సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆడించిన నాటకంలో భాగంగానే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మద్యం తాగి వీరంగం చేశారని ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దళితులను బలి పశువులను చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదివారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే..
ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబే: నందిగం
► 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసేందుకు డాక్టర్ సుధాకర్ ప్రయత్నించారు.
► అందుకోసం అప్పట్లో డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. టీడీపీ సీటు రాకపోవడంతో రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్నారు. డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ వెనకున్న పెద్ద ఆర్టిస్ట్ చంద్రబాబే. దళితుల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు.
► చంద్రబాబు దళిత ద్రోహి. కుల రాజకీయాలు చేయటంలో దిట్ట. మోసం చేయటం ఆయన పేటెంట్ హక్కు. దళితులకు విలువ లేకుండా చేయాలన్నదే బాబు ఆలోచన.
పథకం ప్రకారమే: ఎమ్మెల్యే మేరుగ
► పథకం ప్రకారం డాక్టర్ సుధాకర్‌ను చంద్రబాబు వాడుకుంటూ బలి పశువును చేస్తున్నారు.
► ఈ నాటకంలో చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి పాత్ర ఉంది. వారందరిపైనా డీజీపీ విచారణ జరిపించాలి.
► కరోనా కాలంలోనూ ప్రభుత్వం వైరస్ నియంత్రణ సహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. ఎక్కడా ఏమీ అనడానికి అవకాశం లేక డాక్టర్ సుధాకర్‌ను తీసుకొచ్చి చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు ఈ నాటకానికి తెర తీశారు.
చంద్రబాబు స్క్రిప్ట్: ఎమ్మెల్యే టీజేఆర్
► డా. సుధాకర్ ఆడిన నాటకానికి స్క్రిప్ట్ రచించింది చంద్రబాబే. ఆ స్క్రిప్ట్ అమలు చేయడం కోసం మతిస్థిమితం లేని డాక్టర్ సుధాకర్‌ను వాడుకున్నారు.
► ఇదంతా చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి పద్ధతులను దళిత సమాజం వ్యతిరేకిస్తుంది.
► 16వ తేదీన సంఘటన జరిగితే ఒకరోజు ముందే చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇదంతా చంద్రబాబు కార్యాలయంలో తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment