
తాడేపల్లి: పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఆసరా పథకంతో లక్షల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. టీడీపీ అభిప్రాయాలని ఈనాడు ద్వారా చెప్పించారని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు ఆగిపోవాలని వారు భావిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నానని తెలిపారు. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారని అన్నారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నామని తెలిపారు. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.