YSR Shaadi Tohfa
-
చదువులకు ఊతమిచ్చేలా కల్యాణమస్తు
సాక్షి, అమరావతి : పిల్లలను చదివించే దిశగా ఒక అడుగు ముందుకేసి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్–డిసెంబర్ 2023 (త్రైమాసికం)లో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు ఈ పథకం కింద రూ.78.53 కోట్ల ఆరి్థక సాయాన్ని మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులు ఇద్దరూ పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు. దీనివల్ల ఈ పథకానికి అర్హత రావాలంటే, ఆ మేరకు కనీస విద్యార్హత ఉండాలి కాబట్టి పిల్లలను చదివించడానికి ప్రోత్సాహం అందించేదిగా ఉంటుందన్నారు. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు వయస్సు ఉండాలన్న నిబంధన వల్ల పది పాసయ్యాక ఇంటర్లో చేరుస్తారని చెప్పారు. పైగా ఇంటర్ చదువుకు అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నాం కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారన్నారు. ఇంటర్ పూర్తైన తర్వాత విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం ఉన్నందున డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు అడుగులు పడతాయని అన్నారు. ఇలా చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి అమ్మాయి, అబ్బాయి గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామని తెలిపారు. ‘కుటుంబంలో తల్లి చదువుకుని ఉంటే ఆ తర్వాత తరంలో వచ్చే పిల్లలు ఆటోమేటిక్‌గా చదువుల బాట పడతారు. భవిష్యత్‌లో కుటుంబాల తల రాతలు మారాలన్నా, మంచి జీతాలతో ఉద్యోగాలు రావాలన్నా, మంచి చదువులు మన చేతుల్లో ఉండాలి. అప్పుడు మన తల రాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంద’ని చెప్పారు. అందువల్ల గత ప్రభుత్వ హయాంలో వలె ఈ పథకాన్ని ఏదో నామ్‌కే వాస్తేగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా.. ప్రతి త్రైమాసికం (క్వార్టర్) పూర్తయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ చేసి తర్వాత ఇస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సర్టీ ఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మన గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేలా మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ ఏ ఒక్కరూ మిస్ కాకుండా దీన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించేలా సచివాలయం వరకూ తీసుకుపోయాం. ► గతం కంటే పెంచి మరీ సాయమందిస్తున్నాం. గతంలో ఎస్సీలకు రూ.40 వేలకే పరిమితమైన పథకాన్ని రూ.లక్ష వరకు తీసుకుపోయాం. అదే కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల వరకూ పెంచాం. ఎస్టీలకు గతంలో రూ.50 మాత్రమే ఉంటే దాన్ని కూడా రూ.లక్ష వరకు పెంచడంతోపాటు, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలకు పెంచాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్న పరిస్థితుల నుంచి రూ.50 వేలకు, కులాంతర వివాహం అయితే రూ.75 వేలకు తీసుకుపోయాం. దివ్యాంగులకు అయితే ఏకంగా రూ.1.50 లక్షల వరకు తీసుకెళ్లాం. వాళ్ల కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏ ఒక్కరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్ అమౌంట్ పెంచి ఇస్తున్నాం. చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ► గతంలో అరకొరగా ఇచ్చిన పరిస్థితులు. దాదాపు 17,709 మంది పిల్లలకు అరకొరగా ఇచ్చేవి కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితి గతంలో ఉంది. ఏ ఒక్కరూ మిస్ కాకూడదని అనే ఉద్దేశంతో త్రైమాసికం (క్వార్టర్) అయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఐదో విడత కార్యక్రమం. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం. ఈ ఒక్క పథకానికే ఇప్పటి వరకు 56,194 జంటలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ రూ.427 కోట్లు ఇచ్చాం. ఇది అందరూ గర్వించే పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నత ఆశయంతో అమలు చేస్తున్న వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో గౌరవప్రదంగా వివాహం నిర్వహించేలా భరోసా కల్పిస్తున్న పథకం. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్లు లేని కబోదుల్లా నోరు పారేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. కళ్యాణమస్తు పథకం చదువుకు లింక్ అవడంతో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గడం పట్ల ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ప్రశంసించారు. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పేదల పెళ్లికి పెద్ద భరోసా అన్నా.. మాది నిరుపేద కుటుంబం. మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను ఎస్సీని. పెళ్లి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అంటూ పేదల పెళ్లికి పెద్ద భరోసా ఇస్తున్నారు. అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్య వివాహాలు తగ్గుతున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మేం చాలా లబ్ధి పొందాం. నాడు–నేడుతో స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. పేదలకు ఇంగ్లిష్ చదువులు వచ్చాయి. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. థ్యాంక్యూ జగన్ అన్నా. – భార్గవి, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా -
Ap: ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ పేదలకు వరం
తాడేపల్లి: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా స్కీమ్‌లపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున , లబ్ధిదారులు పథకాలు అద్భుతమని కొనియాడారు. సమావేశంలో వారేమన్నారంటే వారి మాటల్లోనే.. గొప్ప పథకం: మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అందరికీ నమస్కారం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో గౌరవ ప్రదంగా వివాహం నిర్వహించుకునేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్ళులేని కబోదుల్లా కళ్యాణమస్తు తీసేశారంటున్నారు. వారికి చెంపపెట్టు ఈ స్కీమ్. ఈ మధ్య బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కళ్యాణమస్తు కూడా చదువుకు లింక్ అయింది, అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని పొగిడారు. సీఎంగా మీరు చేస్తున్న ఈ గొప్ప విప్లవం సామాజిక విప్లవానికి తెరతీసింది. ఏపీ ప్రజానీకం దీనిని గమనించాలని కోరుకుంటున్నాను. పేదల ఇండ్లలో వెలుగు నింపుతున్నారు: భార్గవి, లబ్ధిదారు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా అన్నా, మాది నిరుపేద కుటుంబం, మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నా, నేను ఎస్సీని, పెళ్ళి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అనే భరోసా కల్పించారు. మీరు అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్యవివాహాలు తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల పేదలు ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలో మేం చాలా లబ్ధిపొందాం, మాకు పథకాలు అందాయి. మీరు ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ చాలా ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చదువులు చెబుతున్నారు. స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నారు. గతంలో రేషన్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటి ముందుకే అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అన్నా. ఇదీ చదవండి.. పేద కుటుంబాలకు జగనన్న కానుక -
2023 అక్టోబర్-డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంటలకు పెళ్లి కానుక
-
YSR Kalyanamasthu: వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఐదో విడత నిధుల విడుదల
-
YSR Kalyanamasthu: వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధుల విడుదల
-
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా ఐదో విడత నిధుల విడుదల
-
పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం పెళ్లి కానుక
గుంటూరు, సాక్షి: పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని.. అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం వైఎస్సార్ కల్యాణమస్తు.. వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం.దీని వల్ల కచ్చితంగా ఈ స్కీమ్‌లో ఎలిజబులిటీ రావాలంటే కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుంది. .. 18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల పదో తరగతి ముందే 15 ఏళ్లు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్‌కు పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మ ఒడి ద్వారా మంచి జరుగుతుంది. కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. .. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది. అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఇస్తున్నాం. ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నాం. కచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్ లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు. మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. బాబు హయంలో కంటే పెంచి.. చంద్రబాబు హయాంలో ఇది నామ్ కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోయాం. గతంలో 40 వేలకు పరిమితమైన ఎస్సీలకు రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతా పెళ్లి అయితే రూ.1.20 లక్షల వరకు తీసుకుపోయాం.ఎస్టీలకు రూ.50 వేలకు పరిమితమైతే రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల దాకా తీసుకుపోయాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంటే దాన్ని రూ.50 వేల వరకు తీసుకుని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని రూ.75 వేల దాకా తీసుకుపోయాం. దివ్యాంగులకు ఏకంగా రూ.1.50 లక్షల దాకా తీసుకుపోయాం. వాళ్ల కుటుంబాల్లో ఏ ఒక్కరూ, తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్ అమౌంట్ పెంచి ఇస్తున్నాం. చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గతంలో అరకొరగా ఇస్తున్న పరిస్థితులు.. దాదాపు 17,709 మంది పిల్లలకు ఇచ్చే అరకొర కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా ఇది 5వ విడత. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించినది ఈరోజు ఇస్తున్నాం. దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం. ఇంత వరకు 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ రూ.427 కోట్లు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులు ప్రోత్సహించేందుకుమరో ముందడుగు వేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల అందరికీ మంచి జరగాలని, ఈ క్వార్టర్ లో ఏకమైన ఈ పిల్లలకు, తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ఇంకా మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని సీఎం జగన్ ప్రసంగించారు. చదువులకు మరింత ఊతమిస్తూనే.. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు "వైఎస్సార్ షాదీ తోఫా" ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. గతంలో కంటే.. గత పాలనలో 17,709 మంది అర్హులకు రూ. 68.68 కోట్ల లబ్ధి ఇవ్వకుండా వదిలేశారు. అయితే సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తున్నారు. ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000 ఎస్సీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000 ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000 ఎస్టీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000 బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000 బీసీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000 మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000 విభిన్న ప్రతిభావంతులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000 భవన, ఇతర నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000 తొలి దఫా.. జమ చేసిన తేదీ (10.02.2023) లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. కోట్లలో 38.18 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్ – డిసెంబర్ 2022) రెండో దఫా.. జమ చేసిన తేదీ (05.05.2023) లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 87.32 (వివాహం జరిగిన త్రైమాసికం జనవరి-మార్చి 2023) మూడో దఫా.. జమ చేసిన తేదీ (09.08.2023) లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ. కోట్లలో 141.60 (వివాహం జరిగిన త్రైమాసికం ఏప్రిల్-జూన్ 2023) నాలుగో దఫా.. జమ చేసిన తేదీ (23.11.2023) లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. కోట్లలో 81.64 (వివాహం జరిగిన త్రైమాసికం జులై-సెప్టెంబర్ 2023) ఐదో దఫా.. జమ చేసిన తేదీ (20.02.2024) లబ్ధిదారులు 10,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 78.53 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023) మొత్తం లబ్ధిదారులు 56,194 అందించిన మొత్తం రూ. కోట్లలో 427.27 -
ఏపీలో దిగ్విజయంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా
-
నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలు
సాక్షి, అమరావతి: పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించేలా అన్ని విధాలుగా సాయ పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పేదల పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేలా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి అందిస్తున్న ఈ సాయాన్ని మంగళవారం మరోసారి అమలు చేయనున్నారు. గత ఏడాది (2023) అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడ పిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ► పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో ఈ పథకానికి పదో తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ళుగా నిర్దేశించారు. చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. సీఎం జగన్ ప్రభుత్వం 1వ తరగతి నుండి ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకు ఇస్తున్నారు. ఈ సాయంతో 17 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి వారి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుంది. ► జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20 వేల వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తుండడంతో పాటు కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో పిల్లలు గ్రాడ్యుయేషన్‌లో చేరతారు. దీని ద్వారా వారు చదువు పూర్తి చేయడంతోపాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది. ► ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఏటా త్రైమాసికం పూర్తయిన వెంటనే సీఎం జగన్ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.427.27 కోట్లు జమ చేశారు. గత చంద్రబాబు పాలనలో 17,709 మంది అర్హులకు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ► ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం ఈ సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి క్రమం తప్పకుండా అందిస్తోంది. ► ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.40 వేలే. ఇప్పుడు సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.1,00,000 ► ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75 వేలే కాగా, ఇప్పుడు సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.1,20,000 ► ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలు కాగా, సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.1,00,000 ► ఎస్టీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75 వేలే కాగా, సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.1,20,000 ► బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.35 వేలు మాత్రమే. సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.50,000 ► బీసీల కులాంతర వివాహానికి గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలే కాగా, ఇప్పుడు సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ. 75,000 ► మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాల పిల్లల వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలు మాత్రమే. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ దానిని రూ.1,00,000కు పెంచి అందిస్తున్నారు. ► విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.1,00,000 కాగా, సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.1,50,000 ► భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.20,000 కాగా, సీఎం జగన్ అందిస్తున్న సాయం రూ.40,000. -
ఓట్లు కోసం కాదు.. సంకల్పంతో అడుగులు
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రకటించినప్పుడు వధూవరులకు పదో తరగతి సర్టిఫికెట్, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండటం తప్పనిసరి అనే నిబంధన ఎందుకు విధించారు? అని నాతో చాలా మంది అన్నారు. అలాంటి షరతులు లేకుండా ఆ పథకాలను అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు. అప్పుడు నేను ఒకటే చెప్పా.. ఓట్లు, ఎన్నికలు అనేవి సెకండరీ అని స్పష్టం చేశా. మేం ఓట్ల కోసం కాకుండా విజన్‌తో అడుగులు వేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నాయకత్వం వహించే స్థానంలో ఉన్నప్పుడు మంచి సంకల్పంతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మన ఉద్దేశం, సంకల్పం మంచిదైతే ఆ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని, సత్సంకల్పానికి పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయని చెప్పారు. ఉన్నత చదువులకు మరింత ఊతమిస్తూ ప్రవేశపెట్టిన వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు సంబంధించి 2023 జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. బాల్య వివాహాలకు తెర.. ఉన్నత చదువులకు ఊతం పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి గౌరవప్రదంగా వారి పెళ్లిళ్లు చేసి వైవాహిక జీవితాలను ప్రారంభించడంలో సహాయంగా నిలిచే మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. మనం లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం మంచిదై ఉండాలి. విజన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మనం వేసే ప్రతి అడుగులోనూ విత్తనం వేస్తున్నాం. ఇదొక ప్రేరణ అంశం కావాలి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 10వ తరగతి సర్టిఫికెట్‌తోపాటు వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు కనీస వయసు ఉండాలని నిర్ణయించడం వల్ల బాల్య వివాహాలను అరికట్టవచ్చు. ఇదొక పరిష్కారం. రెండోది 10వ తరగతి సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా మరింత ఊతం ఇస్తుంది. అమ్మఒడి పథకం ఇప్పుడు ప్రతి తల్లిని మోటివేట్ చేస్తూ తమ పిల్లలను చక్కగా చదివించేలా అడుగులు వేయిస్తోంది. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మీకులు అందరినీ ప్రతి సందర్భంలో అక్కున చేర్చుకుని నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ వారి సంక్షేమ బాధ్యతలను స్వీకరించాం. వారంతా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వారని భరోసా ఇస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. మంచి సంకల్పంతో ముందడుగు.. గత ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉండేదని ఒక్కసారి బేరీజు వేసుకుంటే కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. గత ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకురావాలని, దానివల్ల పేదలకు మంచి జరగాలని ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో అడుగులు వేయలేదు. ఏదైనా ఒక పథకం తీసుకొస్తే సదుద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మంచి చేసే మనసుని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు దాన్ని చేసేందుకు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అలాంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ కళ్యాణమస్తు, షాదీ తోఫా. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. వాటిలో ఇంగ్లిష్ మీడియం చదువులు వచ్చాయి. నాడు – నేడుతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా సిద్ధమయ్యాయి. 6వ తరగతి నుంచి క్లాస్‌రూమ్‌లో డిజిటల్ బోధనతోపాటు ఐఎఫ్‌పీల ద్వారా బోధన కూడా అందుబాటులోకి వచ్చింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు సమకూర్చడంతోపాటు బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్‌తో పిల్లలు గొప్పగా ఎదగాలని తాపత్రయపడుతూ అడుగులు వేస్తున్నాం. తల్లులను ప్రోత్సహిస్తూ.. తలరాతలు మారుస్తూ వీటన్నింటికీ తోడు తమ పిల్లలను బడులకు పంపే విధంగా తల్లులను మోటివేట్ చేస్తూ ‘అమ్మ ఒడి’ తెచ్చాం. అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి పిల్లలను తప్పకుండా ఇంటర్ కూడా చదివిస్తారు. ఒక్కసారి ఇంటర్ వరకు పిల్లలను చదివించాక ఆ తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తోడుగా అందుబాటులో ఉన్నాయనే విషయం మెదడుకు తడుతుంది. విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు అందుతుందని, తమకు రూపాయి కూడా ఖర్చు లేకుండా పిల్లలను చదివించగలమని గ్రహిస్తారు. కాలేజీలలో పిల్లలను చేరిస్తే వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేల వరకు అందుతుందని మనసుకు తడుతుంది. అప్పుడు పిల్లల్ని కనీసం గ్రాడ్యుయేషన్ వరకు చదివించేలా తల్లిదండ్రులు మోటివేట్ అవుతారు. ఒక్కసారి పిల్లలను గ్రాడ్యుయేట్ స్థాయి వరకు చదివించడం వల్ల జనరేషన్ చేంజ్ వస్తుంది. గొప్ప మార్పులకు చిహ్నం.. సంతోషకరమైన విషయం ఏమిటంటే కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇవాళ లబ్ధి పొందుతున్న 10,511 జంటలలో 8,042 మందికి అమ్మ ఒడి / జగనన్న విద్యా దీవెన / జగనన్న వసతి దీవెన ద్వారా కూడా ప్రయోజనం చేకూరిందనే విషయం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఇది గొప్ప మార్పులకు చిహ్నం. రాబోయే రోజుల్లో వంద శాతం నమోదు కావాలని కోరుకుంటున్నా. పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, కార్మీక, ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి గుమ్మనూరు జయరామ్, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. నాడు మూలబడ్డ పథకం చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మారే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు పేదరికం నుంచి బయటపడే గొప్ప పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకునే ఈ పథకాన్ని తెచ్చాం. మనం అధికారంలోకి రాకముందు గతంలో ఇలాంటి పథకానికి పదో తరగతి వరకు చదివి ఉండాలనే నిబంధన లేదు. అది కూడా నాడు అరకొరగా ఇచ్చారు. ఇక 2018 నాటికి పథకాన్నే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. నాడు అసలు ఎప్పుడిస్తారో తెలియదు. ఇచ్చే దాంట్లో పారదర్శకత, మోటివేషన్, చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. కానీ ఈరోజు మనం చిత్తశుద్ధితో, అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తపనతో ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే వెరిఫికేషన్ చేసి కల్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. 10వ తరగతి సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా టెన్త్ వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. దీనివల్ల గొప్ప మార్పు సాకారమవుతుంది. నేడు నిండు మనసుతో గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే అదీ కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. ఇవాళ మనం మైనార్టీలకు నిండు మనసుతో ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెబుతున్నాం. తద్వారా పిల్లలను చదివించేందుకు రూ.లక్ష మైనార్టీలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. దివ్యాంగులకు ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షలు ఇస్తున్నాం. ఎస్సీలకు గత ప్రభుత్వం రూ.40 వేలు మాత్రమే ఇస్తే ఇవాళ మనం రూ.లక్ష ఇస్తున్నాం. ఎస్టీలకు గత సర్కారు రూ.50 వేలు ఇస్తే ఇప్పుడు మనం రూ.లక్ష అందచేస్తున్నాం. ఇక బీసీలకు గతంలో రూ.35 వేలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి నెలకొనగా ఇప్పుడు రూ.50 వేలు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకైతే కులాంతర వివాహాలకు ఏకంగా రూ.1.20 లక్షలు ఇస్తున్నాం. ఇలా చదువులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని గొప్పగా చదివించే దిశగా అడుగులు వేసేలా తోడుగా నిలుస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లే కొద్దీ చాలా మందికి ప్రోత్సాహంగా నిలవాలని తాపత్రయ పడుతున్నాం. 46,062 జంటలకు 349 కోట్ల లబ్ధి ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన వివాహాలకు సంబంధించి 10,511 జంటలను ఆశీర్వదిస్తూ రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ బటన్ నొక్కి పథకం ద్వారా నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటికే మూడు త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఆర్థిక సాయాన్ని అందించాం. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్ల మేర తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లైంది. పెళ్లి సమయంలో ఆదుకుంది నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేశా. మూడు నెలల క్రితం వివాహమైంది. వితంతువైన మా అమ్మ నా పెళ్లి సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. వలంటీర్ వచ్చి వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం గురించి చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నా. నాలాంటి ఎంతోమందికి ఇది ప్రయోజనం చేకూరుస్తోంది. అమ్మకు వితంతు ఫింఛన్ వస్తోంది. పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న మా అమ్మ రుణం తీసుకుని చిన్న కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నాన్న బతికున్న సమయంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైతే ఫింఛన్ అందించారు. మీ ప్రభుత్వం ద్వారా రూ.3 లక్షలకుపైగా లబ్ధి పొందాం. మీ పథకాలతో ప్రభుత్వం పేదలకు పెద్ద సంఖ్యలో ప్రయోజనం చేకూరుస్తోంది. – విశాఖ కలెక్టరేట్ నుంచి పితాని ప్రశాంతి, లబ్ధిదారురాలు పేదింటి బిడ్డల చిరునవ్వుకు మీరే కారణం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చిన్న ఉద్యోగం చేస్తున్నా. మేం ముగ్గురం ఆడపిల్లలం. నా పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. కళ్యాణమస్తు ద్వారా రూ.75 వేలు సాయం అందింది. నాకు చదువుకోవడం అంటే ఇష్టం. స్ధోమత లేకపోవడంతో దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశా. చదుకునేందుకు ఇప్పటి మాదిరిగా ఆర్థిక తోడ్పాటు ఉంటే ఇంకా బాగా చదువుకునేదానిని. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. నాలాంటి పేదింటి బిడ్డల చిరునవ్వుకు మీరే కారణం. మా నమ్మకం, భవిష్యత్ మీరే జగనన్నా! నా తల్లిదండ్రులకు కుమారుడు లేని లోటును మీరు తీర్చారు. – కాకినాడ కలెక్టరేట్ నుంచి దేవి, లబ్ధిదారు పెద్దన్నలా పెళ్లి బాధ్యత తీసుకున్నారు.. నేను డిగ్రీ బయో టెక్నాలజీ చదివా. మేం ఇద్దరం ఆడపిల్లలం. మా ఇంటి పెద్ద కుమారుడిలా మీరు నా పెళ్లి బాధ్యత తీసుకున్నారు. ఎంతోమంది పేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. మాకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరింది. ఎన్నెన్నో పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్నారు. పదో తరగతి పాస్ కావాలనే నిబంధన ఎంతో మంచిది. ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండాలన్న షరతు కూడా మంచిదే. దీనివల్ల బాల్య వివాహాలు ఆగిపోతాయి. మా కడప నగరంలో అభివృద్ధి చక్కగా కనిపిస్తోంది. మీకోసం నేను అల్లాకి దువా చేస్తా. – సయ్యద్ సదఖూన్, లబ్ధిదారు, కడప కలెక్టరేట్ నుంచి చదువులకు ప్రోత్సాహం గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు ఎగ్గొట్టింది. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా మరింత సాయం చేస్తున్నారు. ఇది గొప్ప ఆలోచన. అక్షరాస్యత పెరిగేలా, చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 11.6 శాతం ఉన్న పేదరికం ఈరోజు 6 శాతానికి దిగి రావటానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణం. పేదలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే మేం సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా వాస్తవాలు వివరిస్తున్నాం. యాత్రకు మంచి ప్రజాదరణ లభిస్తోంది. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
వయసు పరిమితి పెట్టడం వల్ల బాల్యవివాహాలు తగ్గుతాయి: సీఎం జగన్
-
పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం సంతోషం: సీఎం జగన్
-
జగనన్న ఇది గొప్ప ఆలోచన..!
-
కుటుంబాల ఆడపిల్లలకు ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ సాయం
-
గతంలో మొక్కుబడిగా పథకాల అమలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయగలుగుతున్నాం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు అందరినీ ప్రతి సందర్భంలో నా..నా..నా అంటూ వారి మీద ఓనర్ షిప్ తీసుకుంటూ, ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు అంటూ భరోసా ఇస్తూ, చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81.64 లక్షల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించాం. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని బేరీజు వేసుకుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో పథకాలు తీసుకురావాలని, పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదు. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం. ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్, 18 సంవత్సరాలు తప్పని సరి అని నాతో చాలా మంది అన్నారు. అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. నేను ఒకటే అన్నాను. ఓట్లు అన్నది, ఎన్నికలన్నవి సెకండరీ. లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం, విజన్ మోస్ట్ ఇంపార్టెంట్. 10వ తరగతి సర్టిఫికెట్, 18 ఏళ్లు వధువుకు, 21 ఏళ్లు వరుడికి ఉండాలని చెబుతామో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గేలా అడుగులు వేశాం. రెండోది 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాయి. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీల బోధన, 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్, 8వ తరగతి వాళ్లకు ట్యాబ్స్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తో పిల్లలు బాగా ఎదగాలని అడుగులు వేస్తున్నాం. తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి తెచ్చాం. తమ పిల్లలను బడులకు పంపేలా మోటివేట్ అవుతున్నారు. 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి, ఇంటర్ దాకా అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి ఇంటర్ చదివిస్తారు. తల్లిదండ్రులకు నష్టం లేదు. అమ్మ ఒడి ద్వారా ఆదాయం వస్తుంది. ఇంటర్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయన్నది మెదడుకు తడుతుంది. పూర్తి ఫీజు అందుతుందని, పిల్లలను చదివించగలమని తడుతుంది. వసతి దీవెన కింద రూ.20 వేల వరకు సంవత్సరానికి వస్తుందన్నది తడుతుంది. పిల్లల్ని గ్రాడ్యుయేషన్ వరకు చదివించేందుకు మోటివేట్ అవుతారు. చదువులన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యే దాకా పిల్లల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇలా చదివించగలగడం వల్ల జనరేషన్ చేంజ్ వస్తుంది. చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పథకం తెచ్చాం. గత ప్రభుత్వంలో పదో తరగతి ఇన్సిస్ట్ చేసే పరిస్థితి లేదు. 2018కి పథకమే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడిస్తారో తెలియదు. ఎక్కడా మోటివేషన్, చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మనం చిత్తశుద్ధి, మోటివేషన్, ట్రాన్స్ పరెంట్గా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, మరుసటి నెల కల్యాణమస్తు, షాదీ తోఫా తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే.. కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. మనం మైనార్టీలకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి పాస్ అయ్యుండాలని చెబుతున్నాం. ఇలా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులంతా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి పోయే కొద్దీ చాలా మందికి మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలని తపన, తాపత్రయం పడుతూ అడుగులు వేస్తున్నాం. దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోంది. గొప్ప మార్పుకు చిహ్నం. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో 100 శాతం కింద రిజిస్టర్ కావాలని తపన, తాపత్రయ పడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. -
నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
సాక్షి, అమరావతి: చదువులకు మరింత ఊతమిస్తూ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.348.84 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. దాదాపు రెండింతల సాయం.. ► గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి రూ.68.68 కోట్లు ఎగ్గొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచింది. ► ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.40,000 కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000. ► కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75,000 కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1,20,000 సాయం చేస్తోంది. ► ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ఈ ప్రభుత్వం రూ.1,00,000 అందిస్తోంది. ► బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.35,000 కాగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.50,000 అందిస్తోంది. ► కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.75,000. ► కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75,000 కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1,20,000 సాయం అందిస్తోంది. ► మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000. ► విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.1,00,000 కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని రూ.1,50,000లకు పెంచింది. ► భవన, ఇతర నిర్మాణ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.20,000 కాగా, దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.40,000లకు పెంచింది. -
పేదల పెద్ద చదువుల కలను సాకారం చేస్తున్న 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా'
-
పేదింటి కన్నీరు తుడిచింది కళ్యాణమస్తు
-
పథకాలతో పెద్ద చదువుల కల సాకారం
-
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా మన లక్ష్యం నెరవేరుతుంది
-
గత ప్రభుత్వానికి,మన ప్రభుత్వానికి తేడా గమనించండి. గతంలో ప్రకటించి ఎగ్గొట్టిన అధ్వాన పరిస్థితి ఉండేది
-
నేడు అందిస్తున్న మూడో విడత సాయం ద్వార అక్షరాల ₹267.20 కోట్లు జమ.. 35,551 మంది జంటలకు మేలు..!
-
చదువులకు మరింత ప్రోత్సాహం..!
-
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు ₹141.60 కోట్ల ఆర్థిక సాయం
-
ఇది జగనన్న నెరవేర్చుతోన్న పేదింటి పెళ్లి కల
-
పెద్ద చదువుల కల సాకారం
నా చెల్లెమ్మలు కనీసం డిగ్రీ వరకైనా చదవాలన్నది నా తపన, తాపత్రయం. ఇందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు పదవ తరగతి ఉత్తీర్ణులవ్వాలని కనీస అర్హత పెట్టాం. తద్వారా అంతవరకు తల్లిదండ్రులు తప్పక చదివిస్తారు. ఆ తర్వాత కూడా అమ్మ ఒడి వల్ల ఇంటర్ వరకూ కాలేజీకి పంపిస్తారు. విద్యాదీవెన, వసతి దీవెన వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని పరిస్థితి తీసుకు రావడం వల్ల డిగ్రీ వరకు చదవాలనే పట్టుదల పెరిగింది. తద్వారా నా చెల్లెమ్మలందరూ మంచి మంచి డిగ్రీలు చదివి.. పేదరికం నుంచి బయట పడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మన కళ్లెదుటే కనిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నా చెల్లెమ్మలు పెద్ద చదువులు చదవాలనే లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా లబ్ధిదారుల్లో 86 శాతం మంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అమ్మాయిలు పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహించడంతో పాటు బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా కళ్యాణ మస్తు, షాదీ తోఫా అమలు ద్వారా వారి పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులెవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి, వారికి లబ్ధి చేకూర్చే మానవత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం ఇదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ ఏడాది ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలందరూ పెద్ద చదువులు చదివి పేదరికం నుంచి బయటకు రావాలన్నదే జగనన్న ప్రభుత్వం కోరిక అని తెలిపారు. అమ్మాయిల పెద్ద చదువుల కోసమే ప్రతీ మండలంలోని హైసూ్కలును ప్రత్యేకంగా వారి కోసం జూనియర్ కాలేజీగా మారుస్తున్నామని చెప్పారు. పేదరికం నుంచి బయట పడేందుకు పెద్ద చదువులే బ్రహ్మాస్త్రంగా ఉండాలని మనందరి ప్రభుత్వం ఆరాట పడుతోందన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే అక్కడే వెరిఫికేషన్ పూర్తి చేసి సర్టిఫికెట్ అందిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. ► వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కార్యక్రమాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడ పిల్లలు గొప్పగా చదివేలా ప్రోత్సహిస్తున్నాయి. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలు కూడా. ఈ రోజు పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవ ప్రదంగా, అప్పుల పాలవ్వకుండా బాగా చేయాలని కోరుకుంటారు. ► అలా పేదరికంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టిలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లల కోసమే ఈ పథకం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని.. ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ► ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయిన వారిలో ఏ కారణంగానైనా లేదా సర్టిఫికెట్ సకాలంలో సమర్పించక పోవడం, అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి కారణాలతో లబ్ధి పొందని వారికి కూడా కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం. ఇల్లాలి చదువు.. పిల్లలకు మేలు ► ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే డిగ్రీ వరకు చదువుకున్న పరిస్థితి ఉంటుందో.. తర్వాత తరంలో తమ పిల్లలను ఇంకా ఉన్నత విద్య వైపు నడిపించే పరిస్థితి ఉంటుంది. తద్వారా పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికీ కనీసం డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలి. అవి కూడా మంచి డిగ్రీలు అయి ఉండాలి. భవిష్యత్‌లో వారు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది. ► ఈ పథకం గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? మన ప్రభుత్వం వచ్చాక ఏ రకమైన మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో చేశామంటే చేశామన్నట్టు మొక్కుబడిగా చేశారే తప్ప.. చిత్తశుద్ధిగా చేయలేదు. పేదల బతుకులు మారాలి.. వారికి మంచి జరగాలన్న ఆలోచన వారికి ఏ రోజూ లేదు. 2018లో 17,709 మందికి దాదాపు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ రోజుల్లో కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు తెచ్చారు. జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువులు ► ఈ రోజు ఈ పథకానికి పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనను తీసుకొచ్చాం. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నాం. నా చెల్లెమ్మలకు 18, తమ్ముళ్లకు 21 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. తద్వారా చెల్లెమ్మలు పదో తరగతి వరకు కచ్చితంగా చదువుతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల వరకు ఎలాగూ ఆగాలి.. అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి.. చదువు కొనసాగిస్తూ ఇంటర్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ – విద్యాదీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలతో డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి పెద్ద చదువులు పూర్తి చేసేందుకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం భరిస్తూ తోడుగా నిలబడుతోంది. ► డిగ్రీలో చేరితే చాలు.. వసతి దీవెన అనే పథకం ద్వారా రూ.20 వేలు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం రెండు దఫాల్లో పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. ఇది మరో ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఫీజు కాకుండా వారు డిగ్రీ చదివేందుకు ఒక్కొక్కరికి రూ.60 వేలు ఇచ్చినట్టవుతుంది. ► ఆ తర్వాత పెళ్లిళ్లు చేసినట్లయితే.. మైనార్టిలకు షాదీతోఫా కింద ఏకంగా రూ.లక్ష ఇచ్చి తోడుగా నిలుస్తున్నాం. గతంలో రూ.50 వేలు మాత్రమే ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం. వికలాంగులకు ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. గత ప్రభుత్వంలో రూ.లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టారు. ► భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో రూ.20 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మనం ఈరోజు రూ.40 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్సీలకు గతంలో రూ.40 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మన ప్రభుత్వంలో రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్టీలకైతే గతంలో రూ.50 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. బీసీలకు గతంలో రూ.30 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మనం ఏకంగా రూ.50 వేలు ఇచ్చి వాళ్లను కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. కులాంతర వివాహాలకు మనం అప్పటి కంటే ఇంకా ఎక్కువ ఇచ్చి మనసు పెట్టి ప్రోత్సహిస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వం ► దూదేకుల, నూర్ బాషాలకు సంబంధించి వాళ్లు కూడా మైనార్టిలే కదా అని సానుకూలంగా పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా రూ.లక్ష పెంచే కార్యక్రమం చేశాం. గతంలో రూ.లక్ష రాని 227 జంటలకు కూడా ఇప్పుడు ఇస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వం ప్రదర్శించాం. దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి చెల్లెమ్మకు, తమ్ముడికి, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. ► ఈ కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ఒక హైసూ్కల్‌ను ప్రత్యేకంగా బాలికల జూనియర్ కాలేజీగా మార్చాం. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా అడుగులు వేగంగా వేస్తున్నాం. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా, మరొకటి ప్రత్యేక బాలికల జూనియర్ కళాశాల. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఉషశ్రీచరణ్, సీఎస్ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. 3 విడతల్లో రూ.267 కోట్లు ► గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేశాం. ఇవాళ మూడో విడతతో కలిపి మొత్తంగా రూ.267 కోట్లు సాయం చేశాం. మొత్తంగా 35,551 జంటలకు మేలు జరిగింది. ప్రతి ఏడాది మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ► ఇవాళ సాయం అందుకున్న 18,883 మంది పిల్లలకు సంబంధించి కొన్ని విషయాలు సంతోషం కలిగిస్తున్నాయి. ఇందులో 18–21 ఏళ్ల వయసులో 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వీటన్నింటి వల్లా లబ్ధి పొంది.. డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు 7,344 మంది ఉన్నారు. అంటే 8,524 మంది చెల్లెమ్మల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులను 86 శాతం మంది చదువుతున్నారు. ► పదో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీలో విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మేలు పొందారు. ఏం సాధించాలని మనం తాపత్రయపడ్డామో అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఎక్కువ మందికి మేలు జరిగే పరిస్థితి రావాలి. ప్రతి చెల్లెమ్మ డిగ్రీ వరకు కనీస చదువు ఉండాలన్నదే మన తపన. పేదలకు ఎంతో ఉపయోగం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో మీరు (సీఎం) చేస్తున్న సాయం పేదలకు ఊరట కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో కంటే ఎక్కువగా సాయం అందిస్తుండటం పట్ల పేదలంతా సంతోషంగా ఉన్నారు. గతంలో పెళ్లి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది. మీ గొప్ప ఆలోచన వల్ల ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగకరం. దీనిపై కూడా ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు కట్టుకథలు రాస్తున్నాయి. వీరికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నా. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నాం అన్నా నమస్తే.. మేం ముగ్గురం ఆడపిల్లలం. మా పేదరికం వల్ల నేను ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో ఉండి చదువుకున్నాను. మీరిచ్చిన విద్యా దీవెన, వసతి దీవెనతో బీఎస్సీ బీఈడీ పూర్తి చేశాను. నాకు తండ్రి లేడు. నా పెళ్లి గురించి చాలా దిగులు పడ్డాను. ఈ స్కీమ్ ఎంతగానో అండగా నిలిచింది. అన్నదమ్ములు లేని నాకు మీరు ఈ విధంగా కూడా సాయం చేసినందుకు చాలా థాంక్స్ అన్నా. మీ పథకాల వల్లే మేం సమాజంలో గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నాం. మళ్లీ మీరే సీఎంగా రావాలి. – ఎం.సుమతి, ఐరాల మండలం, పూతలపట్టు నియోజకవర్గం మా రాతను తిరగరాస్తున్నారు.. అన్నా.. నేను ఎస్టీ, మా వారు ఎస్సీ. మా గ్రామంలో మా పెద్దలు కులాంతర వివాహం చేశారు. ఆ తర్వాత మా సచివాలయం వలంటీర్ వచ్చి మీరు దరఖాస్తు చేస్తే జగనన్న మీకు రూ.1,20,000 సాయం అందిస్తారని చెప్పారు. ఈ రోజు అది నిజమైంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాం. చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఆర్బీకేలు, సచివాలయాలు, క్లినిక్‌ల వల్ల ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతోంది. విధిరాత బ్రహ్మ రాస్తుంటాడని పెద్దలు చెప్పారు. కానీ మా భవిష్యత్‌ను మీరు తిరిగి రాస్తున్నారు. అన్నా.. మీకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. – కిల్లక అనూష, దిగువమండ, పార్వతీపురం మన్యం జిల్లా మీరే లేకుంటే మేం అనాథలమే అన్నా.. నాలాంటి పేద అమ్మాయిలకు ఈ పథకం వరం. నేను శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన మహిళను. అనుకోకుండా నాన్న చనిపోవడంతో అమ్మ కూలి పనులు చేసి ఇల్లు నెట్టుకొచ్చింది. తమ్ముడు ఐటీఐ చదువుకున్నాడు. నా వివాహం వల్ల అమ్మకు ఆర్ధిక ఇబ్బంది కలుగకుండా ఈ పథకం ఆదుకుంది. అమ్మకు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ జరిగింది. వితంతు పింఛన్ కూడా వస్తోంది. మీరే లేకుంటే మేం అనాథలయ్యేవాళ్లం. మీ మేలు ఎప్పటికీ మరచిపోం. – ధనలక్ష్మి, పుల్లేటికుర్రు, అంబాజీపేట మండలం -
పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం
-
చదువు అనే బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ... ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడుతున్నామన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫా అనే ఈ రెండు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడిపిల్లలు గొప్పగా చదివేటట్టు ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలని పేర్కొన్నారు. ‘ఈ రోజు పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవప్రదంగా అప్పులు పాలవ్వకుండా బాగా చేయాలని కోరుకుంటారు. అలా జరగాలని ఆశిస్తారు. అలా పేదరికంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసమే ఈ పథకం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ డిగ్రీవరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. 18,883 జంటలకు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం. ఈ ఏడాది ఏఫ్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయి వారిలో కూడా ఏ కారణంగానైనా సర్టిఫికెట్ సకాలంలో సమర్పించలేకపోవడం, అధికారులు తనిఖీకు వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి రకరకాల కారణాలతో.. ఆ పీరియడ్‌లో రానివారుంటే, అలా మిగిలిపోయిన వారిని కూడా ఇందులో కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం. మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి ఈ రోజు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. గతేడాది అక్టోబరు నుంచి ఈ యేడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేసాం. ఇవాళ మూడో విడత ఇస్తున్నాం. ఇవాళ ఇస్తున్నదానితో కలిపి.. ఈ మూడు విడతల్లో రూ.267 కోట్లు .... పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 35,551 జంటలకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది మూడునెలలకొకమారు చొప్పున నాలుగు విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమం జరుగుతుంది. ఒక నెలపాటు వెరిఫికేషన్ పూర్తి చేసి, మూడు నెలలకు సంబంధించిన ఆర్ధిక సహాయం అందజేస్తారు. 86శాతం మంది డిగ్రీ అమ్మాయిలే... ఇవాళ ఇచ్చే 18,883 మంది పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే... కొన్ని మనసుకు సంతోషాన్నిచ్చే విషయాలు కనిపిస్తాయి. ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిల వివరాల లెక్క చూస్తే.. 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వీటన్నింటి వల్లా లబ్ధి పొంది డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు 7,344 మంది ఉన్నారు. అంటే 8,524 మంది చెల్లెమ్మల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులును 86 శాతం మంది చదువుతున్నారు. పదోతరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీలో విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మేలు పొందారు. అంటే పెళ్లిళ్లు చేసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టి, చదువుమీద ధ్యాసపెట్టి డిగ్రీలు పూర్తి చేసుకుని, చదువులు పూర్తి చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు 86 శాతం మంది ఉన్నారు. నిజంగా మనం అనుకున్న లక్ష్యం, ఏం సాధించాలని మనం తాపత్రయపడ్డామో అది ఈ లెక్కలు చూసినప్పుడు మనకు అర్ధం అవుతుంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం. ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఎక్కువందికి మేలు జరిగే పరిస్థితి రావాలి, ప్రతి చెల్లెమ్మ డిగ్రీవరకు కనీస చదువు ఉండాలి అన్నదే మన తపన. ఇల్లాలి చదువు-తర్వాత తరం పిల్లలకు మేలు... ఇంటి ఇళ్లాలు ఎప్పుడైతే డిగ్రీవరకు చదువుతున్న పరిస్థితి ఉంటుందో.. తర్వాత తరంలో తమ పిల్లలను ఇంకా ఉన్నత విద్యలవైపు నడిపించే పరిస్థితి ఉంటుంది. మనం పెడుతున్న ఈ నమ్మకం వల్ల... పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికీ కనీసం డిగ్రీవరకు చదివి.. ఆ సర్టిఫికేట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలి. అవి కూడా మంచి డిగ్రీలు అయి ఉండాలి. భవిష్యత్‌లో వారి జీవితాలు...పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది. గతానికీ నేటికీ తేడా చూస్తే... ఈ పథకం గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన మార్పులు తీసుకొచ్చింది ? అన్నది ఆలోచన చేస్తే... గత ప్రభుత్వంలో చేశామంటే చేశామన్నట్టు మొక్కుబడిగా చేశారే తప్ప... చిత్తశుద్ధిగా చేయలేదు. పేదల బ్రతుకులు మారాలి. వారికి మంచి జరగాలన్న ఆలోచన ఏ రోజూ జరగలేదు. ఆ రోజు 2018లోనే 17,709 మందికి దాదాపు రూ.68.68 కోట్లు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ రోజుల్లో కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు తెచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తూ... కానీ ఈ రోజు అలా చేయకుండా.. పదోతరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనను తీసుకొస్తున్నాం. పదోతరగతిపాస్ అయ్యేలా తల్లిదండ్రులు ప్రోత్సహించేటట్టు అడుగులు వేస్తున్నాం. నా చెల్లెమ్మలకు 18, తమ్ముళ్లకు 21 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీనివల్ల చెల్లెమ్మలు పదోతరగతి వరకు కచ్చితంగా చదువుతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల వరకు ఎలాగూ ఆగాలి, అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి.. చదువు కొనసాగిస్తూ ఇంటర్ మీడియట్‌కు వెళ్తారు. తద్వారా ఇంటర్లో కూడా అమ్మఒడి డబ్బులు వస్తాయన్నది ఒక ప్రోత్సాహం కాగా.. ఇంటర్ పూర్తి చేస్తారన్నది రెండో అంశం. దానితర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ - విద్యాదీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలతోనూ డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులున్నీ రూపాయి ఖర్చు లేకుండా.. పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ తోడుగా నిలబడుతుంది. అంతే కాకుండా పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి పాప, పిల్లవాడికి కూడా డిగ్రీలో చేరితే చాలు... వసతి దీవెన అనేపథకం ద్వారా రూ.20 వేలు వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం రెండు దఫాల్లో పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. ఇది మరో ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఒక్కో అమ్మాయి, పిల్లవాడి మీద వాళ్ల డిగ్రీలు పూర్తి చేసేందుకు సంవత్సరానికి మరో రూ.60వేలు ఒక్కొక్కరికి ఇచ్చినట్టవుతుంది. అప్పటికి ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండుతాయి. 21 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటే... ఆ తర్వాత పెళ్లిళ్లు చేసినట్లయితే... మైనార్టీలకు గతంలో రూ.50వేలు మాత్రమే ప్రోత్సహకంగా ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు షాదీతోఫా కింద ఏకంగా రూ.1లక్ష ఇచ్చి పెళ్లికి తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. వికలాంగులకు గత ప్రభుత్వంలో రూ.1లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టారు .ఇప్పుడు మనం వారికి ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. భవన నిర్మాణకార్మికులు గత ప్రభుత్వంలో రూ.20వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే... మనం ఈరోజు రూ.40వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్సీలకు గతంలో రూ.40 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్టీలకైతే గతంలో రూ.50వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.ఇక బీసీలకైతే గతంలో రూ.30 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మనం ఏకంగా రూ.50వేలు ఇచ్చి వాళ్లను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. కులాంతర వివాహాలకు అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి మనసు పెట్టి ప్రోత్సాహిస్తున్నాం. పేద పిల్లలు అప్పులు పాలు కాకూడదని.. ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ మనసుపెట్టి ప్రతి పాప, పిల్లవాడు పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చింగా చదువు ఒక్కటే మార్గమని... ఆ చదువుకునేదానికి ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరినీ చదవించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.ఒకవేళ పొరపాటున ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోతే... వారిని కచ్చితంగా మరలా మూడు నెలలకిచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ల దగ్గర నుంచి లోపాలను సరిదిద్ది.. తర్వాత దఫాలో వారిని యాడ్ చేయించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వంతో.. దూదేకుల, నూర్ భాషాలకు సంబంధించిన మైనార్టీ సోదరులకు రూ.50వేలు వస్తుందని చెపితే.. వాళ్లు కూడా మైనార్టీలే కదా అని... దాన్ని కూడా సానుకూలంగా పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా రూ.1లక్ష పెంచే కార్యక్రమం చేశాం. గతంలో రూ.1లక్ష రాని 227 జంటలకు అది కూడా ఇస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వం ప్రదర్శించాం. అర్హులెవరూ మిస్ కాకూడదు, నష్టపోకూడదనే తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ మన ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నా పిల్లలందరూ బాగా చదవాలని, గొప్పగా చదివి, పేదిరికం నుంచి బయటకు రావాలని చేస్తున్నాం. ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ... దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ.. ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్న ప్రతి చెల్లెమ్మకూ, తమ్ముడుకూ, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరిగా.. ఈ కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రతిమండలంలో ఒక హైస్కూల్‌ను ప్రత్యేకంగా బాలికల జూనియర్ కాలేజీగా మార్పు చేసి తీసుకొచ్చాం. ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కాలేజీలు ఉండేటట్టుగా.. అడుగులు వేగంగా వేస్తున్నాం. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా, మరొకటి ప్రత్యేక బాలికల జూనియర్ కళాశాల. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కూడా ఎక్కడకో వెళ్లి చాలా కష్టపడాల్సిన పరిస్థితి నుంచి.. కేవలం గ్రామ సచివాలయంలో దరఖాస్తు పెడితే 30 రోజులలోగా వెరిఫికేషన్ చేసి అక్కడే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే గొప్ప మార్పు చేయగలిగాం. మీరు కూడా ఇంకా ఓరియెంటేషన్ చేయడానికి చొరవ తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అని సీఎం ప్రసంగం ముగించారు. -
నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
-
రేపు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా జమ
సాక్షి, గుంటూరు: పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం మరో విడుత లబ్దిదారులకు అందనుంది. రేపు(బుధవారం) వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల్లో భాగంగా.. అర్హులైన 18,883 జంటలకు లబ్ధి చేకూర్చనున్నారు. ఇందుకోసం రూ. 141.60 కోట్లు ఖర్చు చేయనుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా, అలాగే.. ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఇదీ చదవండి: ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు! -
వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇకపై వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులను బీసీ–బీగా పరిగణిస్తుండటంతో వారికి రూ.50వేలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు కూడా వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని దూదేకుల ప్రతినిధులు ఇటీవల సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా వీరిని ముస్లింలుగానే పరిగణించి లబ్ధిని చేకూర్చేలా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై ఆ వర్గాలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
ఆడబిడ్డల పెళ్ళికి శ్రీరస్తు శుభమస్తు
-
వైయస్ఆర్ షాదీ తోఫా మాకు ఎంతగానో ఉపయోగపడింది
-
వైయస్ఆర్ కళ్యాణమస్తు నాకు ఒక వరం
-
దివ్యాస్త్రం అందుకోండి..
