉంటుందని కూడా గుర్తుచేసింది. ఈ విషయంలో మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవ సరం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఏదేమైనా రఫేల్ వివాదం సాధ్యమైనంత త్వరగా ముగిసి మన రక్షణ దళాలు కోరుకున్న యుద్ధ విమానాలు సకాలంలో వారికి చేరుతాయని ఆశిద్దాం. -
రఫేల్ పత్రాలు చోరీ
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు. ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి. వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది. అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది. ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్ న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు. -
పాత్రికేయ వృత్తిలో శిఖర సమానుడు
జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఒక పవిత్ర కర్తవ్యంగా భావిం చిన అరుదైన పాత్రికేయుల్లో పెండ్యాల వామన్ రావు ఒకరు. వార్తలను నివేదించడంలో సమగ్రత, అంకితభావం, వస్తుగత తత్వం అనేవి కథనాలకు విశ్వసనీయతను తెచ్చిపెడతాయి. జర్నలిజంకి సంబంధించిన ఈ ప్రాథమిక లక్షణాల తోటే ఆయన కేఎమ్ మున్షీ, స్వామి రామానంద తీర్థ, పీవీ నరసింహారావు, పలువురు ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల గౌరవాన్ని, విశ్వాసాన్ని పొందారు. ఇలాంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నెరిపినందువల్లే కావచ్చు.. తన 70 సంవత్సరాల వృత్తి జీవి తంలో కళ్లారా చూసిన చారిత్రక ఘటనలకు ఆయన అత్యంత వస్తుగతమైన, నిజాయితీతో కూడిన చిత్రణను అందిస్తూ వచ్చారు. హైదరాబాద్‌లో పోలీస్ చర్య, నిజాం పతనం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం, రాజ్యాధికార విరామకాలంలో జరిగిన రెండు హింసాత్మక ఆందోళనలు వంటివి ఆయన నివేదించిన కీలక ఘట్టాలు. 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీసు చర్య కాలంలో దక్కన్ చరిత్రలో సంభవించిన ఒక కీలక అధ్యాయం గురించి ప్రస్తుత తరం జర్నలిస్టులకు తెలిసింది చాలా తక్కువ. మేధావులు, రాజకీయ నేతలు ఆ ఘటనను తమ తమ దృక్పథాలకు అనుగుణంగా విమోచన అనీ, స్వాధీనపర్చుకోవడం అనీ, దురాక్రమణ అనీ వ్యాఖ్యానించవచ్చు. కానీ వామనరావు హిందూ పత్రిక కరస్పాండెంట్‌గా ఆ సంక్షుభిత కాలంలో నిష్పాక్షిక కథనాలను సమర్పించారు. పాత్రికేయుల జీవితం కష్టాలతో కూడినది. ప్రభుత్వ లేక నిజాం అనుకూల జర్నలిస్టులు వార్తాపత్రికల్లో లేక ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కనీసపాటి విమర్శను కూడా సహించేవారు కాదు. ఆ రోజుల్లో పత్రికాప్రపంచం గట్టి నిఘాలో ఉండేది. ప్రెస్ కాన్ఫరెన్సుల్లో నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రశ్న సంధించినా, నిజాం విశ్వసనీయ బ్రిగేడ్ నుంచి తీవ్రమైన హెచ్చరికలకు, మందలింపులకు గురికావలసి వచ్చేది. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత గౌరవాన్ని అందుకుంటూ ఉన్న ది హిందూ పత్రికను సైతం ప్రతి రోజూ స్పెషల్ బ్రాంచ్ అధికారులు చదివి, అనుమతించిన తర్వాత మాత్రమే ప్రచురణకు, పంపిణీకి పంపే పరిస్థితి ఉండేదని వామన్‌రావు చెప్పేవారు. తమకు వ్యతిరేకంగా రాస్తున్న జర్నలిస్టులతో ప్రభుత్వం నేరుగా వ్యవహరించేది కాదు. ఆ పనిని పోలీ సులు సంఘవ్యతిరేక శక్తులకు బదలాయించేవారు. తర్వాత వారు అలాంటి జర్నలిస్టులను చితకబాదేవారు. నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా ఉండి గవర్నర్‌గా మారిన మీర్ అక్బర్ ఆలీ, ఆనాడు కైరోలో భారత రాయబారిగా ఉండిన సయ్యద్ హుస్సేన్, సీనియర్ పాత్రికేయులు ఎల్డీ నటరాజన్ వంటివారు వీరి ఆగ్ర హజ్వాలల్ని చవిచూశారు కూడా. బంజారాహిల్స్‌లో ఉన్న ఆయన నివాసం రాక్ హౌస్‌ని నిత్యం సందర్శించే వాడిని. చారిత్రక ఉపాఖ్యానాలను, ఘటనల సారాంశాన్ని వివరించే అగ్రశ్రేణి కథకుడిగా వామన్‌రావు నాకు కనిపించేవారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. తన సైన్యం లొంగుబాటు గురించి హైదరాబాద్‌లోని భారత ఏజెంట్ జనరల్ కేఎమ్ మున్షీతో దక్కన్ రేడియోలో ఉమ్మడి ప్రసారంలో నిజాం ప్రకటించిన ఘట్టాన్ని వివరిస్తూ, నిజాం ఆ సందర్భంలో ఆందోళనా స్వరంతో కేఎంజీ, మున్షీజీ అంటూ తొట్రుపాటు పడటాన్ని కూడా వామన్‌రావు నమోదు చేశారు. కొన్ని సందర్భాల్లో అయితే కేఎమ్ మున్షీ వామన్‌రావును వార్తలు సకాలంలో పంపించడానికి తన కారులో స్వయంగా తీసుకెళ్లేవారు. భోజనానికి ఆహ్వానించేవారు. తన పరిచయస్తుల నుంచి వామన్‌రావు సాధించిన విశ్వాస స్థాయి అలాంటిది. వామన్‌రావుకు హన్మకొండలో పీవీ నరసింహారావు సీనియర్‌గా ఉండేవారని చాలామందికి తెలీదు. బిర్లాల ప్రతినిధిగా వ్యవహరిస్తూ, నౌబత్ పహాడ్‌పై బిర్లా మందిర్ నిర్మాణంలో ఆయన అందించిన తోడ్పాటు కూడా చాలా కొద్దిమందికే తెలుసు. వృత్తి జీవితంలో అనేకమంది జర్నలిస్టులు ఆయన సహాయాన్ని, ఔదార్యాన్ని పొందినవారే. వామన్‌రావు నా స్నేహితుడు, ఫిలాసఫర్, మార్గదర్శకుడు కూడా. ఆయన తోడ్పాటు వల్లే పదవీ విరమణ తర్వాత ఎన్నో రచనలు చేయగలిగాను. ఆయన నా బంధువే కానీ, అంతకంటే మించి మా మధ్య 50 సంవత్సరాలపాటు వృత్తిగత బాంధవ్యం కొనసాగింది. పెద్దాయన కనుమరుగైన తర్వాత కూడా ఆయన బాటలో నేను నడుస్తూనే ఉంటాను. వ్యాసకర్త ది హిందూ మాజీ డిప్యూటీ ఎడిటర్/బ్యూరో చీఫ్, హైదరాబాద్ దాసు కేశవరావు -
137 ఏళ్లలో తొలిసారి...
-
137 ఏళ్లలో తొలిసారి...
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం తొలితరం దిన పత్రిక 'ది హిందు'పై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేసింది. 137 ఏళ్లలో 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేయడం ఇదే తొలిసారి. దీంతో తమిళనాడులో బుధవారం ది హిందు దిన పత్రిక వెలువడలేదు. ప్రింటింగ్ ప్రెస్ కు వర్కర్స్ రాలేకపోవడంతో పత్రికను నిలిపివేసినట్లు పబ్లిషర్ ఎన్ మురళి తెలిపారు. తమ ప్రింటింగ్ ప్రెస్ చెన్నైసిటీకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మరైమలై నగర్లో ఉందని, వర్షాల కారణంగా వర్కర్స్ అక్కడకు ఎవరూ చేరుకునే పరిస్థితి లేదన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చాలా పెద్దది అయినందున తాము నగర శివారులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ది హిందు 1878లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలు యథావిధిగానే ప్రచురితం అయ్యాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. రన్ వే పైకి నీరు చేరటంతో ఎక్కడ విమానాలు అక్కడ నిలిచిపోయాయి. -
అది కొత్త సీసాలో పాత సారా
ఐఆర్ఎస్ 2014 సర్వేపై ఐదు పత్రికల ధ్వజం ఐఆర్ఎస్ - 2013ను 18 పత్రికలు ఖండించాయి ఆ సర్వే పూర్తిగా లోపభూయిష్టం, తప్పుల తడక అందులోని మూడొంతుల సమాచారాన్నే మళ్లీ వాడారు హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా సహా ఐదు పత్రికల ఖండన సాక్షి, హైదరాబాద్: భారతీయ పాఠకుల సంఖ్య సర్వే (ఐఆర్ఎస్) - 2014 పేరుతో ప్రకటించిన సర్వే ఫలితాలు.. కొత్త సీసాలో పాత సారా వంటివేనని ప లు జాతీయ పత్రికలు అభివర్ణించాయి. గతంలో 18 పత్రికలు ఏకగ్రీవంగా ఖండించిన ఐఆర్ఎస్ 2013 తరహాలో ఇది కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించేదేనని.. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా పత్రికలు గురువారం ఒక ప్రకటనలో విమర్శించాయి. ‘‘మూడు వంతులు పాత సారా పోసి.. ఒక వంతు కొత్త సారా పోసి.. దానినే సరికొత్త సారా సీసాగా ఇవ్వజూపటం పారదర్శకత అనిపించుకోదు. ఈ సర్వేలో మూడు వంతులు గతంలో తిరస్కరించిన ఐఆర్ఎస్ 2013 లోనిదే. మిగతా నాలుగో వంతు మాత్రమే కొత్తగా చేపట్టిన శాంపిల్’’ అని తప్పుపట్టాయి. ‘‘విచిత్రమేమిటంటే.. మా ఐదు పత్రికల పాఠకుల సంఖ్య గత ఐఆర్ఎస్ సర్వే కన్నా పెరిగినట్లు.. ఈ పెరుగుదల మా పోటీ పత్రికలకన్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. ఇది మేం గొప్పలు చెప్పుకోవటానికి ఉపకరిస్తుంది. కానీ.. సత్యం, నిష్పక్షపాతం విలువలకు కట్టుబడటం వల్ల మేం అలా చేయదలచుకోలేదు’’ అని స్పష్టంచేశాయి. గతంలో ఐఆర్ఎస్ 2013 తీవ్రమైన దోషంతో నిండివుందని, దిగ్భ్రాంతికరమైన లోపాలున్నాయని, దీనికి హేతుబద్ధత, కనీస పరిజ్ఞానం లేవని.. దేశంలోని 18 అగ్రస్థాయి వార్తాపత్రికల యాజమాన్యాలు ఏకగ్రీవంగా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాయి. ‘‘హిందూ బిజినెస్ లైన్ పత్రికకు.. చెన్నైలో ఉన్న పాఠకుల కన్నా మణిపూర్‌లో మూడు రెట్లు ఉన్నారని; 60 వేలకు పైగా అధీకృత సర్క్యులేషన్ గల నాగ్‌పూర్‌కు చెందిన అగ్రశ్రేణి వార్తాపత్రిక హితవాదకు ఒక్క పాఠకుడు కూడా లేరని; ఢిల్లీలో ఆంగ్ల పాఠకుల సంఖ్య 19.5 శాతం తగ్గిపోయారని చెప్పటం.. ఆ సర్వే ఇచ్చిన షాక్‌లలో కొన్ని. ఇవి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) లెక్కలతో కూడా పూర్తిగా విభేదించాయి’’ అని ఆ సర్వేలోని లోపాలను ప్రస్తావించాయి. ఆ సర్వేలోని మూడు వంతుల సమాచారాన్ని కొత్త సర్వేలో ఉపయోగించటం వల్ల.. అందులోని చాలా పొరపాట్లు కొత్త సర్వేలోనూ పునరావృతమవుతాయనేది విస్పష్టమని పేర్కొన్నాయి. ‘‘పైగా.. ‘తాజా నమూనా’ అని చెప్పుకుంటున్న