గోమాత మాల దీక్ష స్వీకరణ
గోమాత మాల దీక్ష స్వీకరణ
Published Fri, Nov 11 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
కర్నూలు (న్యూసిటీ): జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణ శాల)లో శుక్రవారం తొలిసారిగా 30 మంది గోమాత మాల దీక్షలు స్వీకరించారు. శ్రీకృష్ణ భగవానునికి, గోమాతలకు పూజలు చేసి, గోవుకు పచ్చిగడ్డితో తులాభారం నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వణాధికారి కె.కమలాకర్ మాట్లాడుతూ.. గోమాత మాల దీక్షలు స్వీకరిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందన్నారు. మిడ్తూరు గ్రూపు దేవాలయాల కార్య నిర్వహణాధికారి టి.హనుమంతరావు, మాజీ పాలక మండలి సభ్యులు శ్రీకాంత్ నాయుడు, ఎస్.సదానందం పాల్గొన్నారు.
Advertisement
Advertisement