సమస్యలు పరిష్కరించకుండా దీక్షలెందుకు?
పాలకొండ ఎమ్మెలే కళావతి
పాలకొండ: ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించకుండా నవనిర్మాణ దీక్షలు చేపట్టడం ఎందుకని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రశ్నించారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడితప్పిందన్నారు. ప్రభుత్వ పథకాలలో కోత, అవినీతి పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
అర్హులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. పోగరహిత సమాజం పేరుతో కేంద్రప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తుంటే స్థానిక నాయకులు మాత్రం వారి అనుచరులకే అందిస్తున్నారని ఆరోపించారు. పింఛన్లు అందక వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన ఉండటం లేదని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకూ విత్తనాలు, సాగునీరు అందించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇప్పడు కావాల్సిం ది నవనిర్మాణ దీక్షలు కాదని నవనిర్మాణ పాలన అని స్పష్టం చేశారు.