తాడేపల్లి, సాక్షి: రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందోని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ స్పందించారు..
‘‘నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా.. ఒక ముద్దాయిని చూడడానికి జైలుకు వెళ్లారని జగన్‌ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనా?. ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా?. దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు. అందుకే అలా మాట్లాడారు.
.. వరదల్లో బొట్లు కొట్టుకొస్తే వైసీపీ వాళ్ళు చేయించారని కథ అల్లుతున్నారు. మరి కిందకు కొట్టుకుపోయిన మరో రెండు బోట్ల కోసం ఎందుకు మాట్లాడడం లేదు?. బోట్ల యజమాని ఉషాద్రి పాదయాత్రలో లోకేష్ ని కలవలేదా?. ఇలాంటి కేసులో నందిగం సురేష్‌ను ఇరికించాలని చూస్తున్నారు. వరదల సమయంలో అసలు తలశిల రఘురాం అసలు ఇక్కడ లేనే లేరు. అలాంటి వ్యక్తి పై అక్రమ కేసు పెట్టాలని చూడడం దారుణం.
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్ననే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పై దాడికి పాల్పడ్డారు.పల్నాడు లో సోషల్ మీడియా కార్యకర్తలు షేక్ మాబు, రాజశేఖర్ రెడ్డి పై దాడి చేశారు. పోలీసులకు చెప్పినా రక్షించకుండా హింసిస్తున్నారు అని మేరుగ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment