సాక్షి, గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతి సమీపంలోని మందడంలో నిరసన సెగ ఎదురైంది. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే స్థానికులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలు చూపుతూ మహిళలు నిరసన తెలిపారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ప్లకార్డులు చూపించారు. ఇళ్లస్థలాలపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. (రావి చెట్టుకు ‘చంద్ర’ గ్రహణం)
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానులను చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ తీరుకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో స్థానికులు దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. టీడీపీ నేతలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. (తమాషాలు చేస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment