తాడేపల్లి: వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా స్కీమ్‌లపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున , లబ్ధిదారులు పథకాలు అద్భుతమని కొనియాడారు. సమావేశంలో వారేమన్నారంటే వారి మాటల్లోనే..
గొప్ప పథకం: మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి
అందరికీ నమస్కారం, వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో గౌరవ ప్రదంగా వివాహం నిర్వహించుకునేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్ళులేని కబోదుల్లా కళ్యాణమస్తు తీసేశారంటున్నారు. వారికి చెంపపెట్టు ఈ స్కీమ్. ఈ మధ్య బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కళ్యాణమస్తు కూడా చదువుకు లింక్ అయింది, అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని పొగిడారు. సీఎంగా మీరు చేస్తున్న ఈ గొప్ప విప్లవం సామాజిక విప్లవానికి తెరతీసింది. ఏపీ ప్రజానీకం దీనిని గమనించాలని కోరుకుంటున్నాను.
పేదల ఇండ్లలో వెలుగు నింపుతున్నారు: భార్గవి, లబ్ధిదారు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా
అన్నా, మాది నిరుపేద కుటుంబం, మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నా, నేను ఎస్సీని, పెళ్ళి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అనే భరోసా కల్పించారు. మీరు అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్యవివాహాలు తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల పేదలు ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలో మేం చాలా లబ్ధిపొందాం, మాకు పథకాలు అందాయి. మీరు ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ చాలా ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చదువులు చెబుతున్నారు. స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నారు. గతంలో రేషన్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటి ముందుకే అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అన్నా.
Comments
Please login to add a commentAdd a comment