రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్‌ | Seema Haider Sings Ram Bhajan, Hanuman Chalisa In Greater Noida | Sakshi
Sakshi News home page

Video: ‘రామ్‌ ఆయేంగే’ పాటను అద్భుతంగా ఆలపించిన సీమా హైదర్‌

Published Sat, Jan 20 2024 5:47 PM | Last Updated on Sat, Jan 20 2024 6:23 PM

Seema Haider Singh Ram Bhajan Hanuman Chalisa In Greater noida - Sakshi

ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్‌ మీనాతో కలిసి ‍గ్రేటర్‌ నోయిడాలోని రఘుపూర్‌లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సచిన్‌-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్‌ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్‌ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్‌ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్‌ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు.  ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు.

కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. న్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement