ఎన్ రామ్‌కు షూ వేసుకోవడానికి సహకరిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పెద్దల పట్ల తనకున్న గౌరవభావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు. హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ షూ వేసుకునే సమయంలో ఇబ్బంది పడుతుండగా సీఎం జగన్ తన హోదాను పక్కనపెట్టి.. ఆయన చేయి పట్టుకుని తోడ్పాటు అందించారు. బుధవారం విజయవాడలోని గేట్ వే హోటల్‌లో జరిగిన ‘హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్‌తో కలిసి ఎన్.రామ్ వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ఎన్.రామ్ తమ తమ బూట్లను పక్కనే విడిచి జ్యోతి ప్రజ్వలనం చేశారు.
అనంతరం ఎన్.రామ్ నిలబడి షూ వేసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా పక్కనే ఉన్న సీఎం జగన్ ఆయన చేయి పట్టుకుని సహకారం అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే.. గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ మెడల్స్ బహూకరణ సమయంలో ఓ పోలీసు అందుకున్న మెడల్ కింద పడిపోగా.. సీఎం వైఎస్ జగన్ కిందకు వంగి దానిని తీసి అందించిన విషయం విదితమే. (చదవండి: సీఎం జగన్‌ను అభినందించిన ఎన్ రామ్)
Comments
Please login to add a commentAdd a comment