‘దళితుల హక్కులను చంద్రబాబు హరించారు’ | Meruga Nagarjuna And Nandigam Suresh Fires On Chandarabau | Sakshi
Sakshi News home page

‘దళితుల హక్కులను చంద్రబాబు హరించారు’

Published Sat, Aug 29 2020 3:48 PM | Last Updated on Sat, Aug 29 2020 3:52 PM

Meruga Nagarjuna And Nandigam Suresh Fires On Chandarabau - Sakshi

సాక్షి, అమరావతి: దళితుల పట్ల చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా దళితులకు దక్కాల్సిన హక్కుల్ని చంద్రబబాబు హరించారని దుయ్యబట్టారు. దళితులను బాబు అడుగడుగునా అవమానించారని మండిపడ్డారు. దళితులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈనెల 31న అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు. (చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదు)

చంద్రబాబు దళిత వ్యవతిరేకి అని బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అడుగడుగునా దళితులను అవమానించింది చంద్రబాబే అని మండిపడ్డారు.‌ దళితులపై ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని నందిగం సురేష్‌ హెచ్చరించారు.‌ దళితులపై దాడులు జరిగితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నారని  ఆయన ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement