mandadam
-
సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు అండగా నిలబడ్డారు: పేదలు
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఆదినారాయణపై కేసు నమోదు చేస్తాం: ఏఎస్పీ
సాక్షి, గుంటూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని ఏఎస్పీ అనిల్‌కుమార్ అన్నారు. ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. ‘‘బహుజన పరిరక్షణ కమిటీ సభ్యులు, సత్యకుమార్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు ఉండబట్టే సమస్య వెంటనే సద్దుమణిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించాం. సత్యకుమార్‌పై ఎలాంటి దాడి జరగలేదు’’ అని ఏఎస్పీ స్పష్టం చేశారు. కాగా, మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
ఇళ్ల నిర్మాణాలు అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర
సాక్షి, గుంటూరు : మందడంలో అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష 256వ రోజుకు చేరుకుంది. శుక్రవారం బహుజన పరిరక్షణ సమితి మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారం చంద్రబాబు బ్యాచ్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించింది. మొన్నటి వరకు ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తుంటే అడ్డుకున్నారు.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అడ్డుకుంటున్నారని మండిపడింది. ఇళ్ల నిర్మాణాలు అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించింది. -
250వ రోజుకు బహుజన పరిరక్షణ సమితి దీక్ష
సాక్షి, గుంటూరు: మందడంలో బహుజన పరిరక్షణ సమితి దీక్ష 250వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను టీడీపీ అడ్డుకోవడం నిరసిస్తూ దీక్ష కొనసాగుతోంది. దీక్షకు 643 ప్రజా, మహిళ, ఓసీ, బీసీ, మైనార్టీ, దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. 250వ రోజు కొనసాగుతున్న దీక్షలో పలువురు పాల్గొని ప్రసంగించారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రకటించడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. చదవండి: విషాదం: నాన్నా... ఇది తగునా !.. దారుణం: భార్య చేతిలో భర్త హతం -
మూడు రాజధానులు పెట్టి తీరుతాం: కొడాలి నాని
సాక్షి, గుంటూరు: పేదలకి ఇళ్లస్ధలాలు ఇవ్వకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలోంచి అమరావతి రైతులు బయటకి రావాలని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 70 రోజులకి పైగా ఇళ్ల స్ధలాల కోసం దళితులు దీక్షలు చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మందడం దీక్ష శిబిరంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..'మీరు అమరావతి ఉద్యమం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చినట్లు ఇక్కడెవరూ పెయిడ్ ఆర్టిస్ట్‌లు లేరు. మీరు...మీ తోకపార్టీలు పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారు' అని దుయ్యబట్టారు. అమరావతి కుంభకోణంపై సీఐడీ విచారణ జరిగితే చంద్రబాబు అక్రమాలు బయటపడతాయని, అందుకే ఆయన అమరావతి రైతులని మభ్యపెట్టి ఉద్యమాల పేరుతో హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి మేనేజ్ చేయడం పుట్టుకతో వచ్చిన విద్య అని పేర్కొన్న మంత్రి..చంద్రబాబు బినామీలు, బినామీ ఆస్తులు అమరావతిలోనే ఉన్నాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో 9 రాజధానులు కట్టడానికి గతంలో చంద్రబాబు ప్లాన్ చేసి..ఇక్కడ పేదలు నివాసం ఉండకూడదని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతంలో లేని ఇబ్బందులు ఈ అమరావతిలోనే ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. (మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్ ) 'అమరావతిలో రాజధాని తీసేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా చెప్పలేదు. ఈ ప్రాంతంలో సెక్రటేరియట్...హైకోర్టు మాత్రమే ఉండవు. మిగిలిన అన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు యధావిధిగా ఉంటాయి. కార్యనిర్వహక రాజధాని ఉత్తరాంధ్రలో ఉంటే తప్పేంటి? సిట్ అమరావతి కుంభకోణంపై కేసు నమోదు చేస్తే రాత్రికి రాత్రి చంద్రబాబు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇలాంటి ఆర్డర్ చంద్రబాబు తప్పితే ప్రధాని కూడా తీసుకురాలేరు. 2 వేల కోట్లతో ఈ ప్రాంతంలో జాతీయ రహదారులని అభివృద్ది చేయనున్నారు. మూడు రాజధానులు పెట్టి తీరతాం...విశాఖలో కార్యనిర్వాక రాజధాని...అమరావతిలో శాసన సభ...కర్నూలులో హైకోర్టు పెట్టి తీరతాం. సిఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వబోతున్నారు' అని కొడాలి నాని తెలిపారు. (హెరిటేజ్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?) -
‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’
సాక్షి, గుంటూరు: బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న వికేంద్రీకరణ దీక్షలు 75వరోజుకు చేరుకున్నాయి. మూడు ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా మందడంలో దీక్షలు నిర్వహిస్తున్నారు. శాసన రాజధాని అమరావతిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన 52వేలకు పైగా ఇళ్ల స్థలాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షకు దళిత, బీసీ, ప్రజా, మహిళా సంఘాల సంఘీభావం ప్రకటించారు. (చదవండి: దళిత దళారులతో చంద్రబాబు బేరాలు) ఒక్క సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే అమరావతి జేఏసీ ఏర్పడిందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరూ లేరని బహుజన పరిరక్షణ సమితి నేతలు ధ్వజమెత్తారు. తమ సవాల్‌కు అమరావతి జేఏసీ స్పందించలేదని పేర్కొన్నారు. ఈనెల 17న ర్యాలీగా ఉద్దండరాయునిపాలెం వెళ్తామని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటామని బహుజన పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, ఇంగ్లీష్ మీడియం,పేదలకు ఇళ్లస్థలాలు కోసం దీక్ష చేస్తుంటే టీడీపీ నేతలు తమను రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అంటున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు (చదవండి: ఆ జీవో మీదే బాబూ) -
చంద్రబాబు, లోకేశ్‌కు చేదు అనుభవం
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అమరావతిలో చేదు అనుభవం ఎదురైంది. మందడంలో జరుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే నిరసన సెగ తగిలింది. పెద్ద ఎత్తున మహిళలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబు దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక రాజధాని వద్దు- మూడు రాజధానులు కావాలి’’ అంటూ ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. అదే విధంగా అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు.(చదవండి: ఏపీ అసెంబ్లీ 5వ రోజు: లైవ్ అప్డేట్స్) కాగా అభివృద్ధి వికేంద్రీకరణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో దీక్షాశిబిరం ఏర్పాటు చేసిన స్థానికులు.. టీడీపీ కుట్రలను ఎండగడుతున్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షం అడ్డుపడుతున్న తీరుపై భగ్గుమంటున్నారు. -
చంద్రబాబుకు చేదు అనుభవం
సాక్షి, గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతి సమీపంలోని మందడంలో నిరసన సెగ ఎదురైంది. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే స్థానికులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలు చూపుతూ మహిళలు నిరసన తెలిపారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ప్లకార్డులు చూపించారు. ఇళ్లస్థలాలపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. (రావి చెట్టుకు ‘చంద్ర’ గ్రహణం) ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానులను చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ తీరుకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో స్థానికులు దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. టీడీపీ నేతలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. (తమాషాలు చేస్తారా?) -
మద్దతిస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తాం
కృష్ణాయపాలెం(మంగళగిరి)/మంగళగిరి: మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో దీక్షకు వెళ్తున్నవారిపై అమరావతి మద్దతుదారులు దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. మందడంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంగళగిరి మండలంలోని పలు గ్రామాల నుంచి పేదలు, దళితులు ఆటోల్లో మందడం వెళ్తుండగా కృష్ణాయపాలెంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆటోలను అడ్డుకుని మహిళలను రాయలేని భాషలో దుర్భాషలాడారు. అమరావతిలో తమకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే మీకొచ్చిన నష్టమేమిటంటూ మహిళలు వారిని నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుతూ కర్రలతో దాడికి యత్నించారు. ఇంతలో మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారు అక్కడకు చేరుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు మహిళలను ట్రాక్టర్‌తో తొక్కించబోయారని, ఇది టీడీపీ అహంకారానికి నిదర్శనమని దళిత బహుజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా దళితులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఎస్పీ ఈశ్వరరావు, నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. టీడీపీ నేతలపై కేసు కృష్ణాయపాలెంలో దాడికి పాల్పడిన 11 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై మంగళగిరి రూరల్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి రవిబాబు తన మీద దాడికి ప్రయత్నించిన 11 మందిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుక్కమళ్ల అరుణ్‌బాబు, నంబూరి రామారావు, ఈపూరి జయకృష్ణ, ఈపూరి రవికాంత్, ఈపూరి చిన్న ఇమ్మానుయేలు, ఈపూరి మరియదాసు, చిలువూరి రాహుల్, పొంటి నరేశ్, దానబోయిన బాజి, ఈపూరి కిషోర్, కుక్కమళ్ల విజయకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని భయపెట్టారు కృష్ణాయపాలెం వద్ద టీడీపీ నేతలు, వారి అనుచరులు.. మహిళలమని కూడా చూడకుండా దుర్భాషలాడారు. ‘ఇటు వస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం’ అంటూ భయపెట్టారు. – మేరీ, మంగళగిరి ఆటోల్లో నుంచి బలవంతంగా లాగారు మంగళగిరి నుంచి ఆటోల్లో వస్తున్న మమ్మల్ని ఆపి బలవంతంగా బయటకు లాగారు. అంతేకాకుండా దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో దళితులపై జులుం ప్రదర్శించడం పరిపాటిగా మారింది. – ఉష, మంగళగిరి దుర్భాషలాడారు ఆటోను ఆపి ఎక్కడికెళుతున్నారే.. మా భూముల్లో మీకు ఇళ్లెలా ఇస్తాడు జగన్’ అని టీడీపీ నేతలు నానా దుర్భాషలాడారు. కర్రలతో దాడి చేస్తామని, ట్రాక్టర్లతో తొక్కిస్తామని బెదిరించారు. – సుబ్బులు, మంగళగిరి కులం పేరుతో దూషించారు దళితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని టీడీపీ నేతలు దాడికి యత్నించారు. కులం పేరుతో దూషించారు. మాపై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. – కట్టెపోగు ఉదయభాస్కర్, మంగళగిరి -
మందడంలో 6వ రోజు కొనసాగుతున్న దీక్షలు
-
౩వ రోజుకు చేరుకున్న వికేంద్రీకరణ మద్దతు దీక్షలు
-
‘ఆయనకు వచ్చిన ముప్పేంటట’
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు బహుజన పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది. ఈమేరకు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత, మహిళా, ప్రజాసంఘాలు రాజధాని ప్రాంతం మందడంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ యత్నిస్తున్నారని తెలిపారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ నందిగం సురేష్‌కు టీడీపీ నేతల నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో చంద్రబాబుకు వచ్చిన ముప్పేంటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చి వేషాలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పేదలపై చంద్రబాబుకు ప్రేమ లేదని అన్నారు. -
బరితెగించిన పచ్చమీడియా..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇప్పటికే దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా సంస్థలు మరో సిగ్గుమాలిన చర్యలకు ఒడిగట్టాయి. బరితెగించిన పచ్చ మీడియా చానళ్లు.. మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై అసభ్యకరంగా వ్యవహరించాయి. మందడం హైస్కూల్లో మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా కనీస మర్యాద పాటించడకుండా వీడియో ద్వారా చిత్రీకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడంకు వచ్చిన కానిస్టేబుల్ డ్యూటీ అనంతరం హైస్కూల్లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. దుస్తులు మార్చకుంటుండగా కొన్ని చానళ్ల సిబ్బంది గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారని ఆ కానిస్టేబుల్ ఆరోపించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సంబంధిత పాఠశాల హెడ్ మాస్టార్ కోటేశ్వరరావు స్పందించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుల్స్‌కు కేటాయించామని, వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. -
రాజధాని భూమిపూజకు శ్రీకారం
- భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య ఏర్పాట్లు సాక్షి గుంటూరు/తుళ్లూరు : నూతన రాజధాని నిర్మాణానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య శనివారం ఉదయం 8.49 గంటలకు భూమిపూజ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వే నంబర్లోని బెజవాడ సత్యనారాయణకు చెందిన స్థలంలో శాస్త్రోక్తంగా పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఏర్పాట్ల పరిశీలన.. భూమిపూజ జరిగే ప్రాంతంలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, భద్రత అధికారి జోషి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత సీఆర్డీఏ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమన్వయంతో భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భూమిపూజకు అవసరమైన సామగ్రిని మందడం సర్పంచి ముప్పవరపు పద్మావతి, సుమారు కిలో వెండితో వెండిబొచ్చె, బంగారు పూత పూయించిన తాపీని అంగలకుదురుకు చెందిన రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆలపాటి వెంకటరామయ్య కలెక్టర్‌కు అందజేశారు. నేడు సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం సాక్షి, విజయవాడ : నగరంలోని జలవనరులశాఖ ప్రాంగణంలో సిద్ధం చేసిన సీఎం క్యాంపు కార్యాలయ భవనాన్ని చంద్రబాబు శనివారం ప్రారంభిస్తారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శనివారం ఉదయం పది, పదకొండు గంటల మధ్యలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రాజధానికి భూమి పూజచేయనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన దీక్ష చేశారని మంత్రి ఉమా ఆరోపించారు. పూర్తికాని సీఎం క్యాంపు కార్యాలయ భవనం సీఎం క్యాంపు కార్యాలయం పూర్తిగా సిద్ధమయ్యేందుకు మరో మూడునెలలు పడుతుందని సమాచారం. లిప్టులు ఏర్పాటు, సీలింగ్, ఫ్లోరింగ్, మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రహరీ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ప్రత్యేక విద్యుత్ దీపాల అలకరణ పనులు జరుగుతున్నాయి. సీఎం వ్యక్తిగత సెక్యూరిటీకి కేటాయించిన భవనాల మరమ్మతులు పూర్తికాలేదు. నేడు నగరానికి సీఎం రాక విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శనివారం నగరానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 గంటలకు విమానంలో బయలుదేరి 7.55 గంటలకు గన్నవరంలో దిగుతారు. అక్కడ్నుంచి 8 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గుంటూరు జిల్లా మందడం వెళతారు. అక్కడ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 10 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.20 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దిగుతారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిర్మిస్తున్న సీఎం క్యాంప్ ఆఫీసును చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో గన్నవరం చేరుకుని విమానంలో వైజాగ్ వెళతారు. పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
నేడు రాజధాని భూమిపూజ
* ఉదయం 8.49 గంటలకు ముహూర్తం * సతీసమేతంగా హాజరవుతున్న సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని(అమరావతి) నిర్మాణంకోసం శనివారం జరగనున్న భూమిపూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 8.49 గంటలకు వేదపండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలసి హాజరవుతున్నారు. ఉదయం 7.15 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 7.55కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో 8.15 గంటలకు తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చేరుకుంటారు. ఆ తరువాత 9.30 గంటలవరకు కొనసాగే భూమిపూజలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారని జిల్లా అధికారవర్గాలు తెలిపాయి. తుళ్లూరు మండలం మందడం గ్రామ హద్దుల్లోని సర్వే నంబరు 135, 136లలోని పొలాలను రాజధాని నగర నిర్మాణ పనుల భూమిపూజకు అనువైనదిగా ఎంపిక చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజాము 3 గంటలకే పూజలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం 9 మంది వేదపండితులను రప్పించారు. పూజ తర్వాత హలయజ్ఞం... సరిగ్గా శనివారం ఉదయం 8.49 గంటలకు నిర్దేశిత ప్రదేశంలో సీఎం చంద్రబాబు దంపతులు భూమిపూజ నిర్వహిస్తారు. అనంతరం నాగలి పట్టి హలయజ్ఞం నిర్వహిస్తారు. నేడు క్యాంప్ ఆఫీస్ సందర్శన... మందడంలో భూమిపూజ ముగిశాక సీఎం దంపతులు హెలికాప్టర్ద్వారా విజయవాడ చేరుకుని అక్కడ నీటిపారుదలశాఖ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీఎం హెలికాప్టర్లోనే గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడినుంచి విశాఖపట్నం వెళతారని అధికారవర్గాలు తెలిపాయి. -
నవ్యాంధ్ర రాజధానికి రేపు భూమిపూజ
-
మందడంలో ఏపీ రాజధాని భూమిపూజ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధాని భూమిపూజ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రేపు ఉదయం 8.49 గంటలకు భూమిపూజలో పాల్గొంటారు. మరోవైపు భూమిపూజకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
మందడంలో రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాస
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేత అనుమోలు హరి అడ్డుకున్నారు. దాంతో రైతులు ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్గీయులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.