సాక్షి, అమరావతి: పేదరికం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గమని, ఈ దివ్యాస్త్రం ద్వారా పేద కుటుంబాలన్నీ పేదరికాన్ని అధిగమించాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో చదువుల విప్లవానికి జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతోపాటు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సైతం బెంచ్ మార్క్‌గా దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద శుక్రవారం రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకంలో లబ్ధి పొందుతున్న 12,132 జంటల్లో 5,929 జంటలు జగనన్న విద్యా దీవెన.. వసతి దీవెన పొందాయన్నారు. దాదాపు ఆరు వేల జంటలు డిగ్రీ పూర్తి చేయడమో, డిగ్రీ చదవుతుండటమో జరుగుతోందని చెప్పారు. వీటన్నింటి వల్ల ప్రతి పేద కుటుంబం నుంచి చదువుల విప్లవం రావాలని, తద్వారా వారు పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఇందులో భాగంగానే లబ్ధిదారులైన పిల్లలు కనీసం 10వ తరగతి కచ్చితంగా చదివి ఉండాలనే నిబంధన తీసుకొచ్చామన్నారు. అప్పుడే షాదీ తోఫా, కళ్యాణమస్తులు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఇది ఎప్పుడైతే ఎఫెక్టివ్‌గా మైండ్‌లో రిజిస్టర్ అవుతుందో అప్పుడు కచ్చితంగా పదో తరగతి వరకు చదివించాలన్న తపన ప్రతి ఒక్క పేద కుటుంబంలో మొదలవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చదువు కోసమే ఈ తపన ► ఈ పథకాలకు 10వ తరగతి అర్హతతో పాటు అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వయస్సు కచ్చితంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఏ కుటుంబం అయినా పదో తరగతి వరకు తమ పిల్లలను చదివించే సరికి 15 ఏళ్లు వస్తాయి. తర్వాత పెళ్లి కోసం 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి.. ఎలాగూ మనం ‘అమ్మఒడి’ కింద (ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు) సాయం అందిస్తున్నందున ఇంటర్ వరకు చదివిస్తారు. ► ఇంటర్ తర్వాత జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు భారం ఉండదు. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ చదువుతున్న పిల్లలకు రూ.20 వేల వరకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కాబట్టి డిగ్రీ కూడా పూర్తి చేస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదివే ఒక గొప్ప కార్యక్రమం దిశగా అడుగులు పడతాయి. ► దీనికి ప్రోత్సాహకంగా నిలబడేందుకు జగనన్న అమ్మఒడి ఒక బెంచ్ మార్క్ కాగా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రెండో బెంచ్ మార్క్ అవుతుంది. వైఎస్సార్ షాదీతోఫా, కళ్యాణమస్తు మూడో బెంచ్ మార్క్ అవుతుంది. వీటన్నింటితో ప్రతి తల్లి తన పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తారు. అప్పుడే పేదరికం అన్నది పోతుంది. ఇందుకు ఒకే మార్గం చదువులు. డిగ్రీ పాసైతేనే మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. అలా వస్తేనే వాళ్ల తల్లిదండ్రుల కన్నా మెరుగ్గా సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఈ కుటుంబాలన్నీ పేదరికం నుంచి బయటకు రాగలుగుతాయి. ఈ దిశగానే ప్రతి అడుగు వేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ పథకానికి రూపకల్పన ► ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్నికల కోసం ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితులను మార్పు చేస్తూ.. మనసుపెట్టి చిత్తశుద్ధితో ఈ పథకానికి రూపకల్పన చేశాం. గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు దాదాపు రూ.70 కోట్ల డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితులు చూశాం. ► గతంలో ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు. మన ప్రభుత్వం మాత్రం మనసుపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు మంచి జరగాలని మనసా, వాచా, కర్మణా అడుగులు వేస్తోంది. ► గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు ఇస్తే.. దాన్ని రూ.లక్ష చేశాం. ఎస్టీలకు గతంలో రూ.50 వేలు ఇస్తే.. ఇప్పుడు దాన్ని కూడా రూ.లక్ష చేశాం. బీసీలకు రూ.35 వేలు గతంలో ఇస్తే.. ఇప్పుడు రూ.50 వేలు చేశాం. మైనార్టీలకు గతంలో రూ.50 వేలు ఇస్తే ఇప్పుడు రూ.లక్ష చేశాం. విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.లక్ష ఇస్తే.. వారికి కూడా మంచి జరగాలని దానిని రూ.1.50 లక్షలకు పెంచాం. ► పేదరికం నుంచి బయట పడాలంటే చదువే దివ్యాస్త్రంగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా మీ కుటుంబాలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోత్సాహకాన్ని అందుకుంటున్న ప్రతి జంటకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వారి తల్లిదండ్రులకు బెస్ట్ విషెస్. డిగ్రీ పూర్తి చేయించండమ్మా.. కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ఓ యువతిని ఏం చదువుతున్నావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు ఆ యువతి బదులిచ్చింది. డిగ్రీ కొనసాగించి, తప్పకుండా పూర్తి చేసేలా చూడాలని ఆ యువతి తల్లికి సీఎం సూచించారు. -
కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చాం
-
కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చాం. ఈ క్రమంలో కనీసం పదో తరగతి అయిన పేద పిల్లలు చదువుకుంటారు. టెన్త్ కచ్చితంగా చదివి ఉంటేనే కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం అందుతుంది. ఇలా, టెన్త్ చదివించాలనే తపన ప్రతీ కుటుంబంలో మొదలవుతుంది. ఈ పథకాలకు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్ధారించాం. 18 ఏళ్ల నిబంధన వల్ల చదువులు ముందుకు సాగుతాయి. కనీసం డిగ్రీ వరకు చదివే వెసులుబాటు ఉంటుంది. చదువులతోనే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థాయిలోకి వస్తుంది. విద్యాదీవెన, వసతి దీవెన ఉండటం వల్ల కనీసం డిగ్రీ వరకు చదువుతారు. డిగ్రీ వరకు పిల్లల చదవుల భారం ప్రభుత్వమే భరిస్తుంది. అమ్మఒడి మరో ప్రోత్సాహకరంగా ఉంటుంది అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మా కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎలాగూ మనం అమ్మ ఒడి ఇస్తున్నాం ఇంటర్మీడియట్ అయ్యాక.. ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింపచేస్తున్నాం జగనన్న వసతి దీవెనకూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నాం ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాయి జగనన్న అమ్మఒడిఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుంది ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయి ఇంతకుముందు ప్రభుత్వం ఎన్నికలకోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసింది 17709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టింది దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టింది ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు. మనం ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నాం ఎస్టీలకు గతంలో రూ. 50వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బుకూడా ఇవ్వలేదు. మనం వీరికి రూ.లక్ష రూపాయలకు పెంచాం బీసీలకు గతంలో రూ.35వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనం వీరికి రూ.50వేలకు పెంచాం అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచాం ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచాం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్ -
నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ
-
నేడు ‘కళ్యాణమస్తు, షాదీ తోఫా’ నగదు జమ
సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగినట్టవుతుంది. వీరి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. ‘పిల్లల చదువు ఇంటికి వెలుగు– ఇల్లాలి చదువు వంశానికే వెలుగు’ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, బాల్యవివాహాలను నివారించడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడం వంటి సమున్నత లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని చెల్లెమ్మలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వైఎస్సార్ షాదీ తోఫాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.. కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా కాకుండా వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందడానికి పదో తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది. ఇంటర్ వరకు జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు, జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్స్, జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తుండటంతో ఉన్నత చదువులు కూడా సాకారమవుతున్నాయి. చదవండి: AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’ నాడు.. గత టీడీపీ ప్రభుత్వంలో అరకొరగా కొన్ని వర్గాలకే ఆర్థిక సాయం అందేది. అది కూడా సకాలంలో అందరికీ అందేది కాదు. సాయం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేది. అర్హులైన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ నెలల తరబడి జాప్యం చేసి 2018 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తేసింది. 2018–19లో 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టింది. నేడు నేడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. పేదల ఇంట్లో పెళ్లి కూడా ఆనందానుభూతులను మిగిల్చేలా, గత ప్రభుత్వంలో అందిస్తామని ఎగ్గొట్టిన సాయానికి దాదాపు రెట్టింపు ఆర్థిక సాయం. దరఖాస్తు ఇలా.. వధూవరులు వివాహమైన 30 రోజుల్లోపు తమ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో వివరాలను ధ్రువీకరించుకుంటారు. ఏటా ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్‌ల్లో ఆయా త్రైమాసికాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తారు. మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైనవారికి నిర్ధారించిన మేరకు ఆర్థిక సాయం చేస్తారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాల్లో, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. -
కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం ఇకపై పెళ్లి కూతురు తల్లి బ్యాంకు ఖాతాలోకి
సాక్షి, అమరావతి: ఈసారి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబర్ నెలల మధ్య ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అప్పట్లో ఈ ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ చేసింది. అయితే, వివిధ వర్గాల నుంచి అందిన వినతుల మేరకు ఈసారి ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకవేళ తల్లి మరణిస్తే పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా గార్డియన్‌గా వ్యవహరించే ఇతరులకు ఆ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. -
అనంతపురం: సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
చదువే దివ్యాస్త్రం.. పేదవాడి తల రాతలో మార్పు ఖాయం
సాక్షి, అమరావతి: పేదవాడి తలరాత మార్చే అస్త్రం చదువేనని గట్టిగా నమ్ముతూ.. మనందరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి గెలవాలనే చదువులు ఇవ్వడానికి సర్కారు తాపత్రయ పడుతోందన్నారు. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెళ్లిళ్లు చేసుకున్న పిల్లలందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా డబ్బులను వచ్చే త్రైమాసికం నుంచి పెళ్లి కూతుళ్ల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. తల్లులను ప్రోత్సహిస్తేనే ప్లిలలు కనీసం పదో తరగతి వరకు చదువుతారనే కారణంతోనే చాలా మందితో సలహాలు, సూచనలు తీసుకున్నాకే ఇలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పిల్లలను చదివించడానికి వెచ్చించే మొత్తం ఎంతైనా సరే ఖర్చు కింద భావించడం లేదని, దాన్ని పిల్లలకిచ్చే ఆస్తి కింద ఈ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లల చదువుల కోసం ఇవాళ మనం వేసే అడుగుతో పదేళ్ల తర్వాత వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్న ధృక్ఫథం, ఆలోచనతో ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. మూడు నెలలకొకమారు అమలు – అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో పెళ్లి చేసుకున్న వారు.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు అవకాశం ఇచ్చి, ఫిబ్రవరిలో సాయం అందిస్తున్నాం. ఏటా ప్రతి మూడు నెలలకొకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెళ్లి చేసుకున్న వారు ఏప్రిల్ ఆఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెలలో ప్రోత్సాహకం అందిస్తాం. – పిల్లలు బాగుండాలనే తపన, తాపత్రయంతో ఆ కుటుంబాల్లో సభ్యుడిగా ఈ పథకానికి వయస్సుతో పాటు చదువు కూడా అర్హతగా నిబంధన విధించాం. మంచి చదువుల తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో తర్వాతి తరం ఆటోమేటిక్‌గా చదువుల బాట పట్టేలా గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లల చదువులను ప్రోత్సహించడంతో పాటు బాల్య వివాహాలను నివారించడం, డ్రాపౌట్స్ లేకుండా బడులలో చేరే వారి శాతాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఉన్నత విద్య దిశగా అడుగులు – వివాహానికి చెల్లెమ్మలకు కనీస వయసు 18 సంవత్సరాలు, తమ్ముళ్లకు 21 సంవత్సరాలుగా నిర్ణయించడంతో పాటు పదో తరగతి పాస్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలని చెప్పాం. దీంతో ఈ ప్రోత్సాహకం ఒకటి ఉందన్న భావనతోనైనా పదో తరగతి చదవించాలన్న నిర్ణయానికి వస్తారు. – ఆ తర్వాత.. పెళ్లికి 18 ఏళ్లు నిండాలి కాబట్టి.. ఇంటర్ మీడియట్ చదువుతారు. దీనికోసం ఎలాగూ అమ్మఒడి పథకం ఉంది. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన పథకాలున్నాయి కాబట్టి డిగ్రీ వరకు చదివించడానికి అడుగులు ముందుకు వేస్తారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికుల్లో ఆడ పిల్లలున్న కుటుంబాలకు మంచి జరుగుతుంది. – ఉన్నత విద్య తర్వాత ఉద్యోగాల దిశగా అడుగులు వేయిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వీటితో పాటు ప్రపంచ స్థాయి విద్య కోసం వేరే దేశాల్లోని అత్యంత ఉత్తమ కాలేజీల్లో సీట్లు సంపాదించుకునే వారికి.. విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా రూ.1.25 కోట్ల వరకు మంజూరు చేస్తూ మద్దతుగా నిలుస్తున్నాం. సత్య నాదెళ్ల తరహాలో దేశం గర్వించదగ్గ రీతిలో వాళ్లు ఉండాలని ఈ పథకాన్ని తీసుకొచ్చాం. – వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలతో పాటు ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం ద్వారా విద్యా రంగంలో పిల్లలకు మంచి జరగాలని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవాళ లబ్ధి పొందిన 4,536 మందిని పారదర్శకంగా ఎంపిక చేశాం. అర్హులు ఎవరూ మిస్ కాకూడనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు కల్పించాం. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా అక్కడే తీసుకునే అవకాశం కల్పించాం. లంచాలకు, వివక్షకు తావు లేకుండా వలంటీర్ మీ అందరి చేయిపట్టుకుని నడిపించి, సాయం చేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచంతో పోటీ పడి గెలవాలి – ఇవాళ మన పిల్లలు వాళ్ల ఊరి పిల్లలతోనే, పక్క ఊరి పిల్లలలతోనే పోటీ పడటం లేదు. ఇవాళ ప్రపంచమంతా పోటీలో ఉంది. ప్రపంచంలో మన పిల్లలను ఎక్కడైనా సరే నిలబెట్టించి, ప్రపంచంతో పోటీ పడి గెలిచే పరిస్థితులు ఉన్న చదువులు మనం ఇవ్వగలిగితేనే వారి భవిష్యత్ బాగు పడుతుంది. – అందుకే ఈ మూడున్నరేళ్లలో ప్రతి అడుగు ఆ దిశాగానే వేస్తున్నాం. తల్లులను ప్రోత్సహించి పిల్లలను బడికి ప్రోత్సహించేలా అమ్మఒడి పథకం నుంచి మొదలు పెడితే.. అంగన్వాడీలలో పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారంలో నాణ్యతను పెంచుతూ సంపూర్ణ పోషణ అందిస్తున్నాం. రోజుకొక మెనూతో స్కూళ్లలో గోరుముద్ద అమలు చేస్తున్నాం. – పిల్లలకు స్కూళ్లు తెరవగానే పుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌లు, బ్యాగుతో సహా విద్యాకానుక కిట్ ఇస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం, ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషుతో కూడిన బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, 6 వతరగతి మొదలు ఆ పై ప్రతి తరగతిని డిజిటలైజ్ చేస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమం చేపట్టిన స్కూళ్లలో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్(ఐఎఫ్పి)ను ఏర్పాటు చేస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంతో సీబీఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నాం. 8వ తరగతిలోకి అడుగు పెట్టిన ప్రతి విద్యార్ధికి ట్యాబ్‌ను అందించడంతో పాటు బైజూస్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పిల్లలకు చదువుకునే వెసులుబాటు కల్పించాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్పు చేస్తున్నాం. అప్పుడు, ఇప్పుడు ఇదీ పరిస్థితి – గతంలో పెళ్లిళ్లు చేసుకుంటే అరకొరగా సొమ్ములు ఇవ్వడంతో పాటు అవి కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి. ఎన్నికల్లో మేలు జరగాలన్న ఉద్దేశంతో కేవలం ఫౌడర్ కోటింగ్‌లా చేశారు. 2018లో ఏకంగా 17,709 మంది పెళ్లిళ్లకు రూ.68.68 కోట్లు ఇస్తామని చెప్పి పూర్తిగా ఈ పథకానికే ఎగనామం పెట్టారు. – గత ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ప్రకటించి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇవాళ మనం వారికి రూ.లక్ష వరకు పెంచి సాయం అందిస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే గతంలో రూ.75 వేలు ఇస్తామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మనం దాన్ని రూ.1.20 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. గతంలో బీసీలకు రూ.35 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. దానిని మనం రూ.50 వేలకు పెంచి అమలు చేస్తున్నాం. – బీసీల కులాంతర వివాహాలకు వాళ్లు రూ.50 వేలు ప్రకటిస్తే మనం రూ.75 వేలు ఇస్తున్నాం. మైనార్టీలకు గత ప్రభుత్వం రూ.50 వేలు ప్రకటిస్తే మనం రూ.లక్ష ఇస్తున్నాం. వికలాంగులకు గత ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామని ప్రకటించి ఎగురగొట్టి వారికి అన్యాయం చేస్తే.. మనం ఇప్పుడు వారికి రూ.1.50 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం రూ.20 వేలు ప్రకటిస్తే.. మనం ఇప్పుడు వారికి రూ.40 వేలు ఇస్తూ శ్రీకారం చుట్టాం. – ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె హర్షవర్ధన్, మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జి సి కిషోర్ కుమార్, వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఎస్ షన్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పిల్లలకు చదువు అనే ఆస్తిని మనం ఇవ్వలేకపోతే వారి జీవితాలను ఏ రకంగానూ బాగు పరచలేం. ‘మ్యారేజెస్ కెన్ వెయిట్ బట్ ఎడ్యుకేషన్ కెనాట్’ అన్నట్లు పెళ్లిళ్ల కోసం వేచి ఉండవచ్చు కానీ.. చదువు కోసం వేచి ఉండలేము అనే నానుడిని గుర్తుంచుకోవాలి. అందుకోసమే మనందరి ప్రభుత్వం పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చు అయినా సరే అంటూ ఎంతగానో తాపత్రయ పడుతోంది. విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలతో చేయి పట్టుకుని నడిపిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు కనీసం పదో తరగతి పాసవ్వాలంటూ నిబంధన పెట్టింది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
‘చాలా సంతోషంగా ఉన్నాం.. జగనన్న మీరే మళ్లీ సీఎం కావాలి’
సాక్షి, అమరావతి: అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మీ ధైర్యానికి హ్యట్సాఫ్: మంత్రి మేరుగ నాగార్జున అందరికీ నమస్కారం, ఈ రోజు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అనే గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా, సహాయంగా ఉంటాయి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. సీఎంగారు చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్ధమవుతుంది. నాడు బీఆర్ అంబేద్కర్‌గారు ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ అన్న మాట అమలుచేస్తున్నారు. డ్రాపౌట్స్ రేట్స్ తగ్గాయి, ఇటీవల మైసూర్ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో 9 రాష్ట్రాల వారు వచ్చిన సమావేశంలో ఒక్క ఏపీలోనే ఈ రోజు డ్రాపౌట్స్ శాతం తగ్గుతుందని చెప్పారు, ఇది గర్వకారణం. పదవ తరగతి పాసైన వారికే అర్హత అనేది మంచి ఆలోచన, దీని వల్ల చదువుకు ప్రాధాన్యతనిస్తారు. మీ ధైర్యానికి హ్యట్సాఫ్, మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఫలప్రదమవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ గొప్ప కార్యక్రమాల వెంట ప్రజలంతా నడుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ. మా జీవనోపాధి మెరుగైంది: సువర్ణ రత్న నమస్కారం జగనన్నా, అన్నా మా నాన్న కూలీ పనులు చేసి మమ్మల్ని చదివించారు, మమ్మల్ని ప్రయోజకులను చేశారు, పెళ్ళి చేయాలనుకుని ఆలోచిస్తుండగా మాకు ఈ కళ్యాణమస్తు ద్వారా ఆర్ధిక సాయం జరుగుతుందని తెలిసి మేం సంతోషించాం, మాకు ఈ సాయం అందుతుంది, ధన్యవాదాలు అన్నా, మా నాన్న మమ్మల్ని చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అందాయి. మేం పోడు భూములు సాగుచేసుకుంటున్నాం, మీరు మాకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఇవ్వడంతో మాకు రైతు భరోసా సాయం అందుతుంది, ఆ డబ్బుతో మేం వ్యవసాయం చేసుకుంటున్నాం, మా అమ్మకు వైఎస్సార్ చేయూత, ఆసరా అందుతున్నాయి, మా జీవనోపాధి మెరుగైంది, మా చెల్లి కూడా మీ పథకాల వల్ల సాయం పొందింది. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు కుమారులు లేరు. మీరు మాకు అన్నగా ముందుండి నడిపించారు. మా కుటుంబం తరపున, మా పేదలందరి తరపునా మీకు ధన్యవాదాలు అన్నా. ధ్యాంక్యూ. -సువర్ణ రత్న, లబ్ధిదారు, మర్రివలస గ్రామం, అనంతగిరి మండలం, ఏఎస్ఆర్ జిల్లా ధైర్యంగా చదివించారంటే మీరే కారణం: లక్ష్మీదేవి అన్నా నమస్తే, మీరు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు వల్ల మాకు మేలు జరిగింది. దీని వల్ల మాలాంటి చాలామంది ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. కన్నతండ్రికి కూతురు పెళ్ళి చేయాలంటే ఎంత భారమో తెలుసు, కానీ మీరు ఈ పథకం ద్వారా సాయం చేస్తున్నారు. తండ్రులంతా కూడా మా కొడుకులాగా మీరు సాయం చేశారని గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాలాంటి ఎన్నో కుటుంబాలు ఇదే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మేం ఐదుగురు ఆడపిల్లలం, మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా డిగ్రీ పూర్తిచేయగలిగాం, మా నాన్నగారు మమ్మల్ని ధైర్యంగా చదివించారంటే మీరే కారణం. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ మా చెల్లెల్లకు కూడా అన్ని పథకాలు అందుతున్నాయి. మేం స్కూళ్లో చదువుకున్న రోజుల్లో ఇవన్నీ లేవు, తనకు ట్యాబ్ కుడా ఇవ్వడంతో మరింత ఇంట్రెస్ట్‌గా చదువుకుంటుంది, మేం ఐదుగురు ఆడపిల్లలం చదవగలిగాం అంటే మీ పథకాల వల్లే, అందరూ ఆశ్చర్యంగా చూశారు ఎలా చదువుతారని, కానీ మీ పథకాల వల్లే మేమంతా చదవుకున్నాం. మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఎంతోమంది కుటుంబాలకు మీరు మేలు చేస్తున్నారు, మేమంతా మీకు రుణపడి ఉన్నాం, మీరే ఎల్లప్పుడూ మాకు సీఎంగా ఉండాలని ఏడుకొండలవాడిని వేడుకుంటున్నా అన్నా, థ్యాంక్యూ. -లక్ష్మీదేవి, లబ్ధిదారు, రెడ్డివారిపల్లి గ్రామం, తిరుపతి జిల్లా పేదలు చాలా సంతోషంగా ఉన్నారు: -షేక్ సాబా కౌసర్ నమస్కారం, మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతుంటారు, మా వలంటీర్ వచ్చి ఈ పథకం గురించి చెప్పడంతో మా అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ ఒక్కరూ కూడా రూపాయి సహాయం చేయరు కానీ మీరు మాత్రం లక్ష రూపాయల సాయం చేస్తున్నారు, చాలా సంతోషం. మా కమ్యూనిటీలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వారందరికీ పిల్లల పెళ్ళిళ్ళు భారంగా మారాయి, మీరు చేస్తున్న సాయం చాలా ఉపయోగకరం. అలాగే మీరు పదో తరగతి చదవాలని, వయసు 18 నిండాలన్న నిబంధన పెట్టడంతో అందరూ చదివిస్తున్నారు, దీంతో బాల్యవివాహాలు ఆగిపోయాయి, మీ నాన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ముస్లిం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో ఎంతోమంది డాక్టర్లు అవుతున్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు, ఫీజు రీఇంబర్స్మెంట్ వల్ల బాగా చదువుకోగలగుతున్నారు, మా ఇంట్లో మా నాన్నమ్మకు పింఛన్ వస్తుంది, మా చెల్లికి అమ్మ ఒడి రావడంతో తనను కూడా చదివిస్తున్నారు. పేద ముస్లింలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తున్నారు, మా కుటుంబం చాలా పథకాల ద్వారా లబ్ధిపొందింది. ఈ పథకాలతో పేదలు చాలా సంతోషంగా ఉన్నారు, మీరే మళ్లీ మళ్లీ సీఎం అవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను, ధ్యాంక్యూ. -షేక్ సాబా కౌసర్, లబ్ధిదారు, కర్నూలు -
గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబరు-డిసెంబర్ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చాము. ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తిచేసి ఈరోజు నేరుగా వారికి నగదు జమచేస్తున్నాము. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలుచేస్తున్నాము. ప్రతి సంవత్సరంలో ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాము. గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిధులు ఖర్చు చేస్తున్నాము. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. డ్రాపౌట్ రేటు తగ్గించడమే లక్ష్యంగా పథకం అమలు అవుతోంది. ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనసరి. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లుగా నిర్దేశించాము.పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ చదువులు ఆగిపోకూడదు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నాము. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. లంచాలు, వివక్షతకు తావులేకుండా పథకం అమలు చేస్తున్నాము. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలవుతోందన్నారు. గత ప్రభుత్వం బీసీల కులాంతర వివాహాలకు రూ.50వేలు ప్రకటిస్తే.. మన ప్రభుత్వం రూ.75వేలు అందిస్తోంది. మైనారీలకు వాళ్లు రూ.50వేలు ప్రకటిస్తే మనం లక్ష రూపాయలు ఇస్తున్నాము. భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నాము. గతంలో వికలాంగులకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించి వారిని మోసం చేస్తే మన ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకుని లక్ష50వేల రూపాయలు అందిస్తోందన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు పెళ్లిలు అయిన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. -
పేదింటి పెళ్లికి సర్కారు సాయం..‘వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా’ పంపిణీ
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయం నేడు లబ్ధిదారులకు అందనుంది. ఈ పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ధి చేకూర్చనుంది. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే వివాహం చేసుకునే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. లంచాలు, వివక్షతకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తోంది. ఈ పథకం సాయాన్ని ప్రతి మూడు నెలలకు లబ్ధిదారులకు అందిస్తుంది. వివాహమైనవారు 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. -
‘వైఎస్సార్ కల్యాణమస్తు’.. ‘షాదీ తోఫా’.. పెళ్లికి పెద్ద సాయం
సాక్షి, అమరావతి: నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కారాదనే ఉద్దేశంతో ‘వైఎస్సార్ కల్యాణ మస్తు’, ‘షాదీ తోఫా’ పథకాల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, విభిన్న ప్రతిభావంతుల్లో దరఖాస్తు చేసుకున్న 4,536 కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.38.18 కోట్లు పంపిణీ చేయనుంది. గతంతో పోలిస్తే సాయం మొత్తాన్ని భారీగా పెంచింది. ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి, వసతిదీవెన, విద్యా దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో పేదింటి బిడ్డల అభ్యున్నతికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జరిగిన వివాహాలకు సంబంధించి అందిన దరఖాస్తులను జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో ఆర్థిక సాయం చెల్లించనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తులను పరిశీలించి నాలుగో నెలలో లబ్ధి అందించనుంది. మరోవైపు చంద్రబాబు తన హయాంలో నమ్మించి నట్టేట ముంచిన పొదుపు సంఘాల్లోని 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ 3వ విడత వైఎస్సార్ ఆసరా కింద రూ.6,500 కోట్ల పంపిణీకి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. సంక్షేమం, విద్య, పరిశ్రమలకు ప్రోత్సాహకం, ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వాటిని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ.. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లా నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన ఈ నెలలోనే.. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.5 వేల చొప్పున 65,537 వేల మంది జూనియర్ న్యాయవాదులకు మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు అందించింది. ఫిబ్రవరి 17న మరో దఫా వైఎస్సార్ లా నేస్తం సాయం పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 17 వేల మందికి మేలు చేస్తూ రూ.25 కోట్లు చెల్లించింది. ► ఫిబ్రవరి 24న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్. ► అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన ద్వారా ఫిబ్రవరి 28న పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ.700 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. మార్చిలో మరిన్ని.. ► ఉగాది సందర్భంగా మూడో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారం రోజుల పాటు పండగ వాతావరణంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సాయం అందించనుంది. 10–04–2019 నాటికి పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ.25 వేల కోట్లు చెల్లిస్తానని పాదయాత్రలో సీఎం జగన్ ప్రకటించారు. మాట ప్రకారం ఇప్పటికే దాదాపు రూ.13 వేల కోట్లకుపైగా అందించారు. తాజాగా మరో రూ.6,500 కోట్లు ఇవ్వనున్నారు. ► అగ్రవర్ణ పేదల్లో 45 – 60 ఏళ్ల వయసు మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా రూ.600 కోట్లు అందించనున్నారు. దాదాపు 4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ► జగనన్న వసతి దీవెన కింద ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల వరకూ సాయం అందించనుంది. విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ► విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2వతేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకంలో రాగిజావ అందించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు అందచేసేందుకు అదనంగా రూ.86 కోట్లు ఖర్చు చేయనుంది. 320 వర్సిటీలకు జగనన్న విదేశీ విద్యాదీవెన.. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా అత్యధికంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు క్యూఎస్ ర్యాంకింగ్ టాప్ 200 విశ్వవిద్యాలయాలను పరిగణలోకి తీసుకోగా తాజాగా 320కి పెంచారు. ఇకపై దాదాపు 21 సబ్జెక్టులకు సంబంధించి టాప్ 50 కాలేజీలు లేదా విద్యాసంస్థల్లో సీటు సాధించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది. ఇప్పటివరకు కేవలం క్యూఎస్ ర్యాంకును మాత్రమే పరిగణలోకి తీసుకోగా ఇకపై టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ఆధారంగా సీటు సాధించిన వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన అందించనుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, అర్హులైన ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ► ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్ గ్రేడ్. 52 అదనపు పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి ఆమోదం. వైద్యశాఖలో ఇప్పటికే దాదాపు 49 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ► ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతి పీహెచ్సీలో సిబ్బంది 12 నుంచి 14 మందికి పెంపు. కొత్తగా 1,610 పోస్టుల భర్తీ. ► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీతో పాటు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ (ఎఫ్‌ఎస్‌డి)పై నియామకం ప్రతిపాదనకు ఆమోదం. విద్యారంగం.. ► కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(ఎన్ఎల్యూ) ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం. ► సబ్జెక్టు టీచర్లుగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున అలవెన్స్ చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం. ► నాడు – నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతిపైన ఉన్న అన్ని క్లాసులను డిజిటల్‌గా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ప్రతి తరగతి గదిలో ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానెల్ (ఐఎఫ్‌పీ) చొప్పున 30,213 ఐఎఫ్‌పీలు ఏర్పాటుకు ఆమోదం. ► కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల బోధనా సిబ్బందికి గౌరవ వేతనం అదనంగా 23 శాతం పెంపుతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లతో (సీఆర్టీలు) సమానంగా గౌరవ వేతనం చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం. పరిశ్రమలకు ప్రోత్సాహం.. ► గ్రానైట్ పరిశ్రమలకు పూర్వ వైభవం కల్పించేలా ప్రోత్సాహాలు. స్మాల్ స్కేల్ గ్రానైట్ పరిశ్రమలకు యూనిట్ విద్యుత్తు రూ.2కు సరఫరా. ► పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు సంస్థలకు అవసరమైన అనుమతుల జారీకి ఆమోదం. ► ఎకోరన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్ధ సుమారు 1,000 మెగావాట్ల విండ్‌పవర్, 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు అనుమతులు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దశలవారీగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ► అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250, కర్నూలు జిల్లా బేతంచర్లలో 118.8 మెగావాట్లు, అనంతపురం జిల్లా కురుబరాహల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా చిన్న కొలుములపల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా మెట్టుపల్లిలో 100 మెగావాట్లు, జలదుర్గంలో 130 మెగావాట్లతో విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం. ► అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలో 250 మెగావాట్లు, శ్రీ సత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం. మౌలిక వసతుల కల్పన ► ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం.అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో భూముల కేటాయింపు. ► మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణ కోసం రూ.3,940.42 కోట్ల బ్యాంకు గ్యారంటీకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ కేబినెట్ ఆమోదం. ► పెట్టుబడులు, మౌలికసదుపాయాలు కల్పన శాఖలో ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ విభాగానికి చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పోస్టు మంజూరు. ► రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు 250 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు ఆమోదం. ► స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. మరికొన్ని నిర్ణయాలకు ఆమోదం ►కర్నూలు జిల్లా డోన్‌లో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీకి మంత్రిమండలి ఆమోదం. ►వైఎస్సార్ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2015–16లో కేటగిరీ–ఏ తో పాటు తర్వాత విద్యా సంవత్సరాలకు సంబంధించి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు అంశాన్ని స్పెషల్ కేసుగా పరిగణించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇందులో భాగంగా రూ.9,12,07,782 చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్. ►1998 డీఎస్సీలో అర్హత సాధించిన 4,534 మంది అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు కల్పించాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. వీరికి మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) వర్తింపజేయనుంది. ప్రాథమిక విద్యాశాఖతో పాటు ఖాళీలను అనుసరించి బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ స్కూళ్లలో పోస్టులను భర్తీ చేయనుంది. ►విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ సెంటర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం 60.29 ఎకరాలు వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ (వీటీపీఎల్)కు కేటాయింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. వైజాగ్ టెక్ పార్కు ద్వారా 14,825 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ►రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి 10 ప్రిన్సిపాల్, 138 బోధనా సిబ్బంది, 36 నాన్ టీచింగ్ పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి ఆమోదం. ►విజయవాడలోని ఏపీ జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్టు భర్తీకి ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌లో 29 అదనపు పోస్టుల భర్తీ. ►గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ స్కూల్‌కు వేకెంట్ ల్యాండ్ టాక్స్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీల చట్టం–1965, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం– 1955లకు సవరణలకు సంబంధించి డ్రాప్ట్ బిల్లుకు ఆమోదం. ►పట్టణ స్థానిక సంస్థల్లో సమగ్ర భూముల రీ సర్వేకు అవసరమైన సవరణలకు ఆమోదం. ►ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్ (అకౌంట్స్) పోస్టు ఏర్పాటుకు ఆమోదం. ► ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి 20 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు ఆమోదం. 16 అర్బన్ లోకల్ బాడీస్ (ఒంగోలు, నెల్లిమర్ల, పాలకొండ, శ్రీకాకుళం, వినుకొండ, అనంతపురం, ప్రొద్దుటూరు, కావలి, పిఠాపురం, రాయచోటి, గూడూరు, పెద్దాపురం, కడప, బద్వేలు, వెంకటగిరి, చిలకలూరిపేట)లలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 కే అద్దె ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ►నెల్లూరు బ్యారేజీని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజ్‌గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ►ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్లో జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో 14 ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ల భర్తీకి నిర్ణయం. విజయనగరంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. లీగల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్స్ సజావుగా నడిచేందుకు వీలుగా సపోర్టింగ్ స్టాప్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం. ►మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ మంత్రివర్గం ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ వ్యాట్–2023 బిల్లు సవరణ, టీటీడీ ఐటీ విభాగం(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్)లో 34 పోస్టుల భర్తీ, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్వీఐటీఎస్ఏ)లో 12 పోస్టుల భర్తీకి ఆమోదం. ►పశు సంవర్థకశాఖలో నిపుణుల కొరత తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ 2023 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ► ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్)లో 105 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. -
కళ్యాణమస్తు దరఖాస్తుకు 31 వరకు అవకాశం.. ఈ మార్గదర్శకాలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు అందిన దరఖాస్తులకు నగదు బదిలీకి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవననిర్మాణ కార్మికులు(బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందించేందుకు గతేడాది అక్టోబర్ 1న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అర్హులు ఈ పథకానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు త్రైమాసికాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత 15 రోజుల్లో సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో పరిశీలించి నగదు బదిలీ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన వివాహాలకు ఈ నెల 31 వరకు నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి ఫిబ్రవరిలో నగదు బదిలీ చేయనున్నారు. ఈ మార్గదర్శకాలు తప్పనిసరి విద్యను ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకానికి కొన్ని నిబంధనలు విధించింది. వధూవరులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండడంతోపాటు వివాహతేదీ నాటికి వధువుకి 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల వయసు ఉండాలని నిర్దేశించింది. వివాహం జరిగిన 60 రోజుల్లోగా నవశకం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం గత ఏడాది అక్టోబర్ 1 తర్వాత వివాహాలు చేసుకున్నవారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అందిన దరఖాస్తులను సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో 15 రోజుల్లో ఆడిట్ చేస్తారు. ఇలా ఏడాది కాలంలో జరిగిన వివాహాలకు నాలుగు విడతలుగా (ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ త్రైమాసికాల్లో) ఆర్థికసాయం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. -
AP: సర్కారు వారి పెళ్లికానుక.. అర్హతలు ఇవే.. దరఖాస్తు చేయడం ఇలా..
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నమోదైన కార్మికులకు లబ్ధి చేకూరుస్తారు. షాదీతోఫా పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు మేలు కలుగుతుంది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 1 తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 32 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. అన్ని స్థాయిల్లోనూ సమగ్ర పరిశీలన పూర్తయ్యాక అధికారిక ఆమోదం కోసం కలెక్టర్‌కు ఈ దరఖాస్తులు పంపుతారు. దరఖాస్తు చేయడం ఇలా.. వివాహం జరిగిన 60 రోజుల్లోగా ఆయా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. తొలుత సచివాలయాల ద్వారా వివాహ సర్టిఫికెట్ పొందాలి. అనంతరం నిబంధనల మేరకు వివాహ ధ్రువపత్రాలను దరఖాస్తులో పొందుపర్చాలి. ముఖ్యంగా పెళ్లిపత్రిక, పెళ్లి సమయంలో తీయించిన ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతా జిరాక్స్ సమర్పించాలి. వధూవరుల చదువుకు సంబంధించి పదో తరగతి ఉత్తీర్ణత సరి్టఫికెట్ల జిరాక్సు కూడా దరఖాస్తుకు జత చేయాలి. భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఈ పథకాలపై వైఎస్సార్ క్రాంతిపథం సిబ్బంది తమ పరిధిలోని సంఘాల సభ్యుల ద్వారా ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్హతలు ఇవే... ♦వివాహమయ్యేనాటికి వరుడికి 21, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి ♦భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే ♦వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ♦కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు ♦భూమి పల్లం 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు ♦కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్‌దారు అయ్యి ఉండకూడదు ♦పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది ♦కారు ఉండరాదు. ఆటో, ట్రాక్టర్, ట్యాక్సీకి మినహాయింపు ఉంది ♦కుటుంబం నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించరాదు ♦మున్సిపల్ ప్రాంతంలో 1000 ఎస్ఎఫ్టీకి మించి నివాస స్థలం ఉండరాదు -
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాపై విస్తృత అవగాహన
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలను అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో అమలుచేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని.. ఇందుకోసం ఈ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వివాహాల సంఖ్యతో పోలిస్తే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫాల రిజి్రస్టేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ తెలిపారు. ఏ పథకమైనా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వర్తించడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధానమని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. నాడు అర్హులను ఎలా తగ్గించాలన్నదే ధ్యాస నిజానికి.. గత ప్రభుత్వం ఏ పథకానికైనా అర్హులను ఎలా తగ్గించాలని ఆలోచిస్తే అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దరఖాస్తులు తక్కువగా ఎందుకు వచ్చాయని ఆలోచిస్తోంది. అంతేకాక.. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి అర్హులందరూ రిజి్రస్టేషన్ చేయించుకునేలా చర్యలను చేపడుతోంది. ఇక గత ఏడాది అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఈ నెల 4 వరకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాకు 7,203 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వివాహాల సంఖ్యతో పోలిస్తే ఈ రెండు పథకాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు చర్యలను చేపట్టాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. ఈ రెండింటి కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి పక్షం రోజుల్లోగా డిజిటల్ వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దరఖాస్తులు పెండింగ్ లేకుండా కూడా సకాలంలో ఆమోదించాలని కలెక్టర్లకు సూచించారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి వివాహ ధ్రువీకరణ పత్రాలను ఆమోదించాలన్నారు. నియమ నిబంధనలివే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మైనార్టీ వర్గాలు, భవన కారి్మకుల కుటుంబాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. వివాహమైన 60 రోజుల్లోపు దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు చేసుకుని పొందవచ్చును. వరుడు, వధువు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలని, అలాగే వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడు వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. గ్రామాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం గల వారు ఇందుకు అర్హులు. -
వైఎస్సార్ షాదీ తోఫాకు దూదేకులు అర్హులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ షాదీ తోఫా విషయమై జిల్లా స్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ పేర్కొన్న నేపథ్యంలో.. వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ఇంతియాజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (‘చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు’) -
కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో
సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): పెళ్లంటే నూరేళ్ల పంట... మామిడాకులు, అరటి కొమ్మలు.. టెంకాయ పట్టలతో పెళ్లంటే పెద్ద సందడి. అయితే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టిచూడు అన్న సామెత ప్రకారం పెద్ద ఖర్చుతో కూడుకున్న తంతు. అందుకే నిరుపేదల పెళ్లిళకు ప్రభుత్వం కూడా తనవంతు సాయంగా కానుక అందించేందుకు సిద్ధమైంది. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు అయితే ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు చదువును ప్రోత్సహించడం, డ్రాపౌట్స్‌ను తగ్గించి అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన విధించింది. ఇకనుంచి కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. గతంలో టీడీపీ హయాంలో అంతంత మాత్రంగా అందిస్తుండగా, దాన్ని రెట్టింపు చేసి వైఎస్ జగన్ సర్కార్ శనివారం నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద అందించనుంది. వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్ అసిస్టెంట్(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చదువుకు సరి'జోడు'
సాక్షి, అమరావతి: పిల్లల చదువులను ప్రోత్సహించడం–బాల్య వివాహాల నిరోధం లక్ష్యంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టి మరో విప్లవాత్మక అడుగు వేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లో పేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించే ‘వైఎస్సార్ కళ్యాణ మస్తు’ పథకంతోపాటు ముస్లిం మైనారిటీ యువతుల కోసం ‘వైఎస్సార్ షాదీ తోఫా’ను సీఎం శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. 2 పథకాల వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. పేదరికాన్ని గట్టెక్కించే అస్త్రం పిల్లలంతా కచ్చితంగా చదువుకోవాలని అడుగులు వేస్తూ మూడేళ్లుగా విద్యారంగంపై అత్యధిక శ్రద్ధ తీసుకున్నాం. విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తెచ్చాం. పిల్లలకు చదువులన్నవి ఒక ఆస్తి. పేదరికం నుంచి బయటపడేసే ఏకైక అస్త్రం చదువులే. ఆ దిశగా మనసా వాచా కర్మణా అడుగులు వేస్తున్నాం. పిల్లలను బడికి పంపిస్తున్న తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యాకానుకతోపాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. నాడు –నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. వాటి నిర్వహణ కోసం టీఎంఎఫ్ (టాయిలెట్ మెయింట్‌నెన్స్ ఫండ్), ఎస్‌ఎంఫ్ (స్కూలు మెయింట్‌నెన్స్ ఫండ్) ఏర్పాటు చేశాం. పెద్ద పిల్లల చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు చేపట్టాం. కరిక్యులమ్‌లో మార్పులు, జాబ్ ఓరియెంటెడ్ పాఠ్యప్రణాళికలు తీసుకొచ్చాం. కచ్చితంగా టెన్త్ చదివించేలా.. పిల్లలు చదువుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలనే తపన, తాపత్రయంతో ఇవాళ వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రారంభిస్తున్నాం. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందే పిల్లలు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన విధించాం. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా పదో తరగతి చదివించేలా దోహదం చేస్తుంది. ఇంటర్ కూడా చదువుకునే అవకాశం పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇది రెండో నిబంధన. దీనివల్ల పిల్లలంతా చదువుకునే పరిస్థితి వస్తుంది. టెన్త్ పాసైన తర్వాత 18 ఏళ్ల వరకూ పెళ్లి చేసుకోలేరు కాబట్టి తదుపరి విద్యాభ్యాసంపై దృష్టి సారిస్తారు. 18 ఏళ్లు దాటకుంటే ఈ పథకాలు వర్తించవు కాబట్టి ఇంటర్ చదువుకునే అవకాశం వస్తుంది. ఇలా మార్పులు తేవడంతో పిల్లలు తప్పనిసరిగా చదివే పరిస్ధితి వస్తుంది. తద్వారా గొప్ప మార్పు వస్తుంది. దూరదృష్టితో.. ఎంతో ఆలోచనతో తలిదండ్రులు విద్యావంతులైతే వారి పిల్లలకూ చదువుల విలువ తెలియచేసే పరిస్థితి ఉంటుంది. ఈ తరాల కోసం మాత్రమే కాకుండా దూరదృష్టితో, ఎంతో ఆలోచనతో ఈ పథకాలను తెచ్చాం. ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వైఎస్సార్ కళ్యాణమస్తుతో మంచి జరుగుతుంది. ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. నాడు.. 17,709 మందికి రూ.68.68 కోట్లు ఎగ్గొట్టారు గత ప్రభుత్వ హయాంలో పెళ్లికానుక అనే పథకాన్ని ప్రకటించి 2018లో నిలిపివేశారు. అది పిల్లలెవరూ చదువుకోవాలనే తాపత్రయంతో పెట్టిన పథకం కాదు. ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ప్రకటించారు. తర్వాత పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టారు. నేడు.. రెట్టింపు ప్రోత్సాహకాలు ఇప్పుడు మనందరి ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఈ పథకాలు వర్తించేలా అన్ని చర్యలూ తీసుకుంది. వివక్ష, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా అమలులో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. గత సర్కారు ప్రకటించిన దానికన్నా దాదాపు రెట్టింపు ప్రోత్సాహాలు ఇప్పుడు ఈ పథకాల ద్వారా అందుతాయి. జంట పథకాలు.. రెట్టింపు ప్రోత్సాహకాలు గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.లక్ష ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం రూ.75 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.1.20 లక్షలు ఇస్తున్నాం. గతంలో బీసీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. ఇప్పుడు మనం రూ.50 వేలు ఇస్తున్నాం. బీసీల కులాంతర వివాహాలకు నాడు రూ.50 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.75 వేలు ఇస్తున్నాం. మైనార్టీలకు గత ప్రభుత్వం రూ.50 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.లక్ష ఇస్తున్నాం. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం రూ.లక్ష ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.1,50,000 ఇస్తున్నాం. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు గత సర్కారు రూ.20 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.40 వేలు ఇస్తున్నాం. చదువులతో పథకాలకు లింక్ ఇవన్నీ కూడా చదువులతో కనెక్ట్ అయిన పథకాలు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే... అమ్మ ఒడి ద్వారా చదువుల బాట పట్టే పిల్లలు ఎక్కడా డ్రాప్ అవుట్స్‌గా మిగిలిపోకూడదు. ఈ పథకాలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. పెళ్లైన 60 రోజుల్లో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వలంటీర్ల సహకారంతో సంబంధిత డాక్యుమెంట్లు, పత్రాలు సమర్పించాలి. వివాహ సర్టిఫికెట్ సచివాలయాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింపచేస్తాం. అక్టోబరు, నవంబరు, డిసెంబరులో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు జనవరిలో ప్రోత్సాహకం అందుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి లబ్ధిదారులకు ఏప్రిల్‌లో ప్రయోజనం చేకూరుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి జూలైలో ప్రోత్సాహకం అందుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు లబ్ధిదారులకు అక్టోబరులో ప్రోత్సాహం అందిస్తాం. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులకు ప్రోత్సాహకాలు అందచేస్తాం. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ మోహన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
కళ్యాణమస్తు, షాదీ తోఫా: వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాదు.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా ‘‘వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానుండగా.. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 30న లాంఛనంగా ప్రారంభించారు. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. చదువును ప్రొత్సహించేందుకే ఈ నిబంధనను తప్పనిసరిని చేసింది ప్రభుత్వం. ఇక వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని ప్రభుత్వం తెలిపింది. ఆర్థికసాయం భారీగా పెంపు గత ప్రభుత్వంతో పోలిస్తే.. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులకు ఆర్థిక సాయం భారీగా పెంచింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్సీలకు రూ.1,00,000, ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్టీలకు రూ.1,00,000, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బీసీలకు రూ.50,000, బీసీల కులాంతర వివాహాలకు రూ.75,000, వైఎస్సార్ షాదీ తోఫా కింద.. ముస్లిం మైనారిటీలకు రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, వీళ్లకేగాక భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా అందించనుంది.