ఈ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనను 2014 జనవరి - ఫిబ్రవరి నెలల్లో చేపట్టారు. అంటే ఇప్పటికి ఏడాది కాలం దాటిపోయింది. అలాంటపుడు ఈ నివేదికకు ‘ఐఆర్ఎస్ 2014 తొలి త్రైమాసికం’ అని పేరు పెడితే సరిగ్గా ఉండేది. కానీ.. ఇందులో కాలం చెల్లిపోయిన సమాచారం ఉంటే.. ఆ ఏడాది మొత్తానికి సంబంధించిన తాజా సమాచారం అన్నట్లు ఐఆర్ఎస్ - 2014 అని చెప్తున్నారు’’ అని ఆయా పత్రికలు మండిపడ్డాయి. ఎంఆర్‌యూసీ వంటి గౌరవప్రదమైన సంస్థ.. ఇటువంటి పాచిపోయిన సమాచారాన్ని.. అందులో లోపాల గురించి తనకు పూర్తిగా తెలిసి కూడా ఇప్పుడు విడుదల చేయటానికి ఎటువంటి కారణాలేమిటనేది తమకు అవగతం కావట్లేదని విమర్శించా యి. దోషరహితమైన సర్వేను ఐఆర్ఎస్ తీసుకువచ్చేవరకూ.. వారి సర్వేలోని లోపాలను ఎత్తిచూపటాన్ని కొనసాగిస్తామని, వారు చెప్పే సంఖ్యలకు ఎటువంటి విశ్వసనీయతనూ కల్పించబోమని తేల్చిచెప్పాయి. 9.67% పెరిగిన సాక్షి’ పాఠకుల సంఖ్య ఐఆర్ఎస్ - 2014లో తెలుగు వార్తాపత్రికల పాఠకుల సంఖ్యను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా చూపించినప్పటికీ.. ఈ అధ్యయనం కోసం ఏపీలో కొత్తగా ఏ నగరాలనూ, లేదా పట్టణాలనూ ఎంపిక చేయలేదు. ఐఆర్ఎస్ - 2013ను తీవ్రంగా లోపభూయిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఖండించాయి. ఎందుకంటే.. ఒకవైపు రాష్ట్ర విభజన, మరొకవైపు ఎన్నికలతో మీడియా క్రియాశీలంగా ఉండగా.. ప్రధాన వార్తాపత్రికలన్నీ భారీ సంఖ్యలో పాఠకులను కోల్పోయినట్లు చూపటంలో హేతుబద్ధత లేదు. అయితే.. 2013 సర్వేతో పోలిస్తే ఐఆర్ఎస్ 2014లో ‘సాక్షి’ పాఠకుల సంఖ్య 9.67 శాతం పెరగటం విశేషం. 2013లో 33.68 లక్షలుగా ఉన్న పాఠకుల సంఖ్య 2014లో 36.94 లక్షలకు చేరిందని ఈ సర్వే చెప్తోంది. -
హిందూదేశంగా మార్చాలి: భాగవత్
సాగర్: నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించినట్లు హిందూ మతం భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తుందని.. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆదివారం ముగిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగవత్ ప్రసంగిస్తూ.. భారత్ హిందూ దేశంగా మారాలంటూ అందుకు ఠాగూర్ రచించిన ‘స్వదేశీ సమాజ్’ పుస్తకాన్ని ఉటంకించారు. ‘ పుస్తకంలో ఠాగూర్ బ్రిటిష్‌వారిని విమర్శించారు. హిందువులు, ముస్లింలు తమలో తాము కొట్లాడుకోవటం ద్వారా ఒకరినొకరు అంతం చేసుకోబోరని వారు ఉమ్మడిగా ఒక మార్గం కనిపెడతారని ఆ మార్గం హిందూదేశమని చెప్పారు’ అని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, సామరస్యాన్ని హిందుత్వం సమర్థిస్తుందన్నారు. ఒక దేశ ప్రజలు అభద్రతాభావంలో ఉన్నప్పుడు ఆ దేశం భద్రంగా ఉన్నట్లు చెప్పలేమన్నారు. ఎడారి, తక్కువ, జనాభా, విదేశీ దాడులు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. ‘భారత్‌కు 5,000 కిలోమీటర్ల భూమి ఉంది. కోట్లాది మంది జనాభా ఉంది. శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ మనల్ని దాటి ముందుకెళ్లిపోయింది’ అని అన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడిని నిరసించండి: ఏపీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే పిలుపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ది హిందూ’ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ తదితర జర్నలిస్టులపై పెట్టిన కేసులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణించి మీడియా సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) పిలుపునిచ్చాయి. సోమవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ఆధ్వర్యంలో ప్రజాశక్తి ఎడిటర్ తెలకపల్లి రవి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిని ఆసరాగా తీసుకొని పోలీసులు మీడియాపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 10టీవీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పత్రికా స్వేచ్ఛ వచ్చింది తప్ప డీజీపీ దయాదాక్షిణ్యాలతో కాదని ధ్వజమెత్తారు. నగేష్ కుమార్‌ను ఇంటికివెళ్లి మరీ పోలీసులు వేధించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నిస్తున్నానని తననూ అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. టైమ్స్ దినపత్రిక ఎడిటర్ కింగ్ షుక్నాగ్ మాట్లాడుతూ నగేష్‌పై దాడిని చూస్తే పోలీస్ రాజ్యం నడుస్తున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బోఫోర్స్, జయలలిత వ్యవహారాల్లో సుదీర్ఘ పోరాటం చేసిన హిందూ పత్రిక విలేకరిపై పోలీసులు పిచ్చి కేసులు పెట్టి పరువు తక్కువ పనిచేశారని విమర్శించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత సీఎం మూడుసార్లు మాత్రమే ప్రజాజీవితంలో కనిపించారన్నారు. పోలీసుల తీరు రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించాలని, పాత్రికేయ ప్రపంచం ముక్త కంఠంతో ఖండి ంచాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు రాజేంద్ర, గంగాధర్ (సాక్షి), నరసింహారెడ్డి (ఈనాడు), ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బసవపున్నయ్య, జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య, అమరయ్య, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఆనందం, నర్సింగ్‌రావు పాల్గొన్నారు. ‘ఆప్నా’ ఖండన: ‘ది హిందూ’ జర్నలిస్టు నగేష్‌కుమార్‌పై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ (ఆప్నా) ఒక ప్రకటనలో ఖండించింది. ఈ ఘటన రాష్ట్రంలో మీడియా కార్యకలాపాల్లో పోలీసులు చేయి పెట్టడమేనని, ఇది అనవసర జోక్యమని సంఘ కార్యదర్శి ఐ.వెంకట్ పేర్కొన్నారు. -
ది హిందూ 'నగేష్' అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు!
పాతబస్తీలో మతగురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్ రెడ్డి కలసిన అంశంపై కథానాన్ని ప్రచురించిన కేసులో ది హిందు రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శనివారం రంగం సిద్ధం చేశారు. అందులోభాగంఆ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నగేష్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. అదికాక నగేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పత్రాలు ఏవి తమకు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా హిందూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌కు హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని నగేష్‌ను ఆదేశించింది. అంతేకాక నాలుగు వారాల పాటు ప్రతి శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారుల ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అలాగే పోలీసు దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో మత గురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన కలిసిన అంశాన్ని ప్రచురించినందుకు నమోదు చేసిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేయాలంటూ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ చంద్రకుమార్ విచారించారు. పోలీసుల చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పోలీసుల చర్య ఏకపక్షంగా ఉందని ఆయన తెలిపారు. విధుల్లో భాగంగానే డీజీపీ వార్తను ప్రచురించామని, మరుసటి రోజు డీజీపీ పంపిన వివరణను సైతం ప్రముఖంగా ప్రచురించడం జరిగిందని, ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నగేష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.