సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్త ,రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌లు పరామర్శించారు.
అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘తెనాలిలో యువతిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. టీడీపీకి చెందిన రౌడీ షీటర్ నవీన్.. మదిర సహాన అనే యువతిని కొట్టి హింసించి దాడి చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు, చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోయాయి. చంద్రబాబు పరిపాలన మొత్తం మారణ హోమానికి తెర లేపుతున్నారు
హోంమంత్రి అనిత కళ్ళు లేని కబోధిలా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఆడబిడ్డకు ఏ కష్టం వచ్చినా వారికి న్యాయం జరిగేది. దిశ పోలీసులు క్షణాల్లో స్పందించే వారు. ఇప్పుడు అదే దిశ యాప్ ఏమైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలవాలి’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి మూడు మర్డర్లు.. ఆరు హత్యాచారాలు తరహాలో పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు అని ఆరోపణలు చేశారు.
అధికారంలోకి వచ్చాక మరి వాళ్ళందరిని తీసుకువచ్చి ఎందుకు తల్లిదండ్రులను అప్పగించలేదు. ఆడపిల్ల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు. సహానాను నవీన్ అనే టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ దారుణంగా కొట్టి హింసించాడు. యువతి శరీరంపై గాయలయ్యాయి. బాధితురాలు ఇప్పుడు కోమాలోకి వెళ్లింది. ఇంతటి దారుణికి ఒడిగట్టిన నిందితుణ్ని కాపాడటానికి కూటమి నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment