సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు బహుజన పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది. ఈమేరకు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత, మహిళా, ప్రజాసంఘాలు రాజధాని ప్రాంతం మందడంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ యత్నిస్తున్నారని తెలిపారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ నందిగం సురేష్‌కు టీడీపీ నేతల నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో చంద్రబాబుకు వచ్చిన ముప్పేంటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చి వేషాలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పేదలపై చంద్రబాబుకు ప్రేమ లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment