benificiary
-
Ap: ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ పేదలకు వరం
తాడేపల్లి: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా స్కీమ్‌లపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున , లబ్ధిదారులు పథకాలు అద్భుతమని కొనియాడారు. సమావేశంలో వారేమన్నారంటే వారి మాటల్లోనే.. గొప్ప పథకం: మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అందరికీ నమస్కారం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో గౌరవ ప్రదంగా వివాహం నిర్వహించుకునేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్ళులేని కబోదుల్లా కళ్యాణమస్తు తీసేశారంటున్నారు. వారికి చెంపపెట్టు ఈ స్కీమ్. ఈ మధ్య బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కళ్యాణమస్తు కూడా చదువుకు లింక్ అయింది, అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని పొగిడారు. సీఎంగా మీరు చేస్తున్న ఈ గొప్ప విప్లవం సామాజిక విప్లవానికి తెరతీసింది. ఏపీ ప్రజానీకం దీనిని గమనించాలని కోరుకుంటున్నాను. పేదల ఇండ్లలో వెలుగు నింపుతున్నారు: భార్గవి, లబ్ధిదారు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా అన్నా, మాది నిరుపేద కుటుంబం, మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నా, నేను ఎస్సీని, పెళ్ళి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అనే భరోసా కల్పించారు. మీరు అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్యవివాహాలు తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల పేదలు ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలో మేం చాలా లబ్ధిపొందాం, మాకు పథకాలు అందాయి. మీరు ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ చాలా ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చదువులు చెబుతున్నారు. స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నారు. గతంలో రేషన్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటి ముందుకే అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అన్నా. ఇదీ చదవండి.. పేద కుటుంబాలకు జగనన్న కానుక -
జగనన్న గృహ నిర్మాణ పథకంతో సొంతింటికల సాకారం
-
‘మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు’
సాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ‘మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే’.. అంటూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు.. నా పేరు శాంతిశ్రీ అన్నా.. నేను కాపునేస్తం మూడు విడతల్లో తీసుకున్నా అన్నా. నాలుగోసారి మిస్ అయితే వాలంటీర్లు నాకు రాకపోవడానికి కారణం కనుక్కొని మరీ నాలుగో విడత వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియడంతో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లు ఆనందం కలిగిందన్నా. నాకు కాపు నేస్తంతో చాలా సహాయం అందుతుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మా కాపులను మీరు గుర్తుపెట్టుకొని, కాపులకు సాయం చేయాలనే తపనతో మాకు మీరు ఈ పథకాన్ని ఇచ్చారన్నా. కాపులు గురించి ఆలోచించి మీరు మంచి పని చేశారు. కాపు నేస్తం ద్వారా కుట్టుమిషన్ కొనుక్కొని అదే నా జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నా అన్నా. నా భర్త వికలాంగుడు అన్నా.. జనవరి 1 తేదీనే వాలంటీర్ మా ఇంటికి వచ్చి మరీ పించన్ డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అన్నా. నాకు కొడుకులు లేరన్నా.. నా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడని మా భార్యభర్తలు ఇద్దరం చాలా సంతోషపడుతున్నాం అన్నా. -శాంతి శ్రీ, కాపు నేస్తం లబ్దిదారు (రాజమండ్రి రూరల్ హకుంపేట్ గ్రామం) మా అమ్మ సంతోష ఉంది.. మీరు సల్లంగా ఉండాలి.. నమస్తే జగన్ సర్.. గత రెండు నెలలుగా ఆటో డబ్బులు పడినాయ్ సార్. మూడోసారి పడలేదు.. వాలంటీర్ నాకు రాకపోవడానికి కరెంట్ బిల్లు సమస్య అని చెప్పి.. ఆ సమస్యను తీర్చి మళ్లీ మూడోసారి నాకు డబ్బులు పడేలా చేశారు. మాకు ముందు నుంచి ఈ పథకాలు లేకున్నా.. మీరు మాకు ఈ పథకం ఇస్తున్నందుకు మా ఆటోనడిపేవారందరీ తరఫున ధన్యవాదాలు సర్. మీ ద్వారా మా అమ్మకు పించన్ వస్తుంది. పించన్ మూడు వేల రూపాయలు కావటం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సర్.. మీరు సల్లంగా ఉండాలి. - వాహన మిత్ర లబ్దిదారు (ఖాజా హుస్సేన్, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు) మీ సాయం.. నా జీవితానికి ఓ మలుపు ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కరం. నా పేరు సాయి ప్రత్యూష అన్నా.. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మగారు చిన్న హస్టల్లో పనిచేసేవారు. మా నాన్న గారు చిన్న సామాన్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు మా అమ్మగారు మరణించారు. అలాంటి సమయాలో నేను పైచదువులు చదవాలన్న ఆలోచనను వదులుకున్నా అన్నా. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నా. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ నాకు సాయం చేయలేదన్నా. అలాంటి సమయంలో మా వాలంటీరు స్వయంగా మా ఇంటికి వచ్చి.. ‘జగనన్న చేదోడు’ పథకం కింద టైలర్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. దాని నేను చాలా సంతోషించా. మీరిచ్చే చేదోడు పదివేలతో పెట్టుబడి పెట్టి ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని పెద్దగా తీసుకువెళ్లాలని అనుకున్నా. ఉదయం టైలరిగ్ చేస్తూ.. సాయంత్రం ట్యూషన్ చెబుతూ జీవనం సాగిసున్నా అన్నా. మీరు చేదోడు పథకం ద్వారా ఇచ్చే పదివేల సాయం చాలా చిన్నది కావొచ్చు.. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇదొక మలుపు తిరిగే పాయింట్ అన్నా. మీరు ఇచ్చే ఈ పట్టుబడితో నా కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నా. -సాయి ప్రత్యూష, జగనన్న చేదోడు లబ్ధిదారు, (శ్రీకాకుళం పట్టణం) -
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు హర్షం
-
Viral: బెంజ్కార్లో బీదవాడు.. ఇదీ అసలు సంగతి
వైరల్: దేశంలో సంక్షేమ ఫలితాలు అర్హులకే అందుతున్నాయా? లబ్ధిదారులకు పంపిణీ అంతా సజావుగానే సాగుతోందా?. కానీ, ఏదైనా ఘటన వెలుగు చూస్తేనే.. అవకతవకలంటూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి రేషన్ సరుకులు తీసుకెళ్లడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. నలోయన్ చౌక్‌లో ఉన్న ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి.. సరాసరి రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. కాసేపటికి ఒక వ్యక్తితో రేషన్ సరుకుల సంచులు మోయించుకుని వచ్చి.. బెంజ్ కారు డిక్కీలో వాటిని పెట్టించుకుని వెళ్లిపోయాడు. ఇంకేం.. అక్కడే ఉన్న కొందరు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. సరదా కోసం వాళ్లు చేసిన పని.. పెనుదుమారమే రేపింది. అర్హులు కానివాళ్లకు రేషన్ అందుతోందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో మీడియా సదరు రేషన్ డీలర్‌ను సంప్రదించింది. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్(బిలో పావర్టీ లైన్) కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని చెప్పాడు ఆ డీలర్. మరోవైపు బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి సైతం స్పందించాడు. #Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral @PMOIndia @NirmalaSitharaman @CMOPb @AamAadmiParty @ArvindKejriwal pic.twitter.com/7gFy589QAH — ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) September 6, 2022 తన పేరు రమేష్ సైని అని, ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి దగ్గర పార్క్ చేశారని చెప్పాడు. డీజిల్ కారు కావడంతో అప్పుడప్పుడు దానిని వాడుతున్నట్లు చెప్పాడాయన. నేను బీదవాడినే. నాకు చిన్న వీడియోగ్రఫీ దుకాణం ఉంది. నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. పిల్లలను ప్రైవేట్‌లో చదివించేంత డబ్బు కూడా నా దగ్గర లేదు అంటూ రమేష్ సైని వెల్లడించాడు. అయితే ఈ వివరణతో వివాదం చల్లారలేదు. పంజాబ్ ప్రభుత్వం అందిస్తున్న ఆటా దాల్ పథకంలో భాగంగా.. ఆ వ్యక్తి గోధుమల్ని రేషన్‌లో తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో విమర్శల నేపథ్యంతో.. పంజాబ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి లాల్ చంద్ కటారుచక్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అయ్యో.. జాలిలేకుండా చూస్తూ ఉండిపోయింది -
సీఎం జగన్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేం: అగ్రిగోల్డ్ బాధితులు
-
మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మట్లాడుతూ.. వైఎస్ఆర్ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని తెలిపారు. కుటుంబానికి మహిళలే రథసారధులు నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అమూల్, రిలయన్స్, పీ అండ్ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, 78వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని సీఎం జగన్ తెలిపారు. లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని, లీటర్ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కేబినెట్లోనూ మహిళలకు ప్రాధాన్యత కేబినెట్లోనూ మహిళలకు ప్రాధాన్యతఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు నామినేటెడ్ పదవులను కేటాయించామని సీఎం జగన్ అన్నారు. ప్రతి రంగంలో అధిక శాతం మహిళలకు ప్రాతినిథ్యం కల్పించామని, వారి కోసం దిశ, అభయం యాప్ తీసుకొచ్చామని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని, వారికోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అయింది. ఇప్పటికే 78వేల మందికి ఏపీ ప్రభుత్వం కిరాణా షాపులు పెట్టించింది. కిరాణా షాపుల ద్వారా ఒక్కో మహిళకు రూ.10వేల వరకు అదనపు ఆదాయం రానుంది. 1,90,517 మందికి ప్రభుత్వం గేదెలు, ఆవులు, మేకలు అందించింది. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
ఇంటికో నజరానా..
-
ఇంటికో నజరానా..
కొత్తగా వ్యక్తిగత లబ్ధి పథకాలపై సర్కారు ఫోకస్ - ప్రస్తుత పథకాలు, కార్యక్రమాల రీడిజైన్‌పైనా దృష్టి - అర కోటి కుటుంబాలకు చేరేలా బీసీ, ఎంబీసీ కార్యక్రమాలు - మరిన్ని ‘ఆసరా’ పింఛన్ల మంజూరుకు నిర్ణయం - మరో లక్ష మంది బీడీ కార్మికులకు పెన్షన్లు - జూన్ నుంచి గొర్రెల పంపిణీ.. - ఈ ఏడాది లక్ష కుటుంబాలకు ప్రయోజనం - నెలనెలా పక్కాగా పెంచిన మెస్ చార్జీల పంపిణీ - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటికో లబ్ధిదారు ఉండేలా.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంపై సర్కారు దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న పథకాలను మరింత విస్తరించడం, బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకాలతో పాటు మరిన్ని కొత్తవి చేపట్టేలా వ్యూహరచన చేస్తోంది. మొత్తంగా నేరుగా లబ్ధి పొందే వారి సంఖ్యను వీలైనంతగా పెంచే లక్ష్యంతో పథకాలను రీడిజైన్ చేయనుంది. ఇందులో భాగంగా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల అమలుపై కసరత్తు వేగవంతం చేసింది. ఇంటింటికీ సర్కారు కానుక అందించినట్లుగా ఉండేలా కార్యక్రమాలను మలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాదిలోనే.. తాజా బడ్జెట్లో పొందుపరిచిన పథకాలతో పాటు ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలను ఈ ఏడాదిలో పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రాధాన్యంగా ఎంచుకున్న గొర్రెల పంపిణీ, బీసీ, ఎంబీసీ కులాల అభ్యున్నతికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో.. ఆయా వర్గాల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని జూన్ నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ఏడాది లక్ష యాదవ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా సమగ్ర ప్రణాళికను పశు సంవర్థక శాఖ సిద్ధం చేస్తోంది. ఎంబీసీ పథకాలపై కసరత్తు ఎంబీసీలకు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలి, ఇంటింటికీ లబ్ధి చేకూరేలా ఎలాంటి పథకాలను డిజైన్ చేయాలనే అంశాలపై కసరత్తును కొత్తగా ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కు అప్పగించారు. వీలైనంత త్వరగా కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసి, సిబ్బందిని కేటాయించి.. కసరత్తును వేగవంతం చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంబీసీ, బీసీల అభ్యున్నతికి చేపట్టే పథకాలు గ్రామాల్లో ఆయా వర్గాల ఇంటింటికీ చేరేలా ఉండాలని స్పష్టం చేశారు. దీంతో అదే దిశగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పనకు కసరత్తు మొదలైంది. బడ్జెట్లో ప్రభుత్వం ఎంబీసీలకు రూ.వెయ్యి కోట్లు, రజక, నాయీబ్రాహ్మణులకు రూ.500 కోట్లు, విశ్వకర్మలకు రూ.200 కోట్లు, చేనేతలకు రూ.1,200 కోట్లు కేటాయించింది. వీటి ద్వారా ఆయా వర్గాలకు చెందిన 50 లక్షల కుటుంబాలకు తొలి ఏడాదిలోనే ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల రూపకల్పనకు వ్యూహరచన చేస్తోంది. పింఛన్ల సంఖ్య మరింతగా పెంపు! తొలి ఏడాదిలోనే తమకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించిన ఆసరా పెన్షన్లపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో ఇంట్లో ఒకే పింఛన్ ఇవ్వాలన్న నిబంధనను కూడా ఇటీవల సడలించింది. బీడీ కార్మికులున్న కుటుంబాల్లో ఎవరికైనా ఆసరా పింఛన్ అందుతున్నా సరే.. ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులున్నా సరే.. బీడీ కార్మికులకు జీవనభృతి అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.47 లక్షల మంది బీడీ కార్మికులు నెలకు రూ.వెయ్యి చొప్పున జీవన భృతి అందుకుంటున్నారు. తాజా నిర్ణయంతో మరో 81 వేల నుంచి లక్ష మంది వరకు లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఒంటరి మహిళలకు కూడా ఆసరా పింఛన్లను అందించాలని యోచిస్తోంది. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేతలు, గీత కార్మికులతో పాటు బీడీ కార్మికులు కలిపి 36 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. అదనంగా పెరిగే బీడీ కార్మికులు, ఒంటరి మహిళల పింఛన్లతో ఈ సంఖ్య 38 లక్షలకు చేరనుంది. ఇవేగాకుండా అవసరమున్న చోట దరఖాస్తులను బట్టి మరో రెండు లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి బడ్జెట్లో రూ.5,330 కోట్లను ఆసరా పింఛన్లకు కేటాయించారు. ఈ కేటాయింపులను బట్టి దాదాపు నలభై లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు అవకాశముంది. కచ్చితంగా పంపిణీ.. పెంచిన మెస్ చార్జీలను సైతం ఈ ఏడాది పక్కాగా నెలనెలా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. స్కూలు, కాలేజీ విద్యార్థులు కలిపి దాదాపు 18 లక్షల మందికి మెస్ చార్జీల పెంపుతో ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉండే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, విలేజీ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఇక ఇటీవల అసెంబ్లీలో సీఎం హామీ ఇచ్చిన మేరకు హోంగార్డుల రెగ్యులరైజేషన్పైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 19 వేల మంది హోంగార్డులున్నారు. వారిని వివిధ ఉద్యోగాల్లో నియమించేందుకు అవసరమైన మార్గాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇవన్నీ వ్యక్తిగత లబ్ధి చేకూర్చటంతో పాటు ఇంటింటికీ సర్కారు కానుకను అందించినట్లు ఉండేలా కసరత్తు జరుగుతోంది.