లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలక్సీ ప్లాజా షాపింగ్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పలువురు భవనంపై నుంచి అమాంతం కిందకు దూకేశారు. సమాచారం అందుకన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు, ఎలాంటి ప్రాణనష్టం జరిగిందనే విషయం తెలియరాలేదు. అయితే కాంప్లెక్స్‌లో ఎలక్ట్రీకల్ షార్ట్ సర్కిట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. షాపింగ్ కంప్లెక్స్‌లో నుంచి పొగ వెలువడటం, మూడో అంతస్తు కటికీ వద్ద ఇద్దరు వ్యక్తులు వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాసేపటికి మంటలు, పొగలు పెరగడంతో అక్కడి నుంచి కిందకు దూకేయడం వీడియోలో కనిపిస్తుంది.
చదవండి: Patna: లాఠీ ప్రయోగం.. బీజేపీ ఆందోళన ఉద్రిక్తం
#GreaterNoida : ग्रेटर नोएडा वेस्ट के गैलेक्सी प्लाजा में लगी आग, लोग शीशा तोड़ कूदकर जान बचाते नज़र आए, सूचना मिलते ही फायर बिग्रेड मोके पर पहुँची।@noidapolice pic.twitter.com/wWxHqd4xpQ
— YAGYESH KUMAR JOURNALIST (@Bunty_0143) July 13, 2023
Comments
Please login to add a commentAdd a comment