Initiations
-
ఆడబిడ్డల గోడు పట్టదా?
హుస్నాబాద్: ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలంటూ సుమారు 100 మంది వివాహితలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు ని ర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్ఛినప్పుడు తమకు పెళ్లిళ్లు కాలేదని, ఇప్పుడు తమకు పెళ్లి అయ్యిందనే కారణంతో అనర్హుల్ని చేయడం స మంజసం కాదంటూ వారు వాపోతున్నారు. ప్రభు త్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.6 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించినప్పుడు.. దీనివల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని పల్లె, గిరిజన తండాల వారికి ఇతరత్రా హామీలతో పాటు కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వివాహంకాని యువతులు ఉంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6 లక్షలనగదు పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్ఛింది. ఈ మేరకు 2010 నుంచి 2015 వరకు కటాఫ్‌గా తీసుకుని 141 మంది అర్హుల్ని గుర్తించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి వీరికి ఇచ్ఛిన హామీ మేర కు నగదు, ఇల్లు ఇచ్చేస్తే ఎలాంటి వివాదం త లెత్తేది కాదు. కానీ ప్రాజెక్టును ఆలస్యంగా ప్రారంభించడం, పనులు కొనసాగుతుండటం, హామీ అమలు చేయకపోవడంతో కటాఫ్ పెంచుతూ పోయారు. ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు మరో 338 మందిని, 2022 డిసెంబర్ వరకు మరో 60 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతుల పెళ్లికావడం, వీరికి ప్యాకేజీ వర్తించదని అధికారులు చెప్పడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జాబితా నుంచి తొలగింపు మధ్యలో రెండేళ్లు ప్రాజెక్టు నిలిచిపోగా, గతేడాది డిసెంబర్ 9న మళ్లీ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమయ్యాక యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 539 మంది అర్హుల్లో 2015 నుంచి 2022 మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో సుమారు వంద మంది మహిళల పేర్లను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితా నుంచి అధికారులు తొలగించారు. దీంతో వారు లబోదిబోమన్నారు. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరును నిరసిస్తూ డిసెంబర్ 14 నుంచి అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. సుమారు 70 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల వారు హుస్నాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న హుస్నాబాద్ పర్యటనకు వచ్ఛిన మంత్రి హరీశ్‌రావుకు మొర పెట్టుకుందామని ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు పట్టణ పొలిమేరలకు తరిమేశారు. దీనిపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లకుండా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదేం న్యాయం? మా త్యాగానికి ఎంత ఇచ్ఛిన తక్కువే. పెళ్లి కాని యువతులకు ప్యాకేజీ ఇస్తామంటూ మమ్మల్ని గుర్తించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మాకు పెళ్లి కాలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి అయిందనే సాకుతో ప్యాకేజీ వర్తించదని అనడం ఏం న్యాయం? – చుంచు రాణి, నిర్వాసితురాలు వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా? గౌరవెల్లి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేస్తే ఈ సమ స్య ఉండేది కాదు. వయస్సు పెరుగుతుందే కానీ తగ్గుతుందా? ప్రభుత్వం తప్పు చేసి మాకు అన్యాయం చేస్తే ఎలా? మా బాధలను కనీసం మంత్రికి కూడా చెప్పుకోనివ్వరా? ప్యాకేజీ ఇస్తే మాదారి మేము వెతుక్కుంటాం. – భూక్య శిరీష, నిర్వాసితురాలు -
‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’
సాక్షి, గుంటూరు: బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న వికేంద్రీకరణ దీక్షలు 75వరోజుకు చేరుకున్నాయి. మూడు ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా మందడంలో దీక్షలు నిర్వహిస్తున్నారు. శాసన రాజధాని అమరావతిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన 52వేలకు పైగా ఇళ్ల స్థలాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షకు దళిత, బీసీ, ప్రజా, మహిళా సంఘాల సంఘీభావం ప్రకటించారు. (చదవండి: దళిత దళారులతో చంద్రబాబు బేరాలు) ఒక్క సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే అమరావతి జేఏసీ ఏర్పడిందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరూ లేరని బహుజన పరిరక్షణ సమితి నేతలు ధ్వజమెత్తారు. తమ సవాల్‌కు అమరావతి జేఏసీ స్పందించలేదని పేర్కొన్నారు. ఈనెల 17న ర్యాలీగా ఉద్దండరాయునిపాలెం వెళ్తామని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటామని బహుజన పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, ఇంగ్లీష్ మీడియం,పేదలకు ఇళ్లస్థలాలు కోసం దీక్ష చేస్తుంటే టీడీపీ నేతలు తమను రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అంటున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు (చదవండి: ఆ జీవో మీదే బాబూ) -
వికేంద్రీకరణకే మద్దతు..
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణను కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ రాజధాని మందడంలో చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలకు బీసీ ఐక్యవేదిక, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, నేషన్ దళిత సంఘం, మాదిగ ఐక్య వేదికలు మద్దతు తెలిపాయి. వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీసంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు అనేక కుట్రలు చేస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. మూడు రాజధానులకే తమ మద్దతంటూ అమరావతిలో దళిత, బీసీ, మహిళా, ప్రజా సంఘాల నేతలు గళమెత్తున్నారు. (వికేంద్రీకరణతోనే ప్రగతి) -
సమస్యలు పరిష్కరించకుండా దీక్షలెందుకు?
పాలకొండ ఎమ్మెలే కళావతి పాలకొండ: ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించకుండా నవనిర్మాణ దీక్షలు చేపట్టడం ఎందుకని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రశ్నించారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడితప్పిందన్నారు. ప్రభుత్వ పథకాలలో కోత, అవినీతి పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. అర్హులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. పోగరహిత సమాజం పేరుతో కేంద్రప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తుంటే స్థానిక నాయకులు మాత్రం వారి అనుచరులకే అందిస్తున్నారని ఆరోపించారు. పింఛన్లు అందక వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన ఉండటం లేదని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకూ విత్తనాలు, సాగునీరు అందించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇప్పడు కావాల్సిం ది నవనిర్మాణ దీక్షలు కాదని నవనిర్మాణ పాలన అని స్పష్టం చేశారు. -
పన్నీర్ దీక్ష
► కుట్రపూరిత కుటుంబం నుంచి రక్షిద్దాం ► మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రతిజ్ఞ ► జయ మరణంపై న్యాయ విచారణ కోరుతూ రాష్ట్రవ్యాప్త దీక్షలు అమ్మకు ద్రోహం చేసి, బహిష్కరణకు గురైన వారి చేతిలో నేడు అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం చిక్కుకున్నాయని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఆశయాలకు విరుద్ధమైన వ్యక్తుల నుంచి అన్నాడీఎంకేను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పన్నీర్‌సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. పన్నీర్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి పన్నీర్ ప్రసంగిస్తూ ఎంజీఆర్ అన్నాడీఎంకేను ఒక మక్కల్ ఇయక్కం(ప్రజల సంస్థ)గా స్థాపించారన్నారు. ఆయన బాటలో జయలలిత సైతం ‘ప్రజల కోసం నేను... ప్రజల వల్ల నేను’ అనే నినాదంతో పాలన అందించారని తెలిపారు. జయ స్థానంలో సీఎంగా తాను సైతం అలాంటి పాలనకే పాటుపడ్డానని చెప్పారు. అయితే రాష్ట్రంలో నేడు అలాంటి పరిస్థితులు లేవని, అమ్మ ఆశయాలు తల్లకిందులయ్యాయని అన్నారు. అమ్మ చేతిలో బహిష్కరణకు గురైన వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలుగా మారిపోయారని చెప్పారు. ‘అక్కా... నీకు ద్రోహం చేసినవారితో ఇక నా సంబంధాలు తెంచుకుంటాను, రాజకీయాలు, పార్టీ, పదవులకు దూరంగా ఉంటాను’ అని లిఖిత పూర్వకంగా జయ వద్ద క్షమాపణలు కోరిన శశికళ వ్యవహారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమ్మ బహిష్కరించిన వారి చేతిలో నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని పన్నీర్ సెల్వం వివరించారు. అమ్మను చూసేందుకు అడ్డుకున్నారు అపోలో ఆసుపత్రిలో జయకు 74 రోజుల పాటూ చికిత్స అందిస్తే ఒక్కరోజు కూడా తాను చూసేందుకు అవకాశం కలగలేదని, ఎన్నోసార్లు ప్రయత్నించినా శశికళ, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ మనుషులు అడ్డుకున్నారని తెలిపారు. అపోలోకు వచ్చేపోయే వారి జాబితాను సిద్ధం చేసేందుకే ఆరుగురిని నియమించారని చెప్పారు. చిన్నపాటి వ్యాధులతో అడ్మిటైన అమ్మకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏమిటి, సంక్లిష్టమైన వ్యాధులపై చికిత్సకు విదేశాలకు తరలించాలని తాను సూచించినా శశికళ పట్టించుకోలేదని చెప్పారు. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చానని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ చేసిన ప్రకటన సత్యదూరమని పన్నీర్‌సెల్వం అన్నారు. ఆయన ఆ ప్రకటనను ఉపసంహరించుకోకుంటే కోర్టులో కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. జయ మరణంలోని మర్మంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. దీక్షలకు భారీ స్పందన సీఎంగా రాజీనామా చేసిన నాటి నుంచి అమ్మ మరణం అనుమానాస్పదమేనని చెబుతూ వస్తున్న పన్నీర్‌సెల్వం ఏకంగా నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకోవడం అధికార అన్నాడీఎంకే వర్గాన్ని కలవరపెట్టింది. గత నెల 27వ తేదీనే దీక్షకు దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల క్రితం మరోసారి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. చెన్నై చేపాక్ స్టేడియం వద్ద తలపెట్టిన దీక్షను ఎగ్మూరులోని రాజారత్తినం స్టేడియంకు మార్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు దీక్షలు ప్రారంభించాల్సి ఉండగా 9 గంటలకే పన్నీర్‌సెల్వం ఆయన మద్దతుదారులతో కలసి చేరుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో జనసందోహం ఏర్పడింది. సరిగ్గా 10 గంటలకు పన్నీర్‌సెల్వం దీక్షలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షా శిబిరం నుంచి చేసిన ప్రసంగాల్లో అమ్మ పాలనను వివరిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టారు. పన్నీర్‌సెల్వం వైపు ధర్మం ఉందని నటుడు మనోబాల తనను కలిసిన మీడియా వారితో అన్నారు. చెన్నై శివార్లు ఆవడి, సేలం, నామక్కల్, కోయంబత్తూరు, నాగర్‌కోవిల్, తిరుచ్చిరాపల్లి, అరియలూరు తిరునెల్వేలి, తూత్తుకూడి, తంజావూరు, తిరువారూరు, ఈరోడ్, మధురై, వేలూరు, కడలూరు, విళుపురం తదితర మొత్తం 32 జిల్లాల్లో సైతం పన్నీర్‌సెల్వం అనుచరులు నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రతిచోట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు పెట్టారు. చికిత్స పత్రాలను వెల్లడించాలి: దీప జయకు అపోలో ఆసుపత్రిలో అందించిన పలురకాల చికిత్సలకు ముందు అనుమతి పత్రాలపై సంతకాలు పెట్టినవారి పేర్లు బయటపెట్టాలని ఆమె మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధినేత్రి దీప బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే జయ మరణ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేందుకు సంతకం చేసిన కుటుంబ సభ్యులెవరో తేలాల్సి ఉందని ఆమె అన్నారు. ఆసుపత్రిలో రోగికి చికిత్స ప్రారంభించే ముందు బంధువులతో సంతకం తీసుకోవడం ఆనవాయితీ, దీని ప్రకారం వీటన్నింటిపై సంతకం చేసిన వారు ఎవరో తేలేందుకు, మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ విచారణ అవసరమని ఆమె అన్నారు. -
గోమాత మాల దీక్ష స్వీకరణ
కర్నూలు (న్యూసిటీ): జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణ శాల)లో శుక్రవారం తొలిసారిగా 30 మంది గోమాత మాల దీక్షలు స్వీకరించారు. శ్రీకృష్ణ భగవానునికి, గోమాతలకు పూజలు చేసి, గోవుకు పచ్చిగడ్డితో తులాభారం నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వణాధికారి కె.కమలాకర్ మాట్లాడుతూ.. గోమాత మాల దీక్షలు స్వీకరిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందన్నారు. మిడ్తూరు గ్రూపు దేవాలయాల కార్య నిర్వహణాధికారి టి.హనుమంతరావు, మాజీ పాలక మండలి సభ్యులు శ్రీకాంత్ నాయుడు, ఎస్.సదానందం పాల్గొన్నారు. -
‘మల్లన్నసాగర్’ సామర్థ్యం తగ్గించాలి
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి 66వ రోజుకు చేరాయి. దీక్షల్లో చాముండేశ్వరీ మహిళా సంఘం సభ్యులు నాయిని కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, బాలలక్ష్మి, ప్రమీల, దుబ్బాక భాగ్యమ్మ, శేరుపల్లి లక్ష్మి, గిర్మాజి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని తగ్గించి ముంపు నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. -
దీక్షలను విజయవంతం చేయాలి
సూర్యాపేటమున్సిపాలిటీ : ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఆగస్టు 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే ఉపవాస దీక్షలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేజే ఉదయ్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. బిల్లు ప్రవేశపెట్టి దళితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రసాద్, ఎస్.వెంకటేశ్, నియోజకవర్గ ఇన్చార్జి కొత్తపల్లి ప్రశాంత్, గంట జీవన్‌కుమార్, కీసర అరవింద్‌రెడ్డి, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. -
పాడేరులో నాలుగో రోజుకు చేరిన దీక్షలు
విశాఖపట్టణం: బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వటాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరంలో గిరిజన సంఘాలు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలి
భువనగిరి :తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ భువనగిరి కోర్టులో న్యాయవాదులు గురువారం నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు ఆవరణలో టెంట్ వేసి ముగ్గురు న్యాయవాదులు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా న్యాయవా దుల జేఏసీ చైర్మన్ నాగారం అంజయ్య, సీనియర్ న్యాయవాది పులిమామిడి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్యయంపాలన, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుక్ను తెలంగాణలో ఇంకా సీమాంధ్రుల పెత్తనాలు సాగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు కేసులలో సీమాంధ్ర న్యాయమూర్తులు పక్షపాతం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నెల 31 వరకు తెలంగాణ హైకోర్టును ఏర్పాటు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టుల్లో విధులు బహిష్కరిస్తారని హెచ్చరించారు. దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయికం రమేష్, దేవరాజు శ్రీనివాసరాజు, బొబ్బల కేశవరెడ్డి దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వంగేటి విజయ భాస్కర్‌రెడ్డి, పడాల శ్రీనివాస్పటేల్, గజ్జెల రవీందర్ రెడ్డి, వంచ దామోదర్‌రెడ్డి, బొమ్మ వెంకటేష్, విద్యాసాగర్, దేవరకొండ జనార్దన్, నక్కల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యం కేసులో దోషులను శిక్షించాలి
వెంకటాపురం, న్యూస్‌లైన్: మండలంలోని వీఆర్కేపురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం వెంకటాపురంలో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీసులు ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో వీఆర్కేపురం, చొక్కాల, ఇప్పలగూడెం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ నిరసన దీక్షలు ప్రారంభం రాధ, పోతురాజుల అదృశ్యానికి కారణమైన వారికి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రాధ, పోతురాజుల తల్లిదండ్రులు మల్లయ్య, గంగ, లక్ష్మయ్య, నాగమ్మలు వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ళో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వెంకటాపురం సర్పంచ్ బెజ్జరి నారాయణమ్మ ప్రారంభించి మాట్లాడారు. బాధితులకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. ఈ నిరసన దీక్షలకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిడెం శివ, సయ్యద్‌హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు మంగాయమ్మ, సీతాదేవి, సీపీఐ నాయకులు తోట మల్లిఖార్జునరావు, సీపీఎం నాయకులు గ్యానం సారయ్య, ఏసురత్నం పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ 72 గంటల బంద్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: తెలంగా ణా రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుధవారం ప్రారంభించిన నిరవధిక దీక్షలను గురువారం రాత్రి అర్థంత రంగా విరమించారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం నుంచి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ విజ యవంతానికి పార్టీ శ్రేణులను సమన్వయపరి చేందుకు సమన్వయకర్తలు దీక్షలు విరమించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జిల్లాలోని సమన్వయకర్తలంతా దీక్షలు విరమించారు. -
నేడు మున్సిపల్ ఇంజనీర్ల దీక్షలు
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఇంజనీర్లు గురువారం నుంచి మూడు రోజుల పాటు సామూహిక సెలవులు పెడుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు గురువారం రాజమండ్రిలోని మున్సిపల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ఉభయ గోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీ లకుచెందిన ఇంజనీర్లు ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ర్యాలీ కూడా చేపడతారు. మూడు రోజులు విధులకు హాజరుకాకుండా నిరసన తెలుపుతారు. ఈ నెల 28న జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో విద్యుద్దీపాలు వెలిగించకుండా నిరసన వ్యక్తం చేయనున్నారు. దాదాపు 90 మంది మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొననున్నారు.