దీక్షలను విజయవంతం చేయాలి | Initiations must succeed | Sakshi
Sakshi News home page

దీక్షలను విజయవంతం చేయాలి

Published Wed, Jul 20 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

దీక్షలను విజయవంతం చేయాలి

దీక్షలను విజయవంతం చేయాలి

సూర్యాపేటమున్సిపాలిటీ : ఆల్‌ ఇండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఆగస్టు 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించే ఉపవాస దీక్షలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేజే ఉదయ్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. బిల్లు ప్రవేశపెట్టి దళితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రసాద్, ఎస్‌.వెంకటేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్తపల్లి ప్రశాంత్, గంట జీవన్‌కుమార్, కీసర అరవింద్‌రెడ్డి, జాకోబ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement