
సాక్షి, గుంటూరు: బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న వికేంద్రీకరణ దీక్షలు 75వరోజుకు చేరుకున్నాయి. మూడు ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా మందడంలో దీక్షలు నిర్వహిస్తున్నారు. శాసన రాజధాని అమరావతిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన 52వేలకు పైగా ఇళ్ల స్థలాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షకు దళిత, బీసీ, ప్రజా, మహిళా సంఘాల సంఘీభావం ప్రకటించారు. (చదవండి: దళిత దళారులతో చంద్రబాబు బేరాలు)
ఒక్క సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే అమరావతి జేఏసీ ఏర్పడిందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరూ లేరని బహుజన పరిరక్షణ సమితి నేతలు ధ్వజమెత్తారు. తమ సవాల్‌కు అమరావతి జేఏసీ స్పందించలేదని పేర్కొన్నారు. ఈనెల 17న ర్యాలీగా ఉద్దండరాయునిపాలెం వెళ్తామని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటామని బహుజన పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, ఇంగ్లీష్ మీడియం,పేదలకు ఇళ్లస్థలాలు కోసం దీక్ష చేస్తుంటే టీడీపీ నేతలు తమను రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అంటున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు (చదవండి: ఆ జీవో మీదే బాబూ)
Comments
Please login to add a commentAdd a comment