సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఇంజనీర్లు గురువారం నుంచి మూడు రోజుల పాటు సామూహిక సెలవులు పెడుతున్న సంగతి తెలిసిందే.
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఇంజనీర్లు గురువారం నుంచి మూడు రోజుల పాటు సామూహిక సెలవులు పెడుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు గురువారం రాజమండ్రిలోని మున్సిపల్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఉభయ గోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీ లకుచెందిన ఇంజనీర్లు ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ర్యాలీ కూడా చేపడతారు. మూడు రోజులు విధులకు హాజరుకాకుండా నిరసన తెలుపుతారు. ఈ నెల 28న జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో విద్యుద్దీపాలు వెలిగించకుండా నిరసన వ్యక్తం చేయనున్నారు. దాదాపు 90 మంది మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొననున్నారు.