అమ్మాయి అని కూడా చూడకుండా పోకిరీల బరితెగింపు | unidentified youth attack on youth and girl in noida | Sakshi
Sakshi News home page

అమ్మాయి అని కూడా చూడకుండా పోకిరీల బరితెగింపు

Published Wed, Jan 31 2018 12:26 PM | Last Updated on Wed, Jan 31 2018 3:55 PM

unidentified youth attack on youth and girl in noida - Sakshi

సాక్షి, నోయిడా : గ్రేటర్‌ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. కొందరు యువకులు ఇద్దరు యువకులతోపాటు ఓ యువతిపై కూడా దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా వారిని బెదిరిస్తూ చావు దెబ్బలు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో వివాదాస్పద వైరల్‌ వీడియోగా మారింది. వివరాల్లోకి వెళితే గౌతమ్‌బుద్ధనగర్‌లో ఇద్దరు యువకులు, బ్యాగ్‌తో ఉన్న ఓ యువతి రోడ్డుపక్కన వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని సమీపించారు. వచ్చి రాగానే వారిపై కర్రలు, చెరుకు గడెలతో చావబాదారు.

గౌతమ్‌బుద్ధనగర్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఫాంహౌస్‌ వద్ద దాడికి సంబంధించిన వీడియోను షూట్‌చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. జనవరి 1న ఈ ఘటన చోటుచేసుకోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తాము ఫాంహౌస్‌కు వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న ఇద్దరు దుండగులు తమ దగ్గరకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టారని, కొట్టారని పోలీసులకు వివరించారు. తమతో ఉన్న అమ్మాయిని కూడా వేధించి ఆమెను కూడా చావు దెబ్బలు కొట్టారని వాపోయారు. కాగా, పుటేజిలోని దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement