భువనగిరి :తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ భువనగిరి కోర్టులో న్యాయవాదులు గురువారం నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు ఆవరణలో టెంట్ వేసి ముగ్గురు న్యాయవాదులు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా న్యాయవా దుల జేఏసీ చైర్మన్ నాగారం అంజయ్య, సీనియర్ న్యాయవాది పులిమామిడి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్యయంపాలన, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుక్ను తెలంగాణలో ఇంకా సీమాంధ్రుల పెత్తనాలు సాగుతున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు కేసులలో సీమాంధ్ర న్యాయమూర్తులు పక్షపాతం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నెల 31 వరకు తెలంగాణ హైకోర్టును ఏర్పాటు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టుల్లో విధులు బహిష్కరిస్తారని హెచ్చరించారు. దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయికం రమేష్, దేవరాజు శ్రీనివాసరాజు, బొబ్బల కేశవరెడ్డి దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వంగేటి విజయ భాస్కర్‌రెడ్డి, పడాల శ్రీనివాస్‌పటేల్, గజ్జెల రవీందర్ రెడ్డి, వంచ దామోదర్‌రెడ్డి, బొమ్మ వెంకటేష్, విద్యాసాగర్, దేవరకొండ జనార్దన్, నక్కల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలి
Published Fri, Jul 18 2014 1:52 